బెండకాయ / Lady's Finger
From LTRC
| బెండకాయ / Lady's Finger | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Malvales |
| Family | Malvaceae |
| Genus | Abelmoschus |
| Scientific Name / Latin Name | Abelmoschus esculentus (L.) Moench |
బెండకాయను చాలా దేశాల్లో సాగుచేస్తున్నారు. అందమైన ఆడవాళ్ళ చేతివేళ్ళలాగ ఇవి ఉంటాయి కాబట్టి లేడీస్ ఫింగర్ అంటారు. జిగటగా కొద్దిగా తియ్యగా ఉండే బెండకాయను భారతదేశమంతటా సాగుచేస్తున్నారు. బెండకాయ కూర రుచిగా ఉంటుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : భేట్టి / భిండా ;
- హిందీ : బెందీ ;
- తెలుగు : బెండకాయ ;
- లాటిన్ : ఎబెల్ మెశ్చీన్ ఎస్క్యెలెంటస్ / ఎవిసకస్ ఎస్క్యెలెంటస్ ;
- ఇంగ్లీష్ : లేడీస్ ఫింగర్ ;
- కుటుంబము : Malvaceae ;
పోషక విలువలు
బెండకాయ యందు (ప్రతి 100 గ్రాములకు):
- ప్రొటీన్లు : 6.9 గ్రా
- కార్బోహైడ్రేట్లు : 7.3 గ్రా
- క్రొవ్వు : 0.4 గ్రా
- ఫైబర్ : 1.2 గ్రా
- కాల్షియం : 88 మి.గ్రా
- మెగ్నీషియం : 43 మి.గ్రా
- కాఫర్ : 0.19 మి.గ్రా
- సల్ఫర్ : 30 మి.గ్రా
- పాస్పరస్ : 56 మి.గ్రా
- సోడియం : 54మి.గ్రా
- పొటాషియం : 323 మి.గ్రా
- ఐరన్ : 1.4 మి.గ్రా
- ఖనిజలవణములు : 0.7 మి.గ్రా
- విటమిన్ - ఎ : 88 I.U
- విటమిన్ - బి 1 : 61 మి.గ్రా
- విటమిన్ - సి : 14 మి.గ్రా
- ఆగ్జాలిక్ ఆసిడ్ : 10.3 మై.గ్రా
- నికోటినిక్ ఆసిడ్ : 0.6 మి.గ్రా ల పోషక విలువలను కలిగి ఉంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు: బెండకాయ వాత కఫములను పెంచును చలువచేస్తుంది. ఎక్కువ తింటే మలబద్ధకము చేస్తుంది. లేత బెండకాయ వాతహరము. బెండకాయ కూర సేవించడం వలన శీఘ్రస్కలనాన్ని నిరోధించబడుతుంది.
- జీర్ణకోశ సమస్యలు & మ్యూసిలేజ్: బెండకాయలోని జిగురు (మూసిలేజ్) ప్లాస్మా రిప్లేస్మెంట్గా పనిచేస్తుంది. ఇది డయూరియా, గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు జిగురు విరేచనాలందు ఉపయుక్తంగా ఉంటుంది.
- వివిధ వ్యాధుల నివారణ: లేత బెండకాయ జిగురునందు అరటిపండు మరియు 250 మి.లీ మజ్జిగ కలిపి రోజుకు 3 సార్లు త్రాగించిన కామెర్లు, గనేరియా, టైపాయిడ్, అతిసారము జిగురు విరేచనాలు మరియు గర్భిణీస్త్రీలకు టానిక్లాగా పనిచేస్తుంది.
- స్త్రీల వ్యాధులు: బెండకాయ సేవనము స్త్రీల వ్యాధులలో ఎంతో ఉపయోగకరం.
- ప్రతికూలతలు: బెండకాయ / బెండకాయ జిగురు ఎక్కువగా తిన్న యెడల అజీర్ణము కలుగుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- బెండకాయ ఎక్కువగా తింటే మలబద్ధకము చేస్తుంది.
- బెండకాయ జిగురు ఎక్కువగా తిన్న యెడల అజీర్ణము కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 541-542) - రచయిత: డా|| టి. భిక్షపతి
