మునగ / Drumstick Tree: Difference between revisions

From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | మునగ / Drumstick Tree |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Brassicales |- ! Family | Moringaceae |- ! Genus | Moringa |- ! Scientific Name / Latin Name | Moringa oleifera Lam. |} మునగ (..."
 
 
Line 77: Line 77:


== మూలాలు ==
== మూలాలు ==
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 572-576)
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 572-576) - రచయిత: డా|| టి. భిక్షపతి
* రచయిత: డా|| టి. భిక్షపతి


[[Category:Indian medicinal plant]]
[[Category:Indian medicinal plant]]
[[Category:sciwiki plant]]
[[Category:sciwiki plant]]

Latest revision as of 07:39, 11 September 2026

మునగ / Drumstick Tree
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Brassicales
Family Moringaceae
Genus Moringa
Scientific Name / Latin Name Moringa oleifera Lam.

మునగ (Moringa oleifera) మోరింగేసి (Moringaceae) కుటుంబానికి చెందినది. ఇది సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షము. భారతదేశం లోని చాలా ప్రాంతాల్లో పెరుగుతుంది. ములగకు ములకకాయ్ ను కూరల్లో వాడుతున్నారు. ఇది కటుతిక్తరసము, లఘురూక్ష तीక్ష్ణగుణము ఉష్ణవీర్యము మరియు కటువిపాకములను కలిగి ఉంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : శ్రిగు
  • హిందీ : సహింజనా
  • తెలుగు : మునగ
  • ఇంగ్లీష్ : Drumstick Tree
  • లాటిన్ : మోరింగా ఓలిఫెరా లా మార్క్
  • కుటుంబము : Moringaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల మునగ ఆకులలో విటమిన్ - ఎ, ఆస్కార్బిక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో:

  • తేమ: 75 గ్రా
  • ప్రొటీన్లు: 6 గ్రా
  • క్రొవ్వు: 2 గ్రా
  • కార్బోహైడేట్లు: 14 గ్రా
  • ఫైబర్: 2.3 గ్రా
  • కాల్షియం: 445 మి.గ్రా
  • పాస్ఫరస్: 70 మి.గ్రా
  • ఇరన్: 7 మి.గ్రా
  • అయోడిన్: 51 మి.గ్రా
  • కాఫర్: 101 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 11,300 I.U
  • విటమిన్ - బి: 220 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.8 మి.గ్రా
  • ఆస్కార్బిక్ ఆసిడ్: 220 మి.గ్రా
  • టోకోఫీరాల్: 7.4 మి.గ్రా

మరియు ములగ గింజలలో ప్రతి 100 గ్రాములకు:

  • తేమ: 86.9 గ్రా
  • ప్రొటీన్లు: 2.5 గ్రా
  • క్రొవ్వు: 0.1 గ్రా
  • కార్బోహైడేట్లు: 3.7 గ్రా
  • ఫైబర్: 4.6 గ్రా
  • మినరల్మేటర్: 2.0%
  • కాల్షియం: 3.1 మి.గ్రా
  • పాస్ఫరస్: 110 మి.గ్రా
  • ఇరన్: 5.3 మి.గ్రా
  • కాఫర్: 3.1 మై.గ్రా
  • అయోడిన్: 18 మి.గ్రా
  • ఆక్సాలిక్ ఆసిడ్: 0.01 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • రుమాటాయిడ్ ఆర్ధ్రైటీస్: మునగాకు వేరును మెత్తగా దంచి దానితో కషాయం కాచి త్రాగిన ఆర్ధ్రైటీస్ మరియు కీళ్ళ జబ్బులు తగ్గుతాయి.
  • కాలేయ మరియు గొంతు వ్యాధులు: మునగాకు రసం తేనెకలిసి ಸೇವించిన నోటిలో పుండ్లు, కాలేయ వ్యాధులు, అల్సర్స్ తగ్గుతాయి. ములగాకు రసము సేవించటం వలన గొంతు వాపు నొప్పి తగ్గుతాయి; ములగాకు వెచ్చచేసి కట్టువేస్తే గడ్డలు, వాపులు తగ్గుతాయి.
  • వ్రణాలు మరియు మధుమేహం: మునగాకును నూరి వేడి చేసి దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలలో రాసిన వ్రణంలోని క్రిములు చనిపోతాయి. మునగ గింజలను మెత్తగా చూర్ణం చేసి 1 చంచా చూర్ణాన్ని త్రాగిన మధుమేహం అదుపులో ఉంటుంది.
  • కీళ్ళనొప్పులు & వాపులు: మునగాకు, ఆముదము కలిపి ఉడికించి కాపదం పెడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మునగ చెట్టు బెరడు మెత్తగా నూరి లేపనం చేస్తే తామర, గజ్జి వ్యాధులు తగ్గుతాయి.
  • కంటి చూపు & మూత్రశాల రాళ్లు: ములగాకు రసమును త్రాగటం వలన కంటిచూపు బాగుంటుంది, కూర తినటం వలన దృష్టి బాగుంటుంది. ములగాకు రసము త్రాగటం వలన మూత్రశాలలోని రాళ్లను కరిగిస్తుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో జాగ్రత్తలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 572-576) - రచయిత: డా|| టి. భిక్షపతి