పుచ్చకాయ / Watermelon: Difference between revisions

From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | పుచ్చకాయ / Watermelon |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Cucurbitales |- ! Family | Cucurbitaceae |- ! Genus | Citrullus |- ! Scientific Name / Latin Name | Citrullus lanatus (Thunb.)..."
 
 
Line 60: Line 60:


== మూలాలు ==
== మూలాలు ==
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 530, 531)
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 530, 531) - రచయిత: డా|| టి. భిక్షపతి
* రచయిత: డా|| టి. భిక్షపతి


[[Category:Indian medicinal plant]]
[[Category:Indian medicinal plant]]
[[Category:sciwiki plant]]
[[Category:sciwiki plant]]

Latest revision as of 09:45, 11 September 2026

పుచ్చకాయ / Watermelon
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Citrullus
Scientific Name / Latin Name Citrullus lanatus (Thunb.) Matsum. & Nakai

గుండ్రంగా, కోలాగా పైన ఆకుపచ్చ లేదా తెల్లటి మచ్చలు కలిగి ఉండే పండు పుచ్చపండు. వేసవికాలంలో వీటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలోని గుజ్జు ఎర్రగా లేదా లేతగులాబి రంగులో ఉంటుంది. గింజలు నల్లగా, ఎర్రగా లేక తెల్లగా ఉంటాయి. పుచ్చపండు చాలా రుచిగా, మధురంగా, చల్లగా ఉంటుంది. వేసవియందు దీనిని తిన్న దప్పిక తీరుతుంది. తృప్తిగా ఉంటుంది. పుచ్చపండు శీతలము మరియు గురుగుణములు కలిగి ఉండును పండిన కాయ కొంచెము ఉష్ణముగా ఉంటుంది. ఇది కఫవాతములను హరించును. పిత్తమును వృద్ధి చేయును.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: కాలింగ ;
  • హిందీ: తర్పూజ్ ;
  • తెలుగు: పుచ్చపండు ;
  • ఇంగ్లీష్: వాటర్మిలాన్ ;
  • లాటిన్: సిట్రుల్లస్ వల్గారిస్ ;
  • కుటుంబము: Cucurbitaceae ;

పోషక విలువలు

పుచ్చకాయలోని పోషక విలువలు:

  • తేమ: 92 గ్రా
  • ప్రొటీన్లు: 1.0 గ్రా
  • కాల్షియం: 7.0 మి.గ్రా
  • పాస్పరస్: 7.0 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 599 ఆం.యూనిట్స్
  • విటమిన్ - బి1: 0.05 మి.గ్రా
  • విటమిన్ - బి2: 0.05 మి.గ్రా మరియు
  • ఆస్కార్బిక్ ఆసిడ్: 6 మి.గ్రా కలవు.
  • నియాసిన్: 0.2 మి.గ్రా
  • క్లోరిన్: 43.5 మి.గ్రా
  • మెగ్నీషియం: 20 మి.గ్రా
  • కాఫర్: 0.04 మి.గ్రా
  • కేలరీలు: 17 కలవు.
  • ఇందులో ఎక్కువగా ఎంజైమ్‍యూరేజ్ కలదు. జ్యూస్‌నందు సిట్రుల్లిన్ 0.17% కలదు. మరియు మానిటాల్లు ఇందులో కలవు. ఇంకా పెక్టిన్ ఎక్కువ శాతంలో ఉంది. ఎక్కువ శాతంలో నీరు ఉంటుంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మూత్ర సంబంధ సమస్యలు: పుచ్చకాయ తినటం వలన మూత్రం సాఫీగా అవుతుంది. (డైಯೂరిటిక్) దీనిని మూత్రకృచ్ఛము, కిడ్నీలలో రాళ్ళు, గాల్‌స్టోన్స్, మరియు మధుమేహం నందు వచ్చే కీటోసిడోసిస్ నందు వాడవచ్చు.
  • శరీర వేడి & నిర్జలీకరణం: పుచ్చకాయ వేసవి విరేచనాలను తగ్గిస్తుంది. వేడిని తగ్గిస్తుంది. నీరసం, నిస్త్రువ, అతిగా చెమట పోయటం, శోష, వడదెబ్బలను తగ్గిస్తుంది. దీనిని సేవింపటం వలన శరీరం తేలికగా ఉంటుంది.
  • గుండె జబ్బులు & హైపర్ టెన్షన్: పుచ్చపండు జ్యూస్ గుండెజబ్బులలో మరియు హైపర్ టెన్షన్లందు ఎంతొ ఉపయోగకరం. శరీరంలోని సోడియాని బయటకు పంపిస్తుంది.
  • శక్తి & ఇన్ఫెక్షన్లు: పుచ్చపండు జ్యూస్ నందు గ్లూకోజ్ మరియు నిమ్మరసం కలిపి ఇచ్చిన శక్తిని కలిగిస్తుంది. బలాన్నిస్తుంది. కలరా, గ్యాస్ట్రో ఎంట్రైటిస్, డీహైడ్రేషన్, అతిసారం, జిగురువిరేచన రోగులకు చక్కని ఉపశమనము కలుగుతుంది.
  • రక్తపోటు & క్షయవ్యాధి: పుచ్చపండు గింజలను మెత్తగా నూరి రసము తీసి త్రాగిన అధిక రక్తపోటు, మూత్రంలో మంట మూత్రం కష్టంగా వెడలటం క్షయవ్యాధి, గనేరియా రోగులకు చాలా ఉపయోగకరం.
  • సమస్థితి: పుచ్చపండు తినటంవలన శుష్మించిన శరీరము కలవారికి, ఉష్ణతత్వము కలవారికి సమస్థితి కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 530, 531) - రచయిత: డా|| టి. భిక్షపతి