పాలకూర / Spinach

From LTRC
పాలకూర / Spinach
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Amaranthaceae
Genus Beta
Scientific Name / Latin Name Beta vulgaris L.

ఆకుకూరకోసం దీనిని సాగుచేస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగి ఉండటమే కాకుండా చక్కని రుచి కలిగి ఉండేది పాలకూర. పాలకూర శీత గుణము కలిగి, వాతాన్ని, కఫాన్ని వృద్ధి పరుస్తుంది. పాలకూర సూప్ బలాన్ని కలిగిస్తుంది. రక్తహీనతను తొలగిస్తుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది. చూపును పెంపొందిస్తుంది ఎముకలకు పటుత్వాన్ని కలిగిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: పాలక్యా ;
  • హిందీ: పాలక్ ;
  • తెలుగు: పాలకూర ;
  • లాటిన్: బీటా వల్గారిస్ లిన్నెయస్ ;
  • కుటుంబము: Chano podiaceae ;

పోషక విలువలు

పాలకూరయందు పోషక విలువలు క్రింది విధంగా కలవు:

  • తేమ: 86.4 గ్రా
  • ప్రొటీన్లు: 3.4 గ్రా
  • క్రొవ్వు: 0.8 గ్రా
  • ఫైబర్ (నార): 0.7 గ్రా
  • ఖనిజవనములు: 2.2 గ్రా
  • కేలరీలు: 4.6 గ్రా
  • కాల్షియం: 380 మి.గ్రా
  • పాస్పరస్: 30 మి.గ్రా
  • ఐరన్: 16.2 మి.గ్రా
  • డైమిన్: 0.26 మి.గ్రా
  • రిబోఫ్లేవిన్: 0.56 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 3.3 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 9,770 యూనిట్స్
  • విటమిన్ - బి: 70 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • ఆహారంగా మరియు పథ్యముగా: ఎక్కువగా తింటే మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఆయాసంతో బాధపడువారికి పథ్యంగా ఉంటుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నరోగులు పాలకూరను తినకపోవటమే మంచిది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 524) - రచయిత: డా|| టి. భిక్షపతి