కుంకుమ పువ్వు / Saffron Crocus
| కుంకుమ పువ్వు / Saffron Crocus | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Magnoliophyta |
| Class | Liliopsida |
| Order | Asparagales |
| Family | Iridaceae |
| Genus | Crocus |
| Scientific Name / Latin Name | క్రోకస్ సటైవస్ లిన్నెయిస్ (Crocus sativus L.) |
పందంటి బిడ్డ చక్కని వర్ణముతో పుట్టాలని చాలామంది కోరుకుంటారు. భారతదేశంలోని చాలామంది గర్భిణీస్త్రీలు కుంకుమ పువ్వును పాలలో కలిపి వాడుతారు. దీని వలన పాలు కూడా ఎక్కువగా పడతాయి. గర్భిణీ స్త్రీలు తమలపాకులతో పాటు కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటే ఐరన్ అందుతుంది. ప్రసవం తేలికగా అవుతుంది. రక్త హీనత నివారించబడుతుంది. ఇది కాశ్మీరు నందు పెంచబడుతుంది. కుంకుమ కటుతిక్త రసము ఉష్ణ వీర్యము స్నిగ్ధ గుణము మరియు కటు విపాకములను గుణము కలిగి ఉంది. ఇది వర్ణ్యము, కఫవాతహరము శోణిత స్థాపనము అనే కర్మలను కలిగి ఉంది. దీనిని ముఖం నలుపుగా ఉండటం, నల్లటి మచ్చలు వాంతి, తలనొప్పి మరియు కంటి వ్యాధులలో ఉపయోగిస్తారు.
కుంకుమ పువ్వు నందు గ్లూకోసైడ్నందు క్రోసిన్, క్రోసిటిన్ సిక్రోక్రోసిన్ మరియు స్థిరతైలములు ఉంటాయి. ఇంకా బీటా మరియు గామా కెరోటిన్ మరియు లైకోసీన్లు కూడా ఉంటాయి. కుంకుమ పువ్వు యొక్క కేసరాలను ఔషధంగా వాడుతారు. ఇవి చక్కని సుగంధము కలిగి ఉంటాయి. చక్కని శరీర వర్ణానికి కుంకుమ పువ్వు మంచి ఔషధం చాలా సౌందర్య సాధనాల్లో కుంకుమ పువ్వును వాడుతున్నారు.
కుంకుమ పువ్వుమంజిష్ఠా, దారుహరిద్రా లను వెన్నతో కలిపి పెదాలపై రాసిన సున్నితమైన మధువులూరించే పెదవులు వారి సొంతమౌతాయి. దీనిని ముఖం మీద రాసిన ముడతలు తొలగి పోతాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: కుంకుమ, కాశ్మీర
- హిందీ: కేసర
- తెలుగు: కుంకుమ పువ్వు
- లాటిన్: క్రోకస్ సటైవస్ లిన్నెయిస్
- కుటుంబము: Iridaceae
పోషక విలువలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు పేర్కొనబడలేదు)*
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- గర్భిణీ స్త్రీలకు: కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోవడం వల్ల ప్రసవం తేలికగా అవ్వడంతో పాటు రక్తహీనత నివారించబడుతుంది.
- ముఖం మరియు చర్మ సంరక్షణ: ముఖం నలుపుగా ఉండటం, నల్లటి మచ్చలు మరియు ముడతలు తొలగిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
- పెదవుల సంరక్షణ: కుంకుమ పువ్వు, మంజిష్ఠా, దారుహరిద్రా లను వెన్నతో కలిపి పెదాలపై రాస్తే సున్నితమైన పెదవులు సొంతమవుతాయి.
- సాధారణ ఉపయోగాలు: వాంతి, తలనొప్పి మరియు కంటి వ్యాధులలో దీనిని ఉపయోగిస్తారు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 410-411)
- రచయిత: డా|| టి. భిక్షపతి
