పుదీనా / Peppermint: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | పుదీనా / Peppermint |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Lamiales |- ! Family | Lamiaceae |- ! Genus | Mentha |- ! Scientific Name / Latin Name | Mentha piperita L. |} పుదీనా..." |
|||
| Line 60: | Line 60: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 514, 515) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 514, 515) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 09:51, 11 September 2026
| పుదీనా / Peppermint | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Lamiales |
| Family | Lamiaceae |
| Genus | Mentha |
| Scientific Name / Latin Name | Mentha piperita L. |
పుదీనా చక్కని సుగంధ భరితమైన బహువార్షిక మొక్క. దీనిని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఆహారంగా, అద్వితీయ ఔషధంగా పనికి వచ్చేది పుదీనా. పుదీనా కటురసము ఉష్ణవీర్యము లఘురూక్ష తీక్ష్ణగుణాలును మరియు కటు విపాకములను కలిగి ఉంది. ఇది దీపనము కఫవాత శామకము మరియు బల్యము. పుదీనాను ఉదరశూల, నోటికి రుచి తెలియకుండుట, వాంతివచ్చినట్లుండుట మరియు వాంతులు, స్త్రీలకు సంబంధించిన రజోదోషములు మరియు క్రిమి రోగములందు ఔషధములుగా ఉపయోగిస్తారు. దీనితో పచ్చడి మరియు కూరలు చేసుకుతింటారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: పూతీహా ;
- హిందీ: పుదీనా ;
- తెలుగు: పుదీనా ;
- లాటిన్: మెంధాపైపరేటా లిన్నెయస్ ;
- కుటుంబము: Lamiaceae ;
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల పుదీనా ఆకుల యందు ఈ క్రింది పోషక విలువలు కలవు:
- ప్రొటీన్లు: 5.90 గ్రా
- క్రొవ్వు: 0.7 గ్రా
- కార్బోహైడ్రేట్లు: 8.49 గ్రా
- కాల్షియం: 440 మి.గ్రా
- పాస్పరస్: 70 మి.గ్రా
- ఐరన్: 19.2 మి.గ్రా
- నియాసిస్: 0.4 మి.గ్రా
- ఆగ్సాలిక్ ఆసిడ్: 3.8 మి.గ్రా
- విటమిన్ - ఎ: 6,101 I.U
- విటమిన్ - బి1: 59 మి.గ్రా
- విటమిన్ - బి2: 81 మి.గ్రాములు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- అజీర్ణము: పుదీనా ఆకుల రసము నిమ్మరసము మరియు తేనె కలిపి 1-2 టేబుల్ స్పూన్స్ రోజుకు 3 సార్లు ఇచ్చిన అజీర్ణము, కడుపుబ్బరము, మార్నింగ్ సిక్‌నెస్ (వేవిళ్ళు) మరియు క్రిములు హరించబడతాయి.
- కడుపునొప్పి (పిల్లలలో): చిన్న పిల్లలు తమ బాధను చెప్పలేరు. వారికి ఏడుపు ఒక్కటే ఆధారం తమ బాధను ఎక్స్‌ప్రెస్ చేయటానికి. అజీర్ణము వలన కడుపుబ్బరం వలన చిన్న పిల్లలు బాధపడుతుండటే పుదీనా రసం 3-4 చుక్కలు గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగించిన చక్కని ఉపశమనం పొందుతారు. కడుపునొప్పి తగ్గుతుంది.
- ఋతుశూల మరియు కడుపునొప్పి: స్త్రీలు నెలసరి అయ్యేరోజుల్లో విపరీతమైన కడుపునొప్పికి లోనవుతారు. అలాంటి స్త్రీలు పుదీనాను వేడినీళ్ళలో వేసి చక్కగా మరిగించి దానిని త్రాగిన నొప్పి తగ్గుతుంది. ఇది ఎక్కిళ్ళు అజీర్ణము మరియు జలుబుతో బాధపడు వారికి చక్కని ఉపశమనమును కలిగిస్తుంది.
- గాత్ర మాధుర్యానికి: పుదీనా ఆకులు మరియు కొద్దిగా ఉప్పును కలిపి వేడి నీటిలో మరిగించి దానిని గార్గిలింగ్ చేసిన గాయకుల కంఠస్వరం పాదుకాకంగా ఉంటుంది. పాట పాటకు మధ్యలో దీనిని త్రాగటం వలన గొంతు బొంగురు పోకుండా ఉంటుంది.
- నోటిదుర్వాసన: ఇన్ఫెక్షన్స్ వలన నోటిలో క్రిములుచేరి దుర్వాసన కలిగిస్తుంటే ఫ్రెష్‌గా ఉండే పుదీనా ఆకులను నోటిలో వేసుకొని కొద్దిగా నమిలి దాని నుండివచ్చే ఊటను చప్పరిస్తున్న యెడల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది యాంటిసెప్టిక్ గుణాలు కూడా కలిగి ఉంది. దీని వలన పిప్పిపళ్ళు, చిగుళ్ళ వ్యాధులు నిరోధించబడతాయి. చిగుళ్ళ నుండి చీముకారటం లాంటివి నిరోధించబడతాయి.
- మొటిమలు: యుక్తవయస్సులో మొటిమలు సర్వసాధారణము. ముఖమును శుభ్రంగా కడుక్కొని రాత్రి పడుకునే ముందు రాసిన రసాన్ని ముఖానికి రాసుకొని తెల్లవారి కడిగివేసి ముఖం ప్రకాశవంతమౌతుంది. చర్మము పొడిగా ఉండి ధరకుగా ఉండటం తగ్గుతుంది.
- మెంథాలు: పుదీనా నుండి డిస్టిలేషన్ పద్ధతి ద్వారా ఆయిల్ తీసి దానిని Low temperature వద్ద ఉంచిన స్పటికలుగా (Crystals) మారుతుంది. ఇందులో మెంథాల్ ఎసిటేట్ సినియాల్, ఇన్ ఆర్టిక్, ఫైనినిన్, కాడినిన్, పిల్లాండ్రిన్, ఎసిటిక్ ఆల్డిహైడ్, ఎమైల్ ఆల్కాహాల్ మరియు డైమిథైల్ సల్ఫేడ్‌లు ఉంటాయి. మెంథాల్‌ను అనేక వ్యాధుల్లో ఉపయోగిస్తారు, ఉదా|| కడుపునొప్పి, గొంతునొప్పి మరియు కడుపుబ్బరం మొదలగునవి. మెంథాల్, తైమాల్, కాంఫర్‌లను సమభాగములుగా తీసుకొని అందులో యూకలిప్టస్ ఆయిల్ 4 భాగములు కలిపి కార్బోలిక్ ఆసిడ్ 4 భాగములు కలిపి ఒక నీలి రంగు సీసాలో పోసుకొని గట్టిగా మూతను బిగించి ఉంచుకోవాలి. పైన చెప్పిన మందు కాంబినేషన్ దాదాపు మనకు విక్స్‌లాంటి వాటితో కనబడతాయి. దీనిని అదేవిధంగా జలుబు, గొంతునొప్పి, ఛాతీనొప్పి, తలనొప్పి లాంటి వాటిలో ఉపయోగించాలి.
- విజిటెబుల్ సలాడ్: ఖీరాదోసకాయ ముక్కలు, ఉల్లిపాయి ముక్కలు, టొమోటోలు మొదలగు వానిని చక్కగా కోసుకొని అందులో కొద్దిగా వెనిగార్ కలిపి వీటిపైన కొద్దిగా ఉప్పు చల్లి కొద్దిగా మిరియాల పొడిని కూడ చల్లి నిమ్మరసం పిండి చక్కగా అమర్చుకొని పైన పుదీనా ఆకులను చక్కగా పరచి దానిని తినటం వలన రక్తహీనత మరియు విటమిన్ల లోపం వలన కలిగే వ్యాధులు తొలగుతాయి.
- ఆస్థ్మా మరియు క్రానిక్ బ్రాంకైటీస్: పుదీనా రసము 1-2 చెంచాలు వెనిగార్ తేనె సమభాగములుగా కలిపి అందులో క్యారెట్ జ్యూస్ కలిపి రోజుకు 3 సార్లు త్రాగిన క్షయ రోగులకు, ఆస్థ్మా రోగులకు, బ్రాంకైటీస్ రోగులకు చాలా మంచిది.
- గొంతునొప్పి: తమలపాకుల్లో పుదీనా (మెంథాల్) లవంగం ఇలాచి కలిపి వేసుకొని దానిని నమిలి మ్రింగిన గొంతునొప్పి తగ్గుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 514, 515) - రచయిత: డా|| టి. భిక్షపతి
