బంగాళ దుంపలు / Potato

From LTRC
బంగాళ దుంపలు / Potato
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Solanales
Family Solanaceae
Genus Solanum
Scientific Name / Latin Name Solanum tuberosum L.

ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్న పంటలలో ఆలుగడ్డ/బంగాళదుంపలు అతి ముఖ్యమైనవి. ఇవి మొదట పెరూదేశంలో సాగుచేయబడినవి అంటారు.

వివిధ భాషల్లో పేర్లు

  • హిందీ : ఆలు ;
  • తెలుగు : ఆలుగడ్డలు / బంగాళదుంపలు ;
  • లాటిన్ : సోలేనమ్ ట్యూబరోసమ్ లిన్నెయస్ ;
  • కుటుంబము : Solanaceae ;
  • ఆంగ్లం : Potato

పోషక విలువలు

బంగాళదుంపలను ఉడకబెట్టి పొట్టుతీసి కూరలలో వాడుదురు. బలమైన పోషకవిలువలు కలిగిన ఆహారం. ధర తక్కువ ఫలితాలు ఎక్కువ. ప్రతి 100 గ్రాముల బంగాళదుంపల యందు:

  • ప్రొటీన్లు : 2.4 గ్రా
  • క్రొవ్వు : 0.1 గ్రా
  • ఖనిజలవణములు : 0.6 గ్రా
  • నార (ఫైబర్) : 0.4 గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 22.5 గ్రా
  • కాల్షియం : 11 మి.గ్రా
  • పాస్పరస్ : 32 మి.గ్రా
  • ఇనుము (ఐరన్) : 0.7 మి.గ్రా
  • మెగ్నీషియం : 242 మి.గ్రా
  • సోడియం : 18 మి.గ్రా
  • పొటాషియం : 249 మి.గ్రా
  • సల్ఫర్ : 37 మి.గ్రా
  • క్లోరిన్ : 78.5 మి.గ్రా
  • కాఫర్ : 0.20 మి.గ్రా
  • నియాసిన్ : 1 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్ : 1.2 మి.గ్రా
  • ఆగ్జాలిక్ ఆసిడ్ : 15 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 40 I.U
  • విటమిన్ - బి1 (థైమిన్) : 100 మై.గ్రా
  • విటమిన్ - బి2 (రైబోఫ్లేవిన్) : 15 మై.గ్రా
  • విటమిన్ - సి : 53 మి.గ్రా మరియు శక్తి 97 కేలరీలు కలవు.

ఇందులో ఎమినో ఆసిడ్స్ అయిన ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, సిస్టిన్, మిధియోనిన్ మరియు ట్రియోనిన్లు కూడా కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శక్తి & మూత్ర సమస్యలు: బంగాళదుంపలు చక్కని శక్తిని కలిగిస్తాయి. వీని బలాన్ని పుష్టిని కలిగిస్తాయి. అయితే ఎక్కువ తింటే వాతము చేస్తాయి. బంగాళదుంపలు తినటం వలన మూత్రం కొద్ది కొద్దిగా రావడం తగ్గుతుంది. స్త్రీలకు పాలు ఎక్కువ పడతాయి.
  • గాయాలు & చర్మ సంరక్షణ: బంగాళ దుంపల రసము తీసి రాసి కాలిన గాయాలకు చక్కని ఉపశమనం కలుగుతుంది. బంగాళదుంపల రసము తీసి ముఖమునకు రాసిన మొటిమలు తగ్గుతాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • బంగాళదుంపలను ఊబశరీరము, మధుమేహము, యూరిక్ ఆసిడ్ మరియు రూమాటిజమ్ రోగులు వాడకుండా ఉంటే మంచిది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 553-554) - రచయిత: డా|| టి. భిక్షపతి