వంకాయ / Brinjal
From LTRC
| వంకాయ / Brinjal | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Solanales |
| Family | Solanaceae |
| Genus | Solanum |
| Scientific Name / Latin Name | Solanum melongena L. |
వంకాయ (Solanum melongena) సొలనేసి (Solanaceae) కుటుంబానికి చెందినది. వంకాయలను భారతదేశమంతటా సాగుచేస్తున్నారు. "ఆహా ఏమి రుచి తినరామైమరచి తాజా కూరల్లో రాజా ఎవరండీ ఇంకా చెప్పాలా వంకాయేనండి" అన్నாரో సినీకవి. వంకాయలు తిన్న వాతాన్ని తగ్గిస్తాయి, మలమూత్రములను సాఫీగా వెడలునట్లు చేస్తాయి మరియు వంకాయలతో చేసే పచ్చడి రుచిగా ఉంటుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : వార్తాకము
- హిందీ : బెంగాన్
- తెలుగు : వంకాయలు
- లాటిన్ : సాలనమ్ మిలోంజీనా
- ఇంగ్లీష్ : బ్రింజాల్
- కుటుంబము : Solanaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల వంకాయల యందు:
- ప్రొటీన్లు: 1.6 గ్రా
- కార్బోహైడేట్లు: 6.3 గ్రా
- క్రొవ్వు: 0.4 గ్రా
- కాల్షియం: 210 మి.గ్రా
- పొటాషియం: 229 మి.గ్రా
- మెగ్నీషియం: 16 మి.గ్రా
- పాస్ఫరస్: 61 మి.గ్రా
- సోడియం: 3 మి.గ్రా
- కాఫర్: 0.17 మి.గ్రా
- సల్ఫర్: 44 మి.గ్రా
- క్లోరిన్: 52 మి.గ్రా
- నియాసిన్: 0.6 మి.గ్రా
- ఆక్సాలిక్ ఆసిడ్: 29.1 మి.గ్రా
- విటమిన్ - ఎ: 124 అం.యు
- విటమిన్ - బి1: 55 మై.గ్రా
- విటమిన్ - బి2: 95 మై.గ్రా
- విటమిన్ - సి: 12 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్: 0.09 మి.గ్రా కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు & బలవర్ధకం: లేత వంకాయలు రుచిగా ఉంటాయి, బలాన్ని కలిగిస్తాయి, ఆకలిని పుట్టిస్తాయి, మలమూత్రములను వెడలిస్తాయి మరియు శుక్రాని వృద్ధిచేస్తాయి.
- అర్షమెములు & దగ్గు నివారణ: లేతవి తెల్ల వంకాయలు అర్షమెముల రోగులకు పధ్యంగా ఉంటాయి. వంకాయల ఆకులకు నొప్పిని తగ్గించే గుణాలున్నాయి. వంకాయ ఆకుల రసమందు తేనె కలిపి 1 చంచా (5-10 మి.లీ) రోజుకు 3 సార్లు సేవించిన దగ్గు తగ్గుతుంది మరియు కఫము చక్కగా వెడలుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- వంకాయ కొందరికి అలర్జీని కలిగిస్తుంది అలాంటి వ్యక్తులు మానివేయడం మంచిది. ముదురు వంకాయలను ఎక్కువగా తింటే అసిడిటీ కలుగుతుంది. వంకాయలకు బాగా మసాలాలు పట్టించి అతి ఎక్కువగా తింటే కడుపులో మంట అసిడిటీ కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 595-596) - రచయిత: డా|| టి. భిక్షపతి
