గులాబీ / Rose

From LTRC
గులాబీ / Rose
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Rosales
Family Rosaceae
Genus Rosa
Scientific Name / Latin Name రోసా ఇండికా లిన్నెయస్ (Rosa indica L.)

మన ఇళ్ళలో పూల తోటల్లో పెంచే మొక్క గులాబీ. సువాసనను కలిగి మనస్సును మనోహరంగా రంజింపచేయు పువ్వు గులాబీ. గులాబీ తిక్త కషాయ మధుర రసము స్నిగ్ధలఘు గుణమును శీతవీర్యము మధుర విపాకములను కలిగి ఉంటుంది. ఇది త్రిదోషహరము శుక్రములను. హృద్యము మరియు పాచనము అనే కర్మలను కలిగి ఉంది. గులాబీ రేకులను తినటం మనం గమనించే ఉంటాము. గులాబీ రేకు 3-4 గ్రాములు తిన్నయెడల విరేచనమవుతుంది. గులాబీ పువ్వులు, పంచదార కలిపి తయారుచేసే గుల్ఖందు చలువ చేస్తుంది. జీర్ణశక్తిని, బలాన్ని ఇస్తుంది మనోల్లాసమును కలిగిస్తుంది. ధాతువులకు సౌమ్యతనిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: తరుణీ
  • హిందీ: గులాబ్
  • తెలుగు: గులాబీ
  • లాటిన్: రోసా ఇండికా లిన్నెయస్
  • కుటుంబము: Rosaceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • తలనొప్పి: గులాబీ రేకుల రసాన్ని పిండిన తలనొప్పి తగ్గి ఉపశమనము కలుగుతుందని అనుభవజ్ఞులు అంటున్నారు.
  • విరేచనాలు & మలబద్ధకం: గులాబీ రేకులను నీళ్ళలో నానవేసి లేదా సేవించిన విరేచనంవుతుంది లేదా గులాబీ రేకులను ఎండించి నేతిలో వేయించి భోజనము యొక్క మొదటి ముద్దతో కలిపి సేవించిన సుఖవిరేచనసౌతుంది. ఇది మలబద్ధకముతో బాధపడు వారికి మరియు అర్షమోలలు రోగులకు మంచిది.
  • జ్యూస్ / దাহము: గులాబీ పువ్వుల రసముతీసి పంచదార కలిపి జ్యూస్ చేసుకుంటే ఎంతొ రుచిగా ఉంటుంది. దాహము తీరుతుంది. కడుపుబ్బరము తగ్గుతుంది. గుండె జబ్బుల రోగులకు చాలా మంచిది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీ: 431)
  • రచయిత: డా|| టి. భిక్షపతి