వెలగపండు / Wood Apple

From LTRC
వెలగపండు / Wood Apple
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Sapindales
Family Rutaceae
Genus Limonia
Scientific Name / Latin Name Limonia acidissima

వెలగపండు తీపి, పులుపు మరియు వగరుల కలయిక. చక్కని సుగంధము దీని సొత్తు. వెలగను ఆహారంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు. వెలగపండుతో జెల్లీలు తయారుచేస్తారు. ఇది అలసటను, నీరసాన్ని దూరం చేస్తుంది, రుచిని పుట్టిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: కపిత్థఫలము;
  • హిందీ: కవితా;
  • తెలుగు: వెలగ;
  • మలయాళ: లత్తి;
  • లాటిన్: ఫెరోనియా లిమోనియా;
  • కుటుంబము: Rutaceae;

పోషక విలువలు

వెలగపండునందు పోషక విలువలు ఈక్రింది విధంగా కలవు:

  • తినేభాగము: 55-58%
  • తేమ: 69.5
  • ప్రొటీన్లు: 7.3
  • ఇథర్ ఎక్స్‌ట్రాక్ట్: 0.6
  • మినరల్ మేటర్: 1.9
  • ఫైబర్ (నార): 5.2
  • కార్బోహైడ్రేట్లు: 15.5
  • కాల్షియం: 0.13
  • భాస్సరస్: 0.11%
  • ఐన్ (ఇనుము): 0.6 మి.గ్రా మొదలుగునవి
  • ప్రతి 100 గ్రాముల వెలగపండులో పండని వెలగపండులో ఆమ్లశాతము 7.6%, పండిన వెలగపండులో 2.3% ఉంది.
  • రిబోఫ్లేవిన్: 17 మి.గ్రా
  • విటమిన్ - సి: 2.0 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ గుణాలు: శ్వాస, కాస, వికారము, అర్షమొలల రోగులకు హితకరం. వెలగ ఆకుల యందు స్థిర తైలములు కూడా కలవు.
  • అతిసారం - జిగురువిరేచనాలు: వెలగపండు గుజ్జు ಸೇವించిన అతిసారము మరియు జిగురు విరేచనాలలో ఉపయుక్తంగా ఉండును.
  • చిగుళ్ళు మరియు గొంతు వ్యాధులు: వెలగపండు తినటం వలన చిగుళ్ళు వ్యాధులు నిరోధించబడతాయి. దీని గుజ్జురసము పుక్కిలించిన దంతాలు గట్టిపడతాయి.
  • వికారము, వాంతి: వెలగపండుతోపాటు జీలకర్ర, శుంతి, పిప్ప్లి కలిపి నిన్న్యోదల కడుపులో మంట, వాంతి, వికారము, అజీర్తి తగ్గుతుంది.
  • ఇంక్ తయారీ: వెలగపండు జిగురును ఇంక్ మరియు డైయింగ్‌తో ఉపయోగిస్తారు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 507) - రచయిత: డా|| టి. భిక్షపతి