పిల్లిపీచర గడ్డలు / Shatavari: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | పిల్లిపీచర గడ్డలు / Shatavari |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Asparagales |- ! Family | Asparagaceae |- ! Genus | Asparagus |- ! Scientific Name / Latin Name | Asparagu..." |
|||
| Line 62: | Line 62: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 533-534) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 533-534) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 09:45, 11 September 2026
| పిల్లిపీచర గడ్డలు / Shatavari | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Liliopsida |
| Order | Asparagales |
| Family | Asparagaceae |
| Genus | Asparagus |
| Scientific Name / Latin Name | Asparagus racemosus Willd. |
పిల్లిపీచర గడ్డలు (శతావరి) బహువార్షిక కంటకయుత చిన్నపొద. పార్కులలో ఇళ్ళలో దీనిని అందము కోసము పెంచుతున్నారు. దీని లేత కాడలను పులుసు మరియు తిను బందారాలలో వాడుదురు. పిల్లిపీచర గడ్డలు మధుర తిక్తరసము, గురు స్నిగ్ధగుణము శీతవీర్యము మరియు మధుర విపాకములను కలిగి ఉంది. ఇది శుక్రకరము, స్తన్యకరము, రసాయనము, వృష్యము, హృద్యము మరియు వాతపిత్తహరము. దీనిని క్షయ, రక్తపిత్తము, అతిసారము, గ్రహణీ, అర్శమోసులు గుల్మము మరియు మధుమేహములందు వాడుదురు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : శతావరి
- హిందీ : సతావర్
- తెలుగు : పిల్లిపీచర గడ్డలు / చల్లగడ్డలు
- లాటిన్ : ఆస్పరాగస్ రసిమోసస్ విల్డిన్
- కుటుంబము : Asparagaceae
- ఆంగ్లం : Shatavari
పోషక విలువలు
పిల్లిపీచర గడ్డల (శతావరి) యందు ప్రతి 100 గ్రాములకు:
- తేమ : 93%
- క్రొవ్వు : 0.2%
- కాల్షియం : 0.21%
- పీచు (నార - ఫైబర్) : 0.7%
- కార్బోహైడ్రేట్లు : 0.4%
- ప్రొటీన్లు : 2.2%
- యాష్ (బూడిద) : 0.6%
- సుగర్ : 1.3%
- ఐరన్ : 0.0012%
- కేలరీలు : 120 గ్రాములు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- స్తన్యవృద్ధి: శతావరి (పిల్లిపీచర- చల్లగడ్డలు) గడ్డలను ఎండిచి చూర్ణము చేసుకొని పాలతో కలిపి త్రాగిన मातृస్తన్యము వృద్ధి అవుతుంది.
- మూత్రంలో మంట: శతావరి చూర్ణము నీళ్లతో కలిపి త్రాగిన మూత్రం కష్టంగా వెదలటం మూత్రంలో మంట తగ్గుతుంది.
- కడుపులో మంట: (హైపర్ సిడిటి) శతావరి గడ్డల రసమును ప్రతిరోజు 10-20 మి.లీ రోజుకు 2 సార్లు త్రాగిన కడుపులో మంట, పుల్లటి తేన్పులు తగ్గుతాయి.
- అధిక రక్తపోటు: శతావరి చూర్ణము వాడిన అధిక రక్తపోటు (హైపర్ టెన్సన్) మధుమేహములందు ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోధనలో గమనించారు. దీనికి గర్భాశయ సంకోచహర కర్మలున్నట్లు పరిశోధనలో గమనించారు.
- శూల: పిల్లి పీచర గడ్డల రసము నందుతేనె కలిపి ప్రతి ఉదయము సేవించిన శూల (నొప్పి), దాహము (మంట) అన్ని రకాల పిత్తశూలలు తగ్గుతాయి.
- రక్తపిత్తము: పిల్లి పీచరు, పల్లేరుకాయల కషాయముతో కాచిన పాలను సేవించిన మూత్రమార్గము నందలి రక్తపిత్తము తగ్గును (చ.చి 4).
- రుమాటాయిడ్ ఆర్ధ్రైటీస్: పిల్లిపీచర వేళ్ళను మెత్తగా దంచి నువ్వుల నూనెలో వేసి కాచి చక్కని తైలము తయారుచేసుకొని రాసిన గౌట్ వాతరక్తము మరియు ఆమవాతము (రుమాటాయిడ్ ఆర్ధ్రైటీస్) నొప్పి మంట తగ్గిపోతుంది.
- మెనోరోజియా మరియు స్టెరిలిటీ (వంధ్యత్వము): శతావరి చూర్ణమును రోజుకు 3సార్లు వాడిన స్త్రీలలో అధికంగా వెడలు బహిస్టు స్రావము (మెనోరోజియా) ఉపశమిస్తుంది. వంధ్యత్వము నందు ఉపయుಕ್ತంగా ఉంటుంది.
- నీరసము మరియు శీఘ్రస్కలనము: శతావరి చూర్ణమునందు పాలు మరియు తేనె కలిపి ప్రతిరోజు వాడిన శీఘ్రస్కలనము తగ్గుతుంది. నీరసము తొలగుతుంది.
- అతి సారము: జిగురువిరేచనాలు తగ్గుతాయి.
- శుక్రవృద్ధి - బలము: శతావరి చూర్ణమును పాలతో కలిపి త్రాగిన బలము పెరుగుతుంది. శుక్రము వృద్ధి అవుతుంది భ్రమ, బక్కచిక్కి ఎండిపోవుట మూర్ఛ క్షయ రోగులకు ఉపయోగకరం.
- చర్మరోగాలూ: దీనిని నూనెలో కాచి చర్మరోగాలపై రాసిన చర్మ రోగాలు శమిస్తాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 533-534) - రచయిత: డా|| టి. భిక్షపతి
