కర్బూజ (Muskmelon)
From LTRC
| Scientific Classification | |
|---|---|
| Kingdom: | Plantae
|
కర్బూజ పండు అనేది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందిన ఒక ప్రముఖమైన పండ్ల లత లేదా మొక్క. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మిలో (Cucumis melo). వేసవి కాలంలో మనకు లభ్యమయ్యే పండ్లలో కర్బూజ పండు అత్యంత ముఖ్యమైనది.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: కర్బూజ / కర్బూజ పండు
- హిందీ & ఉర్దూ: ఖర్బూజ
- లాటిన్: కుకుమిస్ మిలో (Cucumis melo)
- కుటుంబము: Cucurbitaceae (కుకుర్బిటేసి)
పోషక విలువలు
కర్బూజ పండు చాలా రుచిగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల కర్బూజ పండులో 2400 I.U. విటమిన్ - ఎ ఉంటుంది.
ఆరోగ్య ఉపయోగాలు
- మూత్రనాళ సమస్యలు: ఇది మూత్రలంగ (Diuretic) గా పనిచేసి మూత్రం కష్టంగా వెడలటాన్ని తగ్గిస్తుంది.
- జీర్ణక్రియ: దీనిని తినడం వలన చక్కని విరేచనాన్ని కలిగిస్తుంది మరియు మలబద్ధకం తగ్గుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీ: 415)
- రచయిత: డా|| టి. భిక్షపతి
