చామంతి / Chrysanthemum
From LTRC
| చామంతి / Chrysanthemum | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Asterales |
| Family | Asteraceae |
| Genus | Chrysanthemum |
| Scientific Name / Latin Name | అంతిమాస్ సోబిలిస్ (Chrysanthemum morifolium / Anthemis nobilis L.) |
చక్కని సువాసనను సమశీతోష్ణంగా ఉంది కండ్లకు చలువచేసేది చామంతి. ఇది స్త్రీల విరహతాప జ్వరమును హరిస్తుంది. ఇది శిరోజాలను పెంచుతుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: శతపత్రి
- హిందీ: సేవంతి
- తెలుగు: చామంతి
- లాటిన్: అంతిమాస్ సోబిలిస్
- కుటుంబము: Asteraceae
పోషక విలువలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల ప్రత్యేక పట్టిక వివరాలు పేర్కొనబడలేదు)
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- శరీర నీరు & వాపులు: చామంతి కషాయం శరీరానికి నీరు చేరకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.
- తలనొప్పి, జ్వరం & క్రిమి రోగాలు: చామంతి కషాయం తల త్రిపుటం, జ్వరము, క్రిమి రోగాలను హరించును.
- అరుచి & అగ్నిమాంద్యం: చామంతి పువ్వుల కషాయంను జ్వరము, శ్వాస, మంట, తాపము, అరుచి, అగ్నిమాంద్యము మొదలగు వానిని పోగొట్టును.
- శ్వాస & విషములు: చామంతి వేరురసము లేక వేరు కషాయం శ్వాస, కఫము, పైత్యము, విషము, అనాహము, వాపు మొదలగు వానిని హరించును.
- ప్రణాలు & గాయాలు: చామంతి పువ్వుల రసం ప్రణాలను, గాయాలను మానేట్లు చేస్తుంది. చీము పట్టకుండా చూస్తుంది. ఇన్ని గుణాలున్న చామంతి అలంకారప్రాయము కాదు, ఔషధయుక్తము కూడా అని అర్థమైంది కదూ!
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 452-453)
- రచయిత: డా|| టి. భిక్షపతి
