టొమాటో / Tomato
From LTRC
| టొమాటో / Tomato | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Solanales |
| Family | Solanaceae |
| Genus | Solanum |
| Scientific Name / Latin Name | Solanum lycopersicum |
టొమాటో (Solanum lycopersicum) సోలనేసి కుటుంబానికి చెందిన ఒక ప్రముఖ కూరగాయల మొక్క. మన ఆహారపదార్థాలతో సాధారణముగా వాడేది టొమాటోలు. ప్రపంచము మొత్తంగా దీనిని ఉపయోగిస్తున్నారు. చిన్నగా కంటిని ఇంపుగా అందంగా కనిపించే టొమాటోలను Love apple అని కూడా అంటారు. టొమాటోలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్ కలదు. ఇది క్యాన్సర్ను నిరోధిస్తుంది.
వివిధ భాషల్లో పేర్లు
- హిందీ పేరు: టమాటర్
- తెలుగు పేరు: టొమాటో, రాముములగపండు
- లాటిన్ పేరు: లైకోపర్సికమ్ ఎస్కులెంటమ్
- కుటుంబము: సోలనేసి
- ఆంగ్ల పేరు: Tomato
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల టొమాటోల యందు:
- కార్బోహైడేట్లు: 4 గ్రాములు
- ప్రొటీన్లు: 1 గ్రాము
- క్రొవ్వు: 0.1 గ్రాము
- కాల్షియం: 13 మి.గ్రా
- పాస్పరస్: 25 మి.గ్రా
- ఇనుము (ఇరన్): 0.1 మి.గ్రా
- పొటాషియం: 360 మి.గ్రా
- సోడియం: 3 మి.గ్రా
- సల్ఫర్: 0.05 మి.గ్రా
- క్లోరిన్: 51 మి.గ్రా
- కాఫర్: 0.01 మి.గ్రా
- నియాసిన్: 0.4 మి.గ్రా
- ఫోలిక్ ఆసిడ్: 1 మి.గ్రా
- విటమిన్ - ఎ: 14,160 I.U
- విటమిన్ - బి1: 120 మై.గ్రాములు
- విటమిన్ - బి2: 60 మై.గ్రాములు
- విటమిన్ - సి: 32 మి.గ్రా
- విటమిన్ - కె: 0.1 మి.గ్రా
- సిట్రిక్, మాలిక్ మరియు ఆక్సాలిక్ ఆసిడ్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- జీర్ణక్రియ మరియు విటమిన్ లోపాలు: టొమాటోలు చక్కగా జీర్ణమౌతాయి. ఇందులోని ఆసిಡ್స్ కడుపుబ్బరమును నిరోధిస్తాయి. టొమాటోలు దీనిని తినటం వలన విటమిన్ ఎ లోపం వలన వచ్చే వ్యాధులు నిరోధించవచ్చు.
- వివిధ అనారోగ్య సమస్యలకు: టొమాటో రసం నందు కొద్దిగా మిరియాల పొడి కలిపి సేవించిన లివర్ వ్యాధిగ్రస్తులకు, వెవిళ్ళతో బాధపడు గర్భిణీ స్త్రీలకు, కామెర్ల రోగులకు, మలబద్ధకము రోగులకు, ఆహారం జీర్ణం కాని వ్యక్తులకు మరియు కడుపుబ్బరం కలిగి వాయువు బయటికి రాని రోగులకు మంచిది.
- రాజయక్ష్య మరియు ఇతర వ్యాధులు: టొమాటోలు రాజయక్ష్య (టి.బి) కీళ్ళజబ్బులు, చర్మవ్యాధులు మరియు ఆస్త్యా రోగులకు కూడా ఉపయోగకరమే.
- రోగ నిరోధక శక్తి మరియు జ్వరములు: టొమాటోలను సేవించటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టొమాటో రసము మరియు పసుపు కలిపి ప్రతిరోజు సేవించిన ఇస్నోఫీల్ కౌంట్ తగ్గుతుంది. టొమాటో జ్యూస్ నందు పంచదార కలిపి త్రాగటం వలన చక్కని శక్తి, ఉత్సాహము కలుగుతుంది. ఇది జ్వరముతో బాధపడు రోగులకు, నీరసంతో బాధపడురోగోలకు చాలా మంచిది.
- సౌందర్య పోషణ: టొమాటో రసము చక్కని సౌందర్య సాధనం కూడా. టొమాటో రసమును లేదా టొమాటోలను మెత్తగా చేసి ముఖనకు పట్టించి 1 గంట తరువాత చక్కగా కడిగి వేసిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. మొటిమలు (Pimples) తగ్గుతాయి.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- టొమాటోలమందు మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న రోగులు వాతరక్తము (గౌట్) రోగులు సేవించరాదు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 462-464)
- రచయిత: డా|| టి. భిక్షపతి
