సగ్గుబియ్యము / Sago
From LTRC
| సగ్గుబియ్యము / Sago | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Liliopsida |
| Order | Arecales |
| Family | Arecaceae |
| Genus | Metroxylon |
| Scientific Name / Latin Name | Metroxylon sagu |
సగ్గుబియ్యమును పాయసములో వాడుతారు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమవు ఆహారం. సగ్గుబియ్యపు జావను జ్వరము రోగులకు ఇస్తుంటారు. ఇది రుచిగాఉండి తేలికగా జీర్ణమౌతుంది. మృదువుగా ఉంటాయి. పొట్టకు బలాన్ని కలిగిస్తాయి.
వివిధ భాషల్లో పేర్లు
- హిందీపేరు : సాగోదాన
- తెలుగుపేరు : సగ్గుబియ్యము
- లాటిన్ పేరు : మెట్రోక్సైలాన్ సాగో (Metroxylon sagu)
- కుటుంబము : Arecaceae
పోషక విలువలు
- ప్రొటీన్లు: 0.3 గ్రా
- కార్బోహైడేట్లు: 86 గ్రా
- క్రొవ్వు: 0.3 గ్రా
- కాల్షియం: 21 మి.గ్రా
- పాస్పరస్: 21 మి.గ్రా
- ఇరన్: 1.6 మి.గ్రా
- నియాసిన్: 0.2 మి.గ్రా
- విటమిన్ బి1: 0.1 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్: 0.3 మి.గ్రా
- కేలరీలు: 350
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- శక్తి మరియు జీర్ణక్రియ: సగ్గుబియ్యము బలమైన ఆహారం. శక్తినిస్తాయి. రోగిని తొందరగా కోలుకొనుటకు సహకరిస్తాయి. మూత్రమును సాఫీగా వెలుబడునట్లు సహకరిస్తాయి.
- దీర్ఘకాలిక వ్యాధులు: సగ్గుబియ్యం దీర్ఘకాలం రోగము నుండి బాధపడేవారికి, కామెర్లరోగాలకు, అజీర్తి రోగులకు, అతిసారం, జిగురువిరేచనాలు క్షయరోగాలకు మంచిది.
- పిల్లల ఎదుగుదల: ఎదుగుతున్న పిల్లలకు సగ్గుబియ్యము జావ యందు తేనే వేసి ఇచ్చిన ఎదుగుదలబావుంటుంది.
- బలం మరియు శుక్రవృద్ధి: సగ్గుబియ్యమును పాలతో కాచి అందులో కిస్మిస్, జీడిపప్పులు, ఏలకులు, మరియు పంచదార కలిపి తయారు చేసుకొని త్రాగే పాయసము బలాన్ని కలిగిస్తుంది శుక్రాన్నివృద్ధి చేస్తుంది సంతృప్తిని కలిగిస్తుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 611) - రచయిత: డా|| టి. భిక్షపతి
