బాదము / Almond: Difference between revisions

From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | బాదము / Almond |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Rosales |- ! Family | Rosaceae |- ! Genus | Prunus |- ! Scientific Name / Latin Name | Prunus amygdalus Batsch |} బాదమును భ..."
 
 
Line 72: Line 72:


== మూలాలు ==
== మూలాలు ==
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 551-552)
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 551-552) - రచయిత: డా|| టి. భిక్షపతి
* రచయిత: డా|| టి. భిక్షపతి


[[Category:Indian medicinal plant]]
[[Category:Indian medicinal plant]]
[[Category:sciwiki plant]]
[[Category:sciwiki plant]]

Latest revision as of 07:45, 11 September 2026

బాదము / Almond
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Rosales
Family Rosaceae
Genus Prunus
Scientific Name / Latin Name Prunus amygdalus Batsch

బాదమును భారతదేశములో పెంచుతున్నారు. బాదం ఆహారంగా, ఔషధంగా మరియు ఖరీదైన ఫలంగా పేరు పొందింది. బాదం మధురరసాన్ని, ఉష్ణవీర్యాన్ని స్నిగ్ధగురు గుణములను, మధురవిపాకమును కలిగిఉంది. ఇది వృష్యము వాతపిత్తహర కర్మలు కలిగిఉంది. దీనిని శ్వేతప్రదరము, తలనొప్పి, నడుమునొప్పి మరియు మధుమేహములందు వాదుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : వాతద / నేత్రోఫల ;
  • హిందీ : బాదామ్ ;
  • తెలుగు : బాదము ;
  • లాటిన్ : ప్రూనస్ ఆమోగ్డాలస్ బెయిల్ లీ ;
  • కుటుంబము : Rosaceae ;
  • ఆంగ్లం : Almond

పోషక విలువలు

100 గ్రాముల బాదం నందు:

  • తేమ : 5.2 గ్రా
  • క్రొవ్వు : 58.24 గ్రా
  • ప్రొటీన్లు : 20.8 గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 11 గ్రా
  • నార (ఫైబర్) : 1.7 గ్రా
  • మినరల్మేటర్ : 2.9 %
  • కాల్షియం : 247 మి.గ్రా
  • సల్ఫర్ : 145 మి.గ్రా
  • పాస్పరస్ : 442 మి.గ్రా
  • ఐరన్ : 4.5 మి.గ్రా
  • మెగ్నీషియం : 257 మి.గ్రా
  • కాఫర్ : 1.15 మి.గ్రా
  • సోడియం : 5.8 మి.గ్రా
  • పొటాషియం : 856 మి.గ్రా
  • క్లోరిన్ : 1.7 మి.గ్రా
  • ఆగ్జాలిక్ఆసిడ్ : 407 మి.గ్రా
  • సకోటినిక్ ఆసిడ్ : 2.5 మి.గ్రా
  • అయోడిన్ : 2 మి.గ్రా
  • విటమిన్ - బి1 (థైమిన్) : 0.6 మి.గ్రా
  • విటమిన్ - బి2 (రైబోఫ్లేవిన్) : 0.6 మి.గ్రా
  • విటమిన్ - సి : 386 I.U
  • నియాసిన్ : 2.5 మై.గ్రా
  • కేలరీలు : 651
  • విటమిన్ - ఎ : కొద్దిశాతంలో కలవు.

ఇంకా మేంగనీస్ మరియు జింక్ మొదలగునవి కలవు. ఆల్ఫా, గామా టోకోఫీరాల్ మొదలగునవి కలవు. బాదం నందు అనేక విటమిన్లు ఉన్న దృష్ట్యా దీనిని బలహీనులు వాడితే శరీర పుష్టి కలుగుతుంది. బాదం తినటం వలన శుక్రము వృద్ధి అవుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మానసిక ప్రశాంతత & నిద్ర: బాదములను (10-20) ల ను కొద్దిగా దంచి వాటితోపాటు మిశ్రి (ఖండశర్కర) క్యాండీలను పాలలో కలిపి రాత్రి పడుకోనే ముందు సేవించిన టెన్షన్ తొలుగుతుంది. చక్కగా నిద్రపడుతుంది. నీరసం తొలుగుతుంది.
  • మధుమేహం & రక్తహీనత: బాదమునందు తేనే మరియు గులాబీ రేకులను కలిపి ప్రతిరోజు సేవించటం వలన డయాబెటిస్ న్యూరైటిస్, నరాల బలహీనత, అధిక రక్తపోటు, అధిక రక్తస్రావము, మరియు ఎనీమిమా మొదலగునవి తగ్గుతాయి.
  • పిల్లల అభివృద్ధి: బాదంకాయలను బాగా మరుగుతున్న నీళ్ళ యందు పోసి దాని నుండి పైపొట్టును తీసివేసి దానిని మెత్తగా నూరి తేనే కలిపి ఈ రెండింటిని పాలలో పిల్లలకు ప్రతిరోజు త్రాగిస్తే వారు దృఢంగా బలంగా తయారవుతారు. పొట్టుతీసిన బాదం పప్పుతిన్న మాటిమాటికి వచ్చే జ్వరాలు తగ్గుతాయి.
  • శరీర బలం & విరేచనకారి: బాదమును పాలతో కలిపి తినటం వలన శరీరములోని అన్ని అవయవములకు బలము చేకూరుతుంది. బాదంగింజల యందు తేనే కలిపి త్రాగిన బలకరంగా మరియు విరేచనకారిగా పనిచేస్తుంది.
  • చర్మ & తల సంరక్షణ: బాదం నూనె, నిమ్మరసం కలిపి రాస్తే శరీరం యొక్క గరుకుదనము, పగుళ్ళు, మంట తగ్గుతుంది. బాదంనూనె యందు ఉసిరికాయ రసం కలిపి తలకు పట్టిస్తే జరన్తు రాలటం తగ్గుతుంది. జుట్టు తొందరగా తెల్లబడటం, ఊడిపోవటం తగ్గుతుంది.
  • స్త్రీల ఆరోగ్యం: లేత దానిమ్మ గింజలను మెత్తగా నూరి అందులో బాదం నూనె కలిపి స్తనములకు పట్టించి బాగా మర్దన చేసిన స్తనములు వృద్ధి అవుతాయి. ఇది మంచి సౌందర్య సాధనము. బాదంకాయ తినటం వలన చిగుళ్ళు దంతాలు గట్టిపడతాయి.
  • శక్తి & ఉత్సాహం: బాదమందు అశ్వగంధ, శతావరి, పిప్పిలీ, నెయ్యి, పంచదారలను కలిపి తిన్నయెడల శక్తి కలుగుతుంది. ఉత్సాహము పెరుగుతుంది. చక్కగా నిద్రపడుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 551-552) - రచయిత: డా|| టి. భిక్షపతి