ఆముదము / Castor Plant

From LTRC
ఆముదము / Castor Plant
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Malpighiales
Family Euphorbiaceae
Genus Ricinus
Scientific Name Ricinus communis L.

ఆముదము (Castor Plant) Euphorbiaceae కుటుంబానికి చెందిన ప్రముఖ మూలికా మొక్క. ఇది విరేచనాన్ని కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆముదపు చిగుళ్లను వైద్యులు కామెర్లు రోగంలో ఉపయోగిస్తారు. దీని వేర్లు, ఆకులు, గింజలు మరియు తైలము వివిధ ఆయుర్వేద ఔషధాలలో విస్తృతంగా ఉపయోగపడతాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఆముదము
  • సంస్కృతం: ఏరండ
  • హిందీ: రేండీ
  • లాటిన్: రెసినస్ కమ్యూనిస్ లిన్నెయస్ (Ricinus communis)
  • కుటుంబము: Euphorbiaceae

పోషక విలువలు

ఆముదము యొక్క గింజల యందు క్రింది విధమైన పదార్థాలు కలవు:

  • స్థిరతైలము (Fixed oil): 50%
  • ప్రోటీన్: 26%

ఇందులో రిసినిన్, రిసిన్ వంటి కాన్స్టిట్యూయంట్స్ కలవు. మూలత్వక్ (Root bark) నందు Gallotannins కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

ఆముదము మధుర, కటు, కషాయ రసములు, తీక్ష్ణ, సూక్ష్మ గుణములు, ఉష్ణవీర్యము మరియు మధుర విపాకములను కలిగి ఉంది. ఇది ఆమవాటం (రుమటాయిడ్ ఆర్థరైటిస్), అర్శస్సు, గుల్మము, కడుపుబ్బరం, కడుపునొప్పి, లివర్ పెరుగుట, వాపు, మలబద్ధకము, నడుమునొప్పి, కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.

  • అర్శమొలలు: త్రిఫలక్వాధము నందు ఏరండ తైలము కలిపి త్రాగిన అర్శమొలలు తగ్గును.
  • మలబద్ధకము: విరేచనం కాకుండా ఇబ్బంది పడే రోగులకు 1-2 చెంచాలు ఆముదాన్ని పడుకునే ముందు వేడి నీళ్లలో లేదా పాలలో కలిపి సేవించిన విరేచనమవుతుంది.
  • రుమటాయిక్ ఆర్థరైటీస్ (ఆమవాతము): శుంటి 1 గ్రాము, గుగ్గులు 1 గ్రాము, ఆముదము వేర్లు 1 గ్రాము కలిపి కషాయం కాచి సేవించిన రుమటాయిక్ ఆర్థరైటీస్ వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి.
  • కామెర్లు: ఆముదము వేరు చూర్ణము 1-2 గ్రాములు తేనె 5 మి.లీ కలిపి త్రాగిన కామెర్లు తగ్గుతాయి. ఆముదము వేరు నందు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణములు కలవు; ఇది Acety Salicylic acid కంటే శక్తివంతమైనది.
  • మేధోవృద్ధి: ఏరండ పత్రాకారము నందు కలిపి బియ్యము కడుగు నీటితో సేవించిన అధికలావు తగ్గును.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 353, 354)
  • రచయిత: డా|| టి. భిక్షపతి