వేరుశనగలు / Groundnuts
From LTRC
| వేరుశనగలు / Groundnuts | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Papillionaceae |
| Genus | Arachis |
| Scientific Name / Latin Name | Arachis hypogaea L. |
వేరుశనగలను భారతదేశమంతటా సాగుచేస్తున్నారు. వేరుశనగలు మంచి పోషకవిలువలు కలిగిన ఆహారము. ఇవి రుచిగా ఉంటాయి. బలాన్ని కలిగిస్తాయి. వీర్యవృద్ధి చేస్తాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : భూచనక
- హిందీ : మూమ్‌పల్లి
- తెలుగు : పల్లికాయలు ; వేరుశనగలు
- లాటిన్ : Arachic hypogaea
- కుటుంబము : Papillionaceae
- ఇంగ్లీష్ : Groundnuts
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల వేరుశనగలో:
- తేమ: 7.9 గ్రా
- ప్రొటీన్లు: 27 గ్రా
- కార్బోహైడేట్లు: 17 గ్రా
- క్రొవ్వు: 49 గ్రా
- బూడిద: 1.9 గ్రా
- కాల్షియం: 61 మి.గ్రా
- సోడియం: 4 మి.గ్రా
- పొటాషియం: 700మి.గ్రా
- పాస్ఫరస్: 422 మి.గ్రా
- మెగ్నీషియం: 181 మి.గ్రా
- క్లోరిన్: 7 మి.గ్రా
- ఇరన్: 2 మి.గ్రా
- నియాసిన్: 14మి.గ్రా
- కాఫర్: 0.90 మి.గ్రా
- విటమిన్ - ఎ: 63.10 అం.యు
- విటమిన్ - బి1: 864 మై.గ్రా
- విటమిన్ - సి: 3మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్: 14.1మి.గ్రా
కలవు. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇంకా వేరుశనగల యందు ఆర్జినైన్, ఐసోలూసిన్, లైసిన్, మిథియోనిన్, త్రియోనిన్, వాలిన్, హిస్టిడిన్, లూసిన్, సిస్టీన్, ఫినైలలనిన్, మరియు ట్రిప్టోపాన్, ఇందులోని గింజల యందు లెసితె న్సులు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు & బలవర్ధకం: వేరుశనగల యందు పోషకవిలువలు ఎక్కువే. ఇవి మాంసాహారములతో సమానమని చెప్పవచ్చు. బాగా పందని శనగలు స్త్రీలకు పాలను ఎక్కువగావృద్ధి చేస్తాయి. వేరుశనగలు శరీరానికి దృఢత్వాన్ని కలుగజేస్తాయి.
- నూనె మరియు జీర్ణక్రియ: వేరుశనగ నూనెకూరల్లో, పచ్చళ్ళ లో వాడతారు. ఇది కూరలకు రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది. విరేచనమును సాఫీగా వెడలునట్లు చేస్తుంది.
- శాకాహారులకు ప్రయోజనం: శాఖాహారం భుజించేవారికి వేరుశనగలు ఎంతో మంచివి. దీని సేవన వలన వారి శరీరానికి కావాల్సిన అనేక పోషకవిలువలు అందుతాయి.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- వేరుశనగలు ఎక్కువగా తింటే కడుపుబ్బరం, మలబద్ధకము కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 603) - రచయిత: డా|| టి. భిక్షపతి
