డెయీసీ (''Bellis perennis''): Difference between revisions

From LTRC
No edit summary
No edit summary
Tag: Manual revert
 
(One intermediate revision by the same user not shown)
(No difference)

Latest revision as of 17:32, 22 September 2026

డెయీసీ (Bellis perennis)
వర్గీకరణ
తెలుగు పేరు డెయీసీ
శాస్త్రీయ నామం Bellis perennis
కుటుంబం Asteraceae (కంపానిడే / కంపోజిటే)
క్రమం Asterales
వంశం Bellis
జాతి B. perennis
ఇంగ్లీష్ పేరు English Daisy / Daisy
స్వస్థలం యూరప్, బ్రిటీషు దీవులు
పుష్పించే కాలం శీతాకాలము, వసంతకాలము

పరిచయం

డెయీసీ (శాస్త్రీయ నామం: Bellis perennis) అనేది ఆస్టరేసీ (Asteraceae / కంపానిడే) కుటుంబానికి చెందిన ఒక బహువార్షిక పుష్పించే మొక్క. ఇది స్వతహాగా యూరప్ మరియు బ్రిటీషు దీవుల ప్రాంతానికి చెందినది. ఇది బహువార్షిక జాతియే అయినప్పటికీ, మైదానములయందు ఏకఋతుకముగాను (వార్షికంగాను), కొండలపై ద్వైవార్షికముగాను పెంచుదురు. తోటలలో పూమడులు, అంచులు మరియు గోలెములలో పెంచుటకు ఇది చాలా శ్రేష్టమైనది.

వివిధ భాషల్లో పేర్లు

భాష పేరు
తెలుగు డెయీసీ
ఇంగ్లీష్ Daisy, English Daisy
శాస్త్రీయ నామం Bellis perennis

వర్గీకరణ

  • రాజ్యం: Plantae (మొక్కలు)
  • క్రమం: Asterales
  • కుటుంబం: Asteraceae (కంపానిడే)
  • వంశం: Bellis
  • జాతి: B. perennis

వృక్ష వివరణ

  • ఎత్తు & రూపు: ఈ మొక్కలు మొదలు నుండి కుచ్చువలె విచ్చుకొనును. ఇది 2.5–5.0 cm (23–30 cm) ఎడుగును.
  • ఆకులు & కాండము: రానురాను వెడల్పుగా ఉండే పట్టివంటి ఆకులతో దిమ్మముగా పెరుగును. కాండము మందముగా ఉండును.

పుష్ప వివరణ

  • రూపం & కాడ: అడ్డుకోతగల దీని పువ్వులు నిడుపైన (15 cm) కాడలపై ఉండును.
  • రంగులు & రేకలు: పూవులు తెలుపు, గులాబి, ఎరుపు రంగులలో ఉండును. ఒంటిరేక, ముద్ద పూవుల రకములు కలవు. రేకలు చదునుగాగాని, ఈకలను పోలిగాని యుండును. ఈ రెండవ రీతి రేకల పూలు పాటల వర్ణములోగాని, కెంపు రంగులోగాని యుండును.
  • ముఖ్య రకాలు:
    • లిల్లిపుట్: కురుచ (15 cm) రకపు పూలు, ముద్దవిగా పుష్కలముగా పూయును. పూలరంగులు: తెలుపు (ఆల్పా), లేతగులాబి (రోజియా డెలికేటా), ముదురుగులాబి (రోజియా), ముదురు ఎరుపు (కెర్మైసినా).
    • లాంగ్ ఫెల్లో: ముదురు గులాబి రంగు.
    • స్నోబాల్: తెలుపు రంగు.
    • వెసూవ్: కెంపు రంగు.
    • షెప్రాన్: అతి పెద్ద పూల రకం.
    • మాన్ స్టోరిసా: పెద్ద పూల రకం.
    • మాన్ స్టోరిసా ట్యూబులోసా (ఈక): ఈ చివరి జాతిలో రకములు: ఎట్నా (ఎరుపు, ఈకరేక), మాంటిరోసా (గులాబి, ఈకరేక), మార్జెన్ సోన్ (మీగడ పసుపు), రూబి (కెంపు).

వ్యాప్తి మరియు నివాసం

  • స్వస్థలం: యూరప్, బ్రిటీషు దీవులు.

సాగు

  • అనుకూల పరిస్థితులు: మొక్కలు సారము, చెమ్మగల నీరు వడియు నేలలో, అరనీడ పడుచోట్ల బాగుగా పెరుగును.
  • తోట అమరిక: డెయీసీ పూమడికి, అంచులకు, గుట్టలకు శ్రేష్టమైనది. గోలెములలోనూ (కుండీలలో), కిటికి తొట్టెలలోనూ కూడా పెంచదగును.

ఉపయోగాలు

  • అలంకరణ: పూల మడులలో, అంచులలో మరియు కుండీలలో అలంకారముగా పెంచుటకు అనువైనది. దీని పూలు లోతు తక్కువ కలశములలో అమర్చుటకు బాగుండును.

మూలాలు

  • డాక్టర్ విష్ణు స్వరూప్, "ఏడవ అధ్యాయము – పూవుల వర్ణనము: డెయీసీ", ఉద్యాన పుష్పములు, పుట 37.