బూడిద గుమ్మడి / Ash Gourd

From LTRC
బూడిద గుమ్మడి / Ash Gourd
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Benincasa
Scientific Name / Latin Name Benincasa hispida (Thunb.) Cogn.

బూడిద గుమ్మడి 10 మీటర్ల పొడవు వరకు పెరిగే ఏక వార్షిక పాదు. దీని అన్ని భాగాలు నుగుతో కూడి ఉంటాయి. నులి తీగలుంటాయి. ఆకులు హృదయాకారములో లేదా వృత్తాకారంలో ఉంటాయి. ఫలము కొంచెము కోలంగా ఉండి పైన తెల్లగా ఉండి అనేక విత్తనాలతో కూడి ఉంటుంది. బూడిదగుమ్మడి భారతదేశములోని అన్ని ప్రాంతాల్లో పెంచబడుతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : కూష్మాండ ;
  • హిందీ : పేగా కధ్ధారా ;
  • ఇంగ్లీష్ : ఆష్గార్డ్ ;
  • తెలుగు : బూడిద గుమ్మడి ;
  • లాటిన్ : బెనిన్యాసాహెసిడా (తంబర్గ్) వాగ్క్స్ ;
  • కుటుంబము : Cucurbitaceae ;

పోషక విలువలు

బూడిద గుమ్మడి యందు (ప్రతి 100 గ్రాములకు):

  • ప్రొటీన్లు : 4 గ్రా
  • క్రొవ్వు : 4. గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 3 గ్రా
  • నార (ఫైబర్) : 0.8 గ్రా
  • ఖనిజలవణములు : 0.3 గ్రా
  • కాల్షియం : 28 మి.గ్రా
  • పాస్పరస్ : 35 మి.గ్రా
  • ఐరన్ : 0.4 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్ : 0.4 మి.గ్రా
  • పొటాషియం : 2 మి.గ్రా
  • సోడియం : 4 మి.గ్రా
  • విటమిన్ -బి 2 : 63 మై.గ్రా
  • విటమిన్ - ఎ మరియు బి కొద్దిమోతాదులో కలవు. బూడిద గుమ్మడిలో 14 కేలరీలు ఉన్నాయి. దీని బీజముల యందు తైలము కలదు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మూత్ర సంబంధ సమస్యలు: బూడిదగుమ్మడి సేవించటం వలన మూత్రం సాఫీగా నడుస్తుంది. దీని వలన శరీరంలో వ్యర్థపదార్థాలు విసర్జించబడతాయి. మూత్రంలో రాళ్ళు ఉన్నప్పుడు గుమ్మడి కాయ రసం నందు యవక్షారమును, బెల్లమును కలిపి త్రాగించిన మూత్రం కష్టంగా వెదలటము, మూత్రంలో రాళ్ళు తగ్గుతాయి.
  • ఆస్తా, బ్రాంకైటీస్: బూడిదగుమ్మడి వేరు చూర్ణమును గోరు వెచ్చని నీటితో త్రాగించిన తీవ్రమగు శ్వాస, కాసలు తగ్గుతాయి. బూడిద గుమ్మడి విత్తనాలను కూడా ఎండించి 1 చెంచా చూర్ణమును వేడినీళ్ళతో త్రాగించిన శ్వాస (Asthma) కాస (Bronchites) ల వ్యాధి లక్షణాలు తగ్గుతాయి.
  • అపస్మారము: బూడిదగుమ్మడి కాయ రసమునందు యష్టిమధు కలిపి మెత్తగా నూరి దానిని 3 దినములు వాడిన అపస్మారవ్యాధి నశిస్తుందని आयुర్వేద సంహితల్లో చెప్పబడింది.
  • లివర్ మరియు కామెర్ల వ్యాధులు: బూడిదగుమ్మడి కామెర్లవ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
  • అమీబియాసిస్ & మలబద్ధకం: అమీబిక్ డీసీజెస్తో బాధపడు రోగులు బూడిదగుమ్మడి వాడిన ప్రేగు యొక్క గోడలు బలంగా తయారవుతాయి. బూడిద గుమ్మడిని ఆహారంగా తీసుకుంటే సుఖవిరేచనం అవుతుంది. ఇది అర్శమోసుల వ్యాధికి మంచిది.
  • రక్తహీనత & వేసవితాపము: బూడిద గుమ్మడిని తినటం వలన రక్తం వృద్ధి అవుతుంది.
  • బలము మరియు పుష్టికోసం: బూడిదగుమ్మడి గుజ్జునుండి రసం తీసి దానికి పంచదార చేర్చి త్రాగిన బలము, శరీరపుష్టి కలుగుతుంది.
  • మధుమేహం: బూడిదగుమ్మడి ఆల్కహాల్ ఎక్స్‌ట్రాక్ట్ మధుమేహ వ్యాధిగ్రస్తుల Blood Sugar levels ను తగ్గించినట్లు పరిశోధనలో గమనించారు.
  • అధికరక్తస్రావు: బూడిదగుమ్మడికి రక్తాన్ని గడ్డకట్టించే గుణముంది. తాజా బూడిదగుమ్మడి రసము మరియు ఉసిరి కాయరసము లేదా నిమ్మరసం కలిపి త్రాగిన అర్శమోసులు, ఊపిరితిత్తులు, ముక్కునుండి కారే రక్తస్రావాన్ని ఆపుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 545-546) - రచయిత: డా|| టి. భిక్షపతి