బత్తాయి / Sweet Orange: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | బత్తాయి / Sweet Orange |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Sapindales |- ! Family | Rutaceae |- ! Genus | Citrus |- ! Scientific Name / Latin Name | Citrus sinensis (L.) Osbeck |} బత..." |
|||
| Line 51: | Line 51: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 555) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 555) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 07:44, 11 September 2026
| బత్తాయి / Sweet Orange | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Sapindales |
| Family | Rutaceae |
| Genus | Citrus |
| Scientific Name / Latin Name | Citrus sinensis (L.) Osbeck |
బత్తాయిని భారతదేశముతో పాటు చైనా మరియు ఇతర ట్రాపికల్ దేశాల్లో కూడా పండిస్తున్నారు. బత్తాయి రుచిగా తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. బత్తాయిని త్రాగిన వెంటనే ఉత్సాహము, తృప్తి కలుగుతుంది. బత్తాయి వాత పిత్తహరము మరియు మధురము గురుత్వము అనే గుణాలు కలిగి ఉంటుంది. ఇది రక్తదోషాలను హరిస్తుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : మిష్టనింబూకామ్ ;
- హిందీ : ముసంబి ;
- తెలుగు : బత్తాయికాయ ;
- లాటిన్ : Citrus sinensis (linn) ;
- కుటుంబము : Rutaceae ;
- ఆంగ్లం : Sweet Orange
పోషక విలువలు
బత్తాయియందు (ప్రతి 100 గ్రాములకు):
- తేమ : 89.8%
- ప్రొటీన్లు : 0.7 మి.గ్రా
- కార్బోహైడ్రేట్లు : 9.1 మి.గ్రా
- క్రొవ్వు : 0.1 మి.గ్రా
- మినరల్ మేటర్ : 0.3 మి.గ్రా
- కాల్షియం : 0.02 మి.గ్రా కలవు.
బత్తాయి త్వక్కు పైచర్మము నుండి సుగంధతైలము కలదు. అది డి - లిమోనిన్, డిప్లిక్సాల్డిహైడ్, లినాలుల్, టార్పినియోలు కలవు. బత్తాయి పువ్వులనుండి ఇనేరోలి అనే ఎసెన్షియల్ ఆయిల్ లేత ఆకుల నుండి పెటిగ్రెయిన్ ఆయిల్ తీస్తారు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ ఆరోగ్యం & బలవర్ధకం: బత్తాయి జబ్బుపడి లేచిన వారికి, జ్వరముతో బాధపడే రోగులకు, రక్తహీనత రోగులకు, నీరసంతో బాధపడు వారికి ఎంతో ఉపయోగకరం. ఇది బలాన్ని కలిగిస్తుంది. దేహపుష్టిని కలిగిస్తుంది. మూత్రము ఎక్కువవ్రేట్లు చేస్తుంది. హృదయమునకు బలమునిస్తుంది.
- దప్పిక & శోష నివారణ: దప్పికను తీరుస్తుంది. శోష, వాంతిని తగ్గిస్తుంది. అతి వేడిని మూత్రములో మంటను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. అతిసార రోగులకు ఎంతో ఉపయోగకరము.
- శ్వాసకోస సమస్యలు & రసం ఉపయోగాలు: బత్తాయి రసము నందు మిరియాలపాడి కలిపి త్రాగిన ఎక్స్పెక్టోరెంట్గా పనిచేస్తుంది. దీనిని అతిగా దప్పిక వేయటము ఆస్తా, బ్రాంకైటీస్ మరియు ఎంఫెసీయా రోగులకు ఇవ్వవచ్చు. బత్తాయి రసము నందు పంచదార గ్లూకోజ్ కలిపి వేసవి యందు సేవించిన దప్పిక తీరుతుంది. నీరసం తొలుగుతుంది.
- సౌందర్య పోషణ: బత్తాయి పై చర్మాన్ని తొలచి దానిని ఎండించి మెత్తగా చేసుకొని అందులో చందనము, పసుపు కలుపుకొని పాలతో ముఖానికి పట్టించి 1 గంట తర్వాత కడిగితే ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది. జిడ్డు తొలుగుతుంది. మొటిమలు తగ్గుతాయి. బత్తాయి రసమును కూడా ముఖానికి చక్కగా రాసుకొని 1 గంట తర్వాత కడిగితే ముఖ సౌందర్యము పెంపొందుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 555) - రచయిత: డా|| టి. భిక్షపతి
