సోయాచిక్కుళ్ళు / Soyabean
From LTRC
| సోయాచిక్కుళ్ళు / Soyabean | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Papilionaceae |
| Genus | Glycine |
| Scientific Name / Latin Name | Glycine max |
ప్రస్తుతం ప్రపంచమంతా సోయా బీన్స్ను సాగు చేస్తున్నారు. సోయా బీన్స్ చాలా బలమైన ఆరోగ్యాన్ని కలిగించే ఆహారము. ఇందులో ప్రొటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
వివిధ భాషల్లో పేర్లు
- ఇంగ్లీష్‌పేరు : సోయాబీన్స్
- హిందీపేరు : బట్
- తెలుగుపేరు : గుది సోయాచిక్కుళ్ళు, సోయాబీన్స్
- లాటిన్ పేరు : గ్లైసిన్ సోడా (Glycine max)
- కుటుంబము : Papilionaceae
పోషక విలువలు
- ప్రొటీన్లు: 44 గ్రా
- కార్బోహైడేట్లు: 21.0 గ్రా
- కొవ్వు: 19.5 గ్రా
- ఇరన్: 12 గ్రా
- కాల్షియం: 240 మి.గ్రా
- ఫాస్పరస్: 690 మి.గ్రా
- నియాసిన్: 2.4 మి.గ్రా
- విటమిన్ - ఎ: 710 అం.యు
- కేలరీలు: 430
- అమైనో ఆమ్లాలు: ల్యూసిన్, ఐసోల్యూసిన్, లైసిన్, సిస్టిన్, హిస్టిడిన్, ఆర్జినైన్, మిథియోనిన్, ఫినైలలనిన్, త్రియోనిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్లు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- క్యాన్సర్ నివారణ: సోయాలో ప్రొటీన్లు ఎక్కువ కావున ఇది చక్కని మాంసాహారముతో సమానము. సోయాబీన్స్ తినే వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటస్టైనల్ క్యాన్సర్ చాలా తక్కువని పరిశోధకులు అంటున్నారు.
- స్త్రీల ఆరోగ్య సమస్యలు: స్త్రీలు తమ ఆహారంలో తప్పనిసరిగా సోయాబీన్స్ వాడాలి. సోయాబీన్స్‌లో ఐసో ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మెన్పాజ్ స్థితికి చేరిన మహిళలకు చాలా ఉపయోగకరము.
- గుండె మరియు మధుమేహం: సోయా బీన్ గుండె జబ్బుల రోగులకు మరియు మధుమేహరోగులకు కూడా ఎంతో ఉపయోగకరము.
- మెదడు ఆరోగ్యం మరియు నిద్రలేమి: సోయాబీన్ పాలు 125 మి.లీ మరియు తేనె 10-20 మి.లీ కలిపి రాత్రి పడుకునే ముందు తాగిన మెదడుకు మంచిది, చక్కగా నిద్రపడుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది. హైపర్టెన్సన్, మధుమేహము మరియు క్లోయ్ రోగులకు మంచిది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 610) - రచయిత: డా|| టి. భిక్షపతి
