ఆపిల్ (Apple)

From LTRC
ఆపిల్ (Apple)
శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification)
రాజ్యము (Kingdom): Plantae
విభాగము (Division): Tracheophyta
తరగతి (Class): Magnoliopsida
క్రమము (Order): Rosales
కుటుంబము (Family): Rosaceae
ప్రజాతి (Genus): Malus
శాస్త్రీయ నామం: Malus domestica (syn. Malus sylvestris)

ఆపిల్ (Apple) అనేది అంతర్జాతీయంగా లభించే ఒక ప్రముఖమైన ఫలము. దీని శాస్త్రీయ నామం మ్యాలెస్ సిల్వెస్ట్రిస్ (Malus sylvestris). రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన ఈ పండు ఆరోగ్యాన్ని అందించటంలో అద్వితీయమైనది. ఆపిల్‌లో ఫ్రక్టోజ్ అధిక శాతంలో ఉండటం వల్ల ఇది ఎంతో మధురంగా ఉంటుంది. "An Apple a day keeps the doctor away" (ప్రతిదినము ఒక ఆపిల్ తినడం వలన డాక్టర్ల అవసరం ఉండదు) అనే నానుడి దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

विभिन्न భాషల్లో పేర్లు

  • తెలుగు: ఆపిల్ కాయ
  • సంస్కృతం: సెబా ఫలము
  • హిందీ: సేవ్
  • లాటిన్: మ్యాలెస్ సిల్వెస్ట్రిస్
  • కుటుంబము: Rosaceae

పోషక విలువలు

ఆపిల్‌లో 60% ఫ్రక్టోజ్, 25% గ్లూకోజ్, 15% సుక్రోజ్‌లతో పాటు అయోడిన్, ఇనోసిటాల్ కూడా లభిస్తాయి. ఇందులో ఉండే బి1, ఫాస్పరస్, పొటాషియమ్‌లు గ్లుటామిక్ యాసిడ్ సింథసిస్‌కు సహకరించి నర్వస్ సిస్టమ్‌ను మెరుగ్గా ఉంచుతాయి.

ప్రతి 100 గ్రాముల ఆపిల్‌లోని పోషకాలు:

  • కార్బోహైడ్రేట్లు: 13 గ్రాములు
  • ప్రోటీన్లు: 0.3 గ్రాములు
  • కొవ్వు: 0.2 గ్రాములు
  • క్యాల్షియం: 10 మి.గ్రా
  • ఫాస్పరస్: 20 మి.గ్రా
  • ఐరన్: 1.7 మి.గ్రా
  • పొటాషియమ్: 94 మి.గ్రా
  • సోడియం: 3 మి.గ్రా
  • సల్ఫర్: 7.3 మి.గ్రా
  • మెగ్నీషియం: 5 మి.గ్రా
  • క్లోరిన్: 1 మి.గ్రా
  • కాపర్: 85 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 90 I.U
  • విటమిన్ - ఇ: 0.7 మి.గ్రా
  • విటమిన్ - బి1: 120 మి.గ్రా
  • విటమిన్ - బి6: 0.03 మి.గ్రా
  • పాంతోథినిక్ యాసిడ్: 0.07 మి.గ్రా
  • బయోటిన్: 0.3 మి.గ్రా
  • విటమిన్ - సి: 56 మి.గ్రా
  • ఆక్సాలిక్ యాసిడ్: 1.5 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • నర్వస్ టానిక్ (Nervine Tonic): ఆపిల్ ముక్కలను తేనె, పాలతో కలిపి తీసుకుంటే ఇది చక్కని నర్వైన్ టానిక్‌గా పనిచేస్తుంది. శ్రద్ధ లేకపోవడం, డిప్రెషన్, సోమరితనం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
  • రక్తహీనత (Anemia) & గుండె బలం: తీయ్యని ఆపిల్, తేనె, గులాబి రేకులు, రోజ్ వాటర్, కుంకుమపువ్వు, ఏలకులను కలిపి లేహ్యంగా చేసి ఉదయం-సాయంత్రం 20 మి.లీ. చొప్పున సేవిస్తే ఎనీమియా తగ్గి రక్తవృద్ధి జరుగుతుంది.
  • అతిసారము (Diarrhoea) & జిగురు విరేచనాలు: ఆపిల్ జ్యూస్, అరటిపండు కలిపి తింటే అతిసారం, జిగురు విరేచనాలు తగ్గుతాయి. దీనిలోని పెక్టిన్ (Pectin), మాలిక్ యాసిడ్ (Malic acid) బ్యాక్టీరియా చర్యలను అడ్డుకుంటాయి.
  • పిప్పిపళ్ళు (Carries teeth): ప్రతిరోజు ఆపిల్‌ను చప్పరించి నమిలి తినడం వల్ల పిప్పిపళ్ళు రావడం తగ్గుతుంది.
  • గ్యాస్ట్రైటిస్ (ఆమ్లపిత్తము): కడుపులో యాసిడ్ చేరి కడుపు, ఛాతీ మంటతో బాధపడేవారు ఆపిల్ జ్యూస్‌ను అధిక మొత్తంలో తాగడం వల్ల ఉపశమనం పొందుతారు.
  • స్కర్వీ & యూరిక్ యాసిడ్: ఆపిల్ తినడం వల్ల స్కర్వీ వ్యాధిని, శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక మోతాదును నిరోధించవచ్చు.
  • మూర్ఛ & గుండె దడ: ఆపిల్, తేనె, గులాబి రేకులతో చేసిన లేహ్యం తినడం వల్ల గుండె దడ, మూర్ఛ తగ్గుతాయి.
  • హృదయ ఉత్తేజకము: ఆపిల్‌లో ఉండే పాలిఫినాల్స్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.
  • జ్వరం & మలబద్ధకం: ఆపిల్ తినడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియాలు నిరోధించబడి మళ్ళీ మళ్ళీ జ్వరం రావడం తగ్గుతుంది. ఆపిల్, అరటిపండు కలిపి తినడం వల్ల మలబద్ధకం, అర్శమొలల నుండి ఉపశమనం లభిస్తుంది.
  • గొంతునొప్పి & కడుపులో క్రిములు: ఆపిల్ రసంలో దాల్చిని చెక్కను కలిపి తాగితే గొంతునొప్పి తగ్గుతుంది. ఆపిల్ చెట్టు బెరడు కషాయం (20-30 మి.లీ.) తాగితే కడుపులోని క్రిములు నివారించబడతాయి.
  • కేశ & చర్మ సౌందర్యము: ఆపిల్ లేత ఆకుల ముద్దను తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, నిగనిగలాడుతూ పెరుగుతుంది, చుండ్రు నివారించబడుతుంది. ఆపిల్ గుజ్జులో పసుపు, చందనం కలిపి ముఖానికి రాస్తే ముడుతలు తగ్గి కాంతివంతమవుతుంది.
  • క్యాటరాక్ట్ (Cataract): కంటిలో శుక్లాలు ఏర్పడుతున్న దశలో ఆపిల్ లేత ఆకుల రసాన్ని కళ్ళలో వేస్తే క్యాటరాక్ట్ నిరోధించబడుతుంది.
  • గజ్జి, తామర & పియోరియా (Pyorrhoea): ఆపిల్ చెట్టు మూలత్వక్ బెరడు (Root bark)ను నూరి రాస్తే గజ్జి, తామర తగ్గుతాయి. చెట్టు బెరడును కాల్చి అందులో స్పటిక (Alum), మిరియాలు, లవణము కలిపి పళ్ళు తోమితే చిగుళ్ళ నుండి రక్తం, చీము కారడం నిలిచిపోతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 327 - 331)
  • రచయిత: డా|| టి. భిక్షపతి