సగ్గుబియ్యము / Sago

From LTRC
సగ్గుబియ్యము / Sago
Kingdom Plantae
Division Tracheophytes
Class Liliopsida
Order Arecales
Family Arecaceae
Genus Metroxylon
Scientific Name / Latin Name Metroxylon sagu

సగ్గుబియ్యమును పాయసములో వాడుతారు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమవు ఆహారం. సగ్గుబియ్యపు జావను జ్వరము రోగులకు ఇస్తుంటారు. ఇది రుచిగాఉండి తేలికగా జీర్ణమౌతుంది. మృదువుగా ఉంటాయి. పొట్టకు బలాన్ని కలిగిస్తాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • హిందీపేరు : సాగోదాన
  • తెలుగుపేరు : సగ్గుబియ్యము
  • లాటిన్ పేరు : మెట్రోక్సైలాన్ సాగో (Metroxylon sagu)
  • కుటుంబము : Arecaceae

పోషక విలువలు

  • ప్రొటీన్లు: 0.3 గ్రా
  • కార్బోహైడేట్లు: 86 గ్రా
  • క్రొవ్వు: 0.3 గ్రా
  • కాల్షియం: 21 మి.గ్రా
  • పాస్పరస్: 21 మి.గ్రా
  • ఇరన్: 1.6 మి.గ్రా
  • నియాసిన్: 0.2 మి.గ్రా
  • విటమిన్ బి1: 0.1 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.3 మి.గ్రా
  • కేలరీలు: 350

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శక్తి మరియు జీర్ణక్రియ: సగ్గుబియ్యము బలమైన ఆహారం. శక్తినిస్తాయి. రోగిని తొందరగా కోలుకొనుటకు సహకరిస్తాయి. మూత్రమును సాఫీగా వెలుబడునట్లు సహకరిస్తాయి.
  • దీర్ఘకాలిక వ్యాధులు: సగ్గుబియ్యం దీర్ఘకాలం రోగము నుండి బాధపడేవారికి, కామెర్లరోగాలకు, అజీర్తి రోగులకు, అతిసారం, జిగురువిరేచనాలు క్షయరోగాలకు మంచిది.
  • పిల్లల ఎదుగుదల: ఎదుగుతున్న పిల్లలకు సగ్గుబియ్యము జావ యందు తేనే వేసి ఇచ్చిన ఎదుగుదలబావుంటుంది.
  • బలం మరియు శుక్రవృద్ధి: సగ్గుబియ్యమును పాలతో కాచి అందులో కిస్మిస్, జీడిపప్పులు, ఏలకులు, మరియు పంచదార కలిపి తయారు చేసుకొని త్రాగే పాయసము బలాన్ని కలిగిస్తుంది శుక్రాన్నివృద్ధి చేస్తుంది సంతృప్తిని కలిగిస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 611) - రచయిత: డా|| టి. భిక్షపతి