ఆవకూర / ఆవాలు (Mustard Greens)

From LTRC
ఆవకూర / ఆవాలు (Mustard Greens)
శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification)
రాజ్యము (Kingdom): Plantae
విభాగము (Division): Tracheophyta
తరగతి (Class): Magnoliopsida
క్రమము (Order): Brassicales
కుటుంబము (Family): Brassicaceae (Cruciferae)
ప్రజాతి (Genus): Brassica
లాటిన్ పేరు: Brassica campestris

ఆవకూర లేదా ఆవాలు (Mustard Greens) అనేది బ్రాసికేసి (Cruciferae) కుటుంబానికి చెందిన ఒక ప్రముఖమైన ఆకుకూర మరియు గింజల మొక్క. దీని శాస్త్రీయ నామం బ్రాసికా కంపెస్ట్రిస్ (Brassica campestris). భారతదేశంలో ఈ మొక్కను ఎక్కువగా ఉత్తర ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఆవల లేత ఆకులను, లేత కాడల్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కూరల్లో, పప్పులో వాడుతారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఆవాలు
  • సంస్కృతం: సర్షప
  • హిందీ: సర్సోం
  • లాటిన్: బ్రాసికా కంపెస్ట్రిస్ లిన్నెయిస్ (Brassica campestris)
  • కుటుంబము: Cruciferae

పోషక విలువలు

దీనిలో విటమిన్ - ఎ మరియు క్యాల్షియంలు ఎక్కువగా ఉంటాయి.

పోషకాల వివరాలు:

  • ఖనిజలవణాలు: 16 గ్రా
  • ప్రోటీన్లు: 4 గ్రా
  • కొవ్వు: 0.6 గ్రా
  • ఫైబర్ (నార): 0.8 గ్రా
  • విటమిన్ - ఎ: 4370 యూనిట్స్
  • క్యాల్షియం: 155 మి.గ్రా
  • ఐరన్: 16.3 మి.గ్రా
  • ఫాస్పరస్: 26 మి.గ్రా
  • థైమిన్: 0.03 మి.గ్రా
  • విటమిన్ - సి: 33 మి.గ్రా
  • కేలరీలు: 33 గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • గుణాలు: ఆవకూర కఫవాతహరము, పిత్తవర్ధకము. ఇది కటుతిక్త రసము, ఉష్ణవీర్యము, లఘుస్నిగ్ధ గుణములను కలిగి ఉంది. ఇది శరీరం వేడి చేస్తుంది.
  • వ్యాధి నివారణ: ఆస్తమా రోగులకు ఇది మంచిది. దురదలు, చర్మవ్యాధులు, క్రిమిరోగాలు, ప్లీహం పెరుగుట అను వ్యాధుల్లో ఉపయోగిస్తారు.
  • బోదకాలు (శ్లీపదము): ఆవనూనెను త్రాగితే శ్లీపదము (బోదకాలు) నశిస్తుందని ఆచార్య సుశ్రుతుని అభిమతం. ఆవాలు మరియు పసుపు సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి పట్టువేస్తే బోదకాలులో వచ్చే వాపు తగ్గిపోతుంది.
  • దంత ఆరోగ్యం: ఆవాలలో ఉప్పుకలిపి పండ్లు తోముకుంటే దంతరోగాలు రావు.
  • పుండ్లు & చర్మ సమస్యలు: ఆవాల చూర్ణమును పుండ్లపై రాస్తే పుండ్లు తగ్గిపోతాయి. ఆవాలను వేపనూనెతో కలిపి వాడితే చర్మ రోగాలు తగ్గిపోతాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • ఒకవేళ ఆవాలు పడకపోతే బొబ్బలు వస్తాయి, అప్పుడు వెంటనే వాడటం మానివేయాలి.
  • ఆవాలను అధికరక్తపోటు (High BP), అర్శమొలల రోగులు, అల్సర్లతో బాధపడేవాళ్ళు వాడకూడదు.
  • ఇది బాగా వేడి చేస్తుంది. కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. మల మూత్రములను బంధిస్తుంది. కాబట్టి ఆవాలను అతిగా వాడకూడదు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 342, 343)
  • రచయిత: డా|| టి. భిక్షపతి