బ్రోవల్లియా (Browallia demissa)
From LTRC
| బ్రోవెల్లియా | |
|---|---|
| ప్రాథమిక వివరాలు | |
| శాస్త్రీయ నామం | Browallia demissa |
| కుటుంబం | Solanaceae (సొలనేసి) |
| స్వస్థలం | దక్షిణ అమెరికా |
పరిచయం
బ్రోవెల్లియా (Browallia demissa) సొలనేసి కుటుంబానికి చెందిన పూల మొక్క. ఇది దక్షిణ అమెరికాకు చెందినది.
వృక్ష వివరణ
- ఈ మొక్క నడిపొడవుగా 30–45 సెం.మీ. వరకు పెరుగును.
- ఆకులు చిన్నవిగా, సన్నని కోల ఆకారంలో ఉండును.
పుష్ప వివరణ
- పూలు పెటునియా పూలవలె గొట్టపు ఆకృతిలో ఉండును.
- పూలు సుమారు 1 సెం.మీ. పొడవు కలిగి, ఆకు సందులలో ఉండును.
- పూలు నీలము, ఊదారంగులలో ఉండును.
- Browallia speciosa major అను మరియొక రకం తేటనీలపు రంగు పూవులను కలిగి ఉండును.
సాగు
- బ్రోవెల్లియాను గోలెములలో పెంచిన చక్కగా ఉండును. దీనిని పూల మడులలో కూడా పెంచవచ్చును.
- ఇది వెచ్చని తేమ నేలలో, అరనీడలో ఎంతో బాగుగా పెరుగును.
- వర్షాకాలములో పెంచుటకు జూన్–జూలై నెలలలో విత్తవలెను.
- ముఖ్యముగా వర్షము తక్కువగా ఉండే ప్రాంతములలో శీతకాలమున పూయుటకు సెప్టెంబరు–అక్టోబరు నెలలలో విత్తవలెను.
- కొండలపై మార్చి–ఏప్రిల్ నెలలలో దీనిని నాటుదురు.
- విత్తిన తరువాత 2½–3 నెలలలో మొదటి పూవుకు వచ్చును.
మూలాలు
- డా. విష్ణు స్వరూప్, ఉద్యాన పుష్పములు, పుట 38.
