వచా / Sweet Flag: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | వచా / Sweet Flag |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Alismatales |- ! Family | Araceae |- ! Genus | Acorus |- ! Scientific Name / Latin Name | Acorus calamus L. |} వచా (Acorus calamus L.) అ..." |
|||
| Line 50: | Line 50: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 599-600) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 599-600) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 07:34, 11 September 2026
| వచా / Sweet Flag | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Liliopsida |
| Order | Alismatales |
| Family | Araceae |
| Genus | Acorus |
| Scientific Name / Latin Name | Acorus calamus L. |
వచా (Acorus calamus L.) అరేసి (Araceae) కుటుంబానికి చెందినది. వచా చక్కని సుగంధ భరితమైన బహువార్షిక క్షుపము. వచావేళ్ళుచాలా చక్కని సువాసనకలిగి ఉంటాయి. హిమాలయాలలో ఎక్కువగా పెరుగుతుంది. కర్ణాటక మరియు ఇతర రాష్ట్రంలో దీనిని పెంచుతున్నారు. వచా కటు తిక్తరసము, లఘు తీక్షణ గుణము, ఉష్ణవీర్యము మరియు కటువిపాకములను కలిగి ఉంది. వచా మేద్యము, కఫవాత శామకము మరియు లేఖనీయ గుణములను కలిగి ఉంది. వచాను జ్ఞాపకశక్తి లోపించటము, మాటలు సరిగా ఉచ్ఛరింపలేక పోవటం, అధిక రక్తపోటు మరియు ఆంక్సైటీ లాంటి వ్యాధులలో ఉపయోగిస్తున్నారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : వచా
- హిందీ : వచా
- తెలుగు : వసా
- లాటిన్ : అకోరస్ కలామస్ లిన్నెయెస్
- కుటుంబము : Araceae
- ఇంగ్లీష్ : స్వీట్ ఫ్లాగ్
పోషక విలువలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన పోషక విలువల వివరాలు పేర్కొనబడలేదు)
మరియు వచావేళ్ల యందు యూజినాల్, కెఫైన్, ఎక్రోసిన్, ఎసారి, ఆల్డిహైడ్ అనేవి ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- దగ్గు & ఆస్తా: వచా ముక్కలను నోట్లో వేసుకొని కొద్దిగా నమిలి ఆ ఊటను మ్రింగుతున్న దగ్గు, ఆస్తారోగులకు చక్కని ఉపశమనము కలుగుతుంది. వచా చూర్ణాన్ని తేనేతో కలిపి సేవిస్తూ పాలతో కూడిన ఆహారాన్ని భుజించిన అపస్మారకము శమిస్తుందని శస్త్రకారుల అభిప్రాయము.
- అధిక రక్తపోటు (హైపర్టెన్షన్): వచా, బ్రాహ్మి, అర్జున లాంటి ఔషధాలనుసమంగా తీసుకొని 3 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు వాడిన అధికరక్తపోటు (హైపర్టెన్షన్) అదుపులో ఉంటుంది.
- జ్ఞాపకశక్తి & ఆంక్సైటీ న్యూరోసిన్: వచాను మెత్తగా నూరి మాత్రలుచేసుకొని పాలతో సేవిచిన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వచా మరియు బ్రాహ్మీలను సమభాగములుగా తీసుకొని 3 గ్రాములు చొప్పున ఉదయం సాయంత్రం వాడిన ఆంక్సైటీ న్యూరోసిన్ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి.
- ఇరిడెబవల్ సిండ్రోమ్ & కడుపులో మంట: వచా చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు 3 గ్రా తీసుకున్న యెడల ఇరిడెబవల్ సిండ్రోమ్ నందు अत्यंत ఉపయోగకరం. వచా చూర్ణాన్ని బెల్లంతో కలిపి తిన్న కడుపులో మంట తగ్గుతుంది.
- పిల్లలలో ఉచ్చారణ సమస్యలు: వచా చిన్నపిల్లలకు అతి ముఖ్యమైన ఔషధము పిల్లలు సరిగా మాటలాడకున్నా సరిగా ఉచ్చారణ లేకపోయినా వచాను అరగదీసి దానిని తేనేతో కలిపి పిల్లలకు నోటికి పట్టించిన చక్కని ఉచ్చారణ వారి సొంతమౌతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- వచా యొక్క క్లోరోపాము ఎక్స్ట్రాక్ట్నకు యాంటికన్సల్ జెంట్ గుణాలున్నట్లు పరిశోధనలో గమనించారు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 599-600) - రచయిత: డా|| టి. భిక్షపతి
