మసూరపప్పు / Lentil

From LTRC
మసూరపప్పు / Lentil
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Fabales
Family Leguminaceae
Genus Lens
Scientific Name / Latin Name Lens culinaris Medik.

మసూరపప్పు (Lens culinaris) లెగ్యూమినేసి (Leguminaceae) కుటుంబానికి చెందినది. భారతదేశములోని చల్లటి ప్రాంతాలలో దీనిని పప్పు ధాన్యం కోసం పండిస్తున్నారు. ఇది మంచి న్యూట్రిషన్స్ కలిగి ఉన్న ఆహారం. మసూర ఆకులను కూరగా వండుకొని తింటారు. మసూరపప్పు ఎర్రగా రుచిగా ఉంటుంది మరియు తేలికగా జీర్ణమౌతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : మసుర
  • హిందీ : మసూర్‌దాల్
  • తెలుగు : మసూరపప్పు
  • ఇంగ్లీష్ : లెంటిల్
  • లాటిన్ : లెంస్ కులినారిస్
  • కుటుంబము : Leguminaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల మసూరపప్పు యందు:

  • ప్రొటీన్లు: 29.7 గ్రా
  • క్రొవ్వు: 0.7 గ్రా
  • కార్బోహైడేట్లు: 59.7 గ్రా
  • ఇరన్: 2 మి.గ్రా
  • కాల్షియం: 130 మి.గ్రా
  • పాస్ఫరస్: 245 మి.గ్రా
  • నియాసిన్: 1.5 మి.గ్రా
  • సోడియం: 23 మి.గ్రా
  • పొటాషియం: 402 మి.గ్రా
  • ఆక్సాలిక్ ఆసిడ్: 21.4 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 450 అం.యు
  • విటమిన్ - బి1: 450 మై.గ్రా
  • విటమిన్ - బి2: 489 మై.గ్రా

మరియు దీనితో పాటు ఎమినో ఆసిడ్స్ అయిన ఆర్జినైన్, హిస్టిడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, సిస్టీన్, థియోనిన్, ఫినైలలనిన్, త్రియోనిన్, వాలిన్, మరియు ట్రిప్టోపాన్ లు ఇందులో కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీర పుష్టి & జీర్ణక్రియ: మసూర పప్పు బలాన్ని కలిగిస్తుంది శరీరానికి పుష్టినిస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది.
  • అతిసారం మరియు గ్రహణీవాతము: అతిసారము, గ్రహణీవాతము మొదలుగువానిని హరిస్తుంది. ఇది విరేచనాన్ని కలిగిస్తుంది.
  • మాల్‌అబ్సార్‌ప్షన్ సిండ్రోమ్: మసూరపప్పు మరియు టొమాటో రసం కలిపి త్రాగితే మాల్‌అబ్సార్‌ప్షన్ సిండ్రోమ్ రోగులకు మంచిది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మసూరపప్పు ఎక్కువ తింటే కడుపుబిగబడుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 586-587) - రచయిత: డా|| టి. భిక్షపతి