కరక్కాయ / Haritaki: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
|+ '''కరక్కాయ / Haritaki''' | |+ '''కరక్కాయ / Haritaki''' | ||
|- | |- | ||
| colspan="2" style="text-align: center;" | | |||
[[File:Haritaki (Terminalia chebula) fruits.jpg|250px|కరక్కాయ పండ్లు (Haritaki)]] | |||
|- | |||
! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification | ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification | ||
|- | |- | ||
| Line 82: | Line 85: | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 405, 406, 407) - రచయిత: డా|| టి. భిక్షపతి | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 405, 406, 407) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
* పుస్తకం: ''పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం'' (పేజీ: 51) - రచయిత: డా॥ నిష్ఠేశ్వర్ M.D., Ph.D. | * పుస్తకం: ''పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం'' (పేజీ: 51) - రచయిత: డా॥ నిష్ఠేశ్వర్ M.D., Ph.D. | ||
* చిత్రం: ''Haritaki (Terminalia chebula) fruits.jpg'' — Salil Kumar Mukherjee, Wikimedia Commons, CC BY-SA 4.0. | |||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 10:25, 18 September 2026
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Magnoliopsida |
| Order | Myrtales |
| Family | Combretaceae |
| Genus | Terminalia |
| Scientific Name | Terminalia chebula Retz. |
కరక్కాయ చెట్టు సమారు 15 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అడవి అన్నింటి యందు ఇది పెరుగుతుంది.
కరక్కాయను హరీతకీ (అన్ని రోగములను పోగొట్టునది), అభయ (భయము లేకుండా చేయునది), అమృత, వయస్థ (వయస్సును స్థిరముగా ఉంచునది), కాయస్థ (కాయమనగా - శరీరం - శరీరమును చిరకాలము నిలబెట్టునది) అని దీనికి పేర్లు కలవు.
కరక్కాయను ఆహారంగా, ఔషధంగా వాడటం గమనించతగిన విశేషము. కరక్కాయను నమలి తిన్న యెడల ఆకలిని పెంచుతుంది. మరియు మెత్తగా నూరి సేవించిన విరేచనాన్ని కలిగిస్తుంది. దీనిని వేయించుకొని తిన్న త్రిదోషహరంగా పనిచేస్తుంది.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: కరక్కాయ
- సంస్కృతం: హరీతకీ
- హిందీ: హరడ్
- లాటిన్: టెర్మినాలియా చెబులా రెట్జియస్ (Terminalia chebula)
- కుటుంబము: Combretaceae
పోషక విలువలు & రసాయన ఘటకాలు
ప్రతి 100 గ్రాముల కరక్కాయలందు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, సార్బిటాల్ అనునవి ఒక్కొక్క శాతం కలవు. ఇంకా జెన్సిబయోజ్, అరబినోస్, మాల్టోజ్, రేమిణోజ్, కైలోజ్లు కూడా ఇందులో ఉన్నాయి. కరక్కాయలో రసాయనిక అంశమైన రసాయనాలు, టానిన్ ఎక్కువ శాతంలో ఉంది. అంతేకాక, ఆకులు, బెరడు, వేర్లలో కూడా టానిన్ కలదు.
దీనియందు చెబులిక్ యాసిడ్, చెబులిజిక్ యాసిడ్, కొరిలాజిన్లు కూడా ఉంటాయి.
కరక్కాయ మధుర, ఆమ్ల, కటు, తిక్త, కషాయ రసములు; లఘు, రూక్ష గుణములు; ఉష్ణవీర్యము మరియు మధుర విపాకములను కలిగి ఉంటుంది. ఇది రసాయనంగా, బృంహణంగా, అనులోమనము, త్రిదోషహరము, దీపనము, ప్రజాస్థాపనము అనే కర్మలను కలిగి ఉంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ ఉపయోగాలు: దీనిని శ్వాస, కాసలు, చర్మవ్యాధులు, కామెర్లు, అశ్మరి, పాండు, కామల, నపుంసకత్వము, వాతరక్తము, హిక్కా, గ్రహణి, విషజ్వరము, ప్రమేహము, మూత్రకృచ్ఛము, శూల, హృద్రోషము లందు వాడుదురు.
- కామెర్లు: కరక్కాయ, తేనె, బెల్లంలను కలిపి తినిన కామెర్లు (జాండీస్) తగ్గుతాయి.
- రుమటాయిడ్ ఆర్థరైటీస్: కరక్కాయ చూర్ణమును ఆముదముతో కలిపి ప్రతిరోజు వాడిన ఆర్థరైటీస్, సయాటికా మొదలగు జబ్బులందు మంచి ఉపశమనము కలుగుతుంది.
- క్రిమిరోగాలు & ఆర్శమొలలు: కరక్కాయ చూర్ణాన్ని వేడి నీళ్ళతో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగుతాయి. ఇది చక్కని విరేచనాన్ని కూడా కలుగజేస్తుంది. అర్షమొలలు రోగులకు ఇది చాలా మంచిది. కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్షమొలలు, మలబద్ధకము, వాతరక్తము శమించును!
- కడుపునొప్పి: కరక్కాయ చూర్ణము నందు చెబులిన్ కలదు. ఈ చెబులిన్ అను అంశము కడుపునొప్పిని తగ్గిస్తుంది.
- చర్మవ్యాధులైన పామా, దద్రు: కరక్కాయ చూర్ణము, గోమూత్రమునందు కలిపి త్రాగిన చర్మవ్యాధులు తగ్గుతాయి. కరక్కాయను కాల్చి ఆచూర్ణమును నువ్వులనూనెతో కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గుతాయి.
- విషమ జ్వరాలు: కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయమవుతాయి.
- ఆమ్లపిత్తము: కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవిస్తే ఆమ్లపిత్తము నందు హితంగా ఉండును.
- మేదోహరకర్మలు - బరువు తగ్గుట: కరక్కాయ వాడటం వలన బరువు తగ్గుతుంది. సీరమ్ లిపిడ్ లెవల్స్ తగ్గినట్లు పరిశోధనలో గమనించారు (CCRIMH).
- గోరుచుట్టు: పసుపు రసమునకు, కరక్కాయలను చేర్చి, వాటిని బాగా దంచి మెత్తగా నూరి పై పూతగా రాసిన గోరు చుట్టు తగ్గుతుంది.
- హెచ్చరికలు: కరక్కాయను గర్భిణీస్త్రీలు, వేడి శరీరము కలవారు, రూక్షశరీరులు వాడకూడదు.
అదనపు సమాచారం
పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం గ్రంథంలో కరక్కాయ గురించి ఇవ్వబడిన అదనపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మొక్క యొక్క వివరణ
కరక్కాయ వృక్షాలు సుమారు 6–15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ వృక్షాలు భద్రాచలం–గోల్కొండ ప్రాంతాలకు చెందిన అరణ్యాలలో పెరుగుతాయని గ్రంథంలో పేర్కొన్నారు. పత్రాలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, పుష్పాలు సన్నని కంకుల వలె వికసిస్తాయని కూడా వివరించారు. ఫలాలు క్రమంగా పక్వానికి వచ్చి ప్రత్యేక ఆకారాన్ని పొందుతాయని గ్రంథంలో వర్ణించబడింది.
సంప్రదాయ వినియోగ విధానాలు
- పచ్చకామెర్లు కోసం సంప్రదాయ వినియోగం: కరక్కాయ చూర్ణాన్ని సుమారు 3 గ్రాములు తేనెతో కలిపి రోజుకు రెండు పూటలా సేవించే విధానాన్ని గ్రంథం పేర్కొంటుంది. ఈ వినియోగాన్ని 7–10 రోజులు కొనసాగించే సంప్రదాయ విధానం కూడా వివరించబడింది.
- దగ్గు కోసం సంప్రదాయ తయారీ: కరక్కాయ చూర్ణంలో ఒక భాగానికి వేయించిన పిప్పలి చూర్ణాన్ని సగభాగం కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని తేనెతో సేవించే విధానాన్ని గ్రంథంలో పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి నిర్దిష్ట వ్యవధిలో తీసుకునే సంప్రదాయ విధానం వివరించబడింది.
- స్థూలకాయం సంబంధిత సంప్రదాయ వినియోగం: భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని మజ్జిగతో కలిపి సేవించే సంప్రదాయ పద్ధతిని గ్రంథం పేర్కొంటుంది. ఈ విధానాన్ని కొన్ని రోజులపాటు అనుసరించే వివరాలు కూడా అందులో ఉన్నాయి.
- ఇతర సంప్రదాయ ఉపయోగాలు: కరక్కాయ చూర్ణాన్ని వివిధ సహాయక ద్రవ్యాలతో కలిపి ఉపయోగించే పలు సంప్రదాయ తయారీ విధానాలు గ్రంథంలో వివరించబడ్డాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 405, 406, 407) - రచయిత: డా|| టి. భిక్షపతి
- పుస్తకం: పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం (పేజీ: 51) - రచయిత: డా॥ నిష్ఠేశ్వర్ M.D., Ph.D.
- చిత్రం: Haritaki (Terminalia chebula) fruits.jpg — Salil Kumar Mukherjee, Wikimedia Commons, CC BY-SA 4.0.
