దోసకాయ / Cucumber: Difference between revisions

From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | దోసకాయ / Cucumber |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Cucurbitales |- ! Family | Cucurbitaceae |- ! Genus | Cucumis |- ! Scientific Name / Latin Name | Cucumis sativus |} దోసకా..."
 
 
Line 68: Line 68:


== మూలాలు ==
== మూలాలు ==
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 487-489)
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 487-489) - రచయిత: డా|| టి. భిక్షపతి
* రచయిత: డా|| టి. భిక్షపతి


[[Category:Indian medicinal plant]]
[[Category:Indian medicinal plant]]
[[Category:sciwiki plant]]
[[Category:sciwiki plant]]

Latest revision as of 09:57, 11 September 2026

దోసకాయ / Cucumber
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Cucumis
Scientific Name / Latin Name Cucumis sativus

దోసకాయ (Cucumis sativus) కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ఒక తీగ మొక్క. దోస తీగను పండిస్తారు. దీనిని ఎక్కువగా వేసవిలో సాగుచేస్తారు. దోసకాయలలో ప్రొటీన్లు 0.4 గ్రాములు మరియు కార్బోహైడేట్లు 2.8 గ్రాములు ఉంటాయి. ఇది మధుర రసము శీతవీర్యము లఘురూక్ష గుణము మరియు మధురవిపాకములను కలిగి ఉంది. ఇది పిత్తశామకము మరియు మూత్రలం (Diuretic) కర్మలను కలిగి ఉంది. దోసకాయలను కూరగా చేసుకొని తింటారు. అలాగే పచ్చివి కూడా తింటారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: త్రపుషా
  • హిందీ పేరు: ఖీరా
  • తెలుగు పేరు: దోసకాయ
  • లాటిన్ పేరు: కుకుమిస్ సెటైవస్ లిన్నెయ్స్
  • కుటుంబము: Cucurbitaceae
  • ఆంగ్ల పేరు: Cucumber

పోషక విలువలు

  • కాఫర్: 0.1గ్రాములు
  • క్రొవ్వు: 0.5 గ్రాములు
  • కాల్షియం: 14 మి.గ్రా
  • పాస్పరస్: 28 మి.గ్రా
  • ఇరన్ (ఇనుము): 1.4 మి.గ్రా
  • క్లోరిన్: 5.60%
  • సల్ఫర్: 5.90%
  • సోడియం: 7 మి.గ్రా
  • పొటాషియం: 149 మి.గ్రా
  • నియాసిన్: 0.4 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.2 గ్రాములు
  • విటమిన్ - ఎ: కొద్దిమోతాదులలో
  • విటమిన్ - బి1: 28 మై.గ్రా
  • విటమిన్ - బి2: 4 మై.గ్రా
  • విటమిన్ - సి: 8 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అధికరక్తపోటు మరియు ఇతర వ్యాధులు: దోసకాయ రసము 1 గ్లాస్ నందు తేనె లేదా గ్లూకోజ్ 1 చెంచా కలిపి రోజుకు 2 సార్లు త్రాగిన మూత్రం సాఫీగా అవుతుంది. ఇది హైపర్ టెన్షన్ (అధికరక్తపోటు) జలోదరం (అన్సైటీస్), నెఫ్రైటిస్, సిస్టైటిస్, మూత్రకృచ్ఛము మొదలు వ్యాధులలో వాడిన చాలా ఉపయోగము.
  • అధిక దప్పిక, అజీర్ణము: దోసకాయ రసమునందు పుదీనా రసము కలిపి ఇచ్చిన మధుమేహము, అజీర్ణము మరియు అధిక దప్పికతో బాధపడు వారికి అత్యంత ఉపయోగకరము.
  • వేసవితాపాము: 60 మి.లీ దోసకాయ రసమునందు 1 గ్లాస్ మజ్జిగ కలిపి దానిలోకొంచెము ఉప్పుకలిపి త్రాగిన ఎండతీవ్రత నుండి ఉపశమనము కలుగుతుంది.
  • చర్మ సంరక్షణ మరియు ముటిమలు: రోజుంతా ఫ్రెష్‌గా ఉండొచ్చు దోసకాయ పొట్టుతీసి ముక్కలులా చేసుకుని ముఖము, కళ్ళు, మెడ మొదலగు వానికి చక్కగా రుద్ది ఒక గంట తరువాత కడిగి వేసిన ఎంతో హాయిగా ప్రశాంతంగా చక్కగా ఉంటుంది. దోసకాయ గుజ్జును ముఖమునకు పట్టించి 1 గంట తరువాత కడిగిన మొటిమలు నివారించబడతాయి. చర్మము పై ముడతలు తొలుగుతాయి. చర్మము ప్రకాశవంతమౌతుంది.
  • కాలు మంటలు: అరికాళ్ళు మంటతున్న దోసకాయ గుజ్జును చక్కగాారాస్తు మర్దన చేసిన కాలిమంటలు తగ్గి చక్కగా నిద్రపడుతుంది.
  • మూత్రంలోరాళ్ళు: విదారి (నేలగుమ్మడి), చెలుకు దోసకాయలను తిన్న యెడల మూత్రంలో రాళ్ళు తగ్గుతాయి.
  • మూత్ర కష్టంగా వెడలడ మరియు మూత్రంలో రాళ్ళు: దోసగింజల చూర్ణము ద్రాక్ష పండ్ల రసముతో కలిపి తిన్నయెడల మూత్రంలో రాళ్ళు, మూత్రం కష్టంగా వెడలడం తగ్గుతుంది.
  • చల్లదనానికి: దోసగింజల చూర్ణము నందు బాదం, తేనె, పాలు కలిపి తయారుచేసుకొని ಸೇವించిన నీరసం తగ్గుతుంది బరువు పెరుగుతారు. చల్లదనము కలుగుతుంది. దోస గింజల చూర్ణము నందు పెరుగు కలిపి ప్రతిరోజు సేవింవటం వలన మూత్రంలో మంట తగ్గుతుంది.
  • ముక్కు నుండి నోటినుండి రక్తము పడుట: తాజా దోసకాయల వేళ్ళను మెత్తగానూరి అందులో బియ్యము కడుగునీళ్ళు, తేనె కలిపి త్రాగిన ముక్కునుండీ నోటిలోనుండి రక్తము పడడం నివారించబడుతుంది.
  • అర్శమోలు మరియు మధుమేహం: దోసకాయలను బాగా తినటం వలన అర్శమోలు రోగుల మంట తగ్గుతుంది. విరేచనం సాఫీగా అవుతుంది. దోసగింజలు మరియు కొబ్బరిపువ్వులను ఎండించి మెత్తగా నూరి ప్రతి రోజు పాలతో కలిపి తిన్న యెడల మధుమేహము అదుపులో ఉంటుంది.
  • బలము మరియు వీర్యవృద్ధి: దోసగింజలు ఎండించి చూర్ణము చేసి తిన్నయెడల బలము కలుగుతుంది. వీర్యవృద్ధి అవుతుంది. దోసశరీరమంతావాపు మరియు గుండె జబ్బుల రోగులకు చాలా ఉపయోగకరం.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 487-489) - రచయిత: డా|| టి. భిక్షపతి