బీరకాయ / Ridge Gourd

From LTRC
బీరకాయ / Ridge Gourd
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Luffa
Scientific Name / Latin Name Luffa acutangula (L.) Roxb.

భారతదేశమంతటా పండించే బీరకాయలు చక్కని ఆహార వస్తువు. బీరపువ్వులు పసుపు పచ్చగా ఉండి బీరపాదుకే అందాన్ని తెస్తాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : కోశాతకీ ;
  • హిందీ : తోరాయ్ ;
  • ఇంగ్లీష్ : రిడ్జ్గార్డ్ ;
  • తెలుగు : బీరకాయ ;
  • లాటిన్ : లూఫా అక్కుటాంగులా ;
  • కుటుంబము : Cucurbitaceae ;

పోషక విలువలు

బీరకాయలో (ప్రతి 100 గ్రాములకు):

  • తేమ : 95.2 గ్రా
  • ప్రొటీన్లు : 0.5 గ్రా
  • క్రొవ్వు : 0.4 గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 4.2 గ్రా
  • ఖనిజలవణము : 0.3 గ్రా
  • కాల్షియం : 40 మి.గ్రా
  • మెగ్నీషియం : 11 మి.గ్రా
  • సోడియం : 2.9 మి.గ్రా
  • పొటాషియం : 50 మి.గ్రా
  • ఐరన్ : 2 మి.గ్రా
  • సల్ఫర్ : 13 మి.గ్రా
  • కాఫర్ : 0.16 మి.గ్రా
  • పాస్పరస్ : 40 మి.గ్రా
  • క్లోరిన్ : 7 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 57.5 I.U
  • విటమిన్ - బి 1 : 66 మై.గ్రా
  • విటమిన్ - బి 2 : 10 మై.గ్రా
  • విటమిన్ - సి : 5 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్ : 0.2 మి.గ్రా
  • ఆగ్జాలిక్ ఆసిడ్ : 27 మి.గ్రా మరియు కేలరీలు : 18 కలిగి ఉంది.

ఇంకా బీరకాయ గింజల యందు 20% సపోనిన్ గ్లైకోసైడ్, ఎంజైమ్, మరియు ఫిక్స్డ్ ఆయిల్స్ కలవు. ఈ తైలము జంతువులపై జరిపిన పరిశోధనలో అధిక లాలా స్రావము, వాంతులు మరియు విరేచనములను కలిగిస్తుంది. బీరకాయ లంసు ఉండే రసాయన పదార్థము ఎమిలిన్నకు దగ్గర పోలికలు కలిగి ఉంటుంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అమీబియాసిస్ నివారణ: అమీబియాసిస్ రోగులకు అమీబిక్ డిసెంట్ర్ మంచిది.
  • సాధారణ గుణాలు & ఆకలి: బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చలువ చేస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది. ఆకలిని పెంచుతుంది. కడుపులో మంట తగ్గుతుంది.
  • వివిధ వ్యాధులు: జ్వరము, ఆయాసము దగ్గు, క్రిమి రోగులకు పథ్యకరమైనది. మధుమేహ రోగులకు చాలా మంచిది.
  • పచ్చడి తయారీ & ప్రయోజనాలు: బీరకాయను చక్కని కడిగి దాని మీద ఉన్న తౌక్కును పైచర్మ్యాన్ని పీలర్తో చక్కని తీసి అందులో పచ్చి మిరపకాయలు కలిపి ఈ రెండింటిని నూనెలో వేయించి తీసి దానికి కొంత చింతపండు, కొంచెము ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు కలిపి నూరుకొని తాలింపు వేసుకొని దానిని తిన్న యెడల చక్కని రుచి మీ సొంతం. జ్వరం నందు యాంటీబయోటిక్స్ వాడి రుచి తెలియక ఇబ్బందిపడురోగీలకు ఈ పచ్చడి ఎంతో రుచిని కలిగిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తి కలిగిస్తుంది. అయితే ఎక్కువ తింటేవేడి చేస్తుంది.
  • మధుమేహం & శ్లేష్మం: బీరకాయ మరియు పాలు కలిపి వండితే ఆ రుచి చెప్పలేనది. బీరాకుల రసము ప్రతిరోజు త్రాగిన మధుమేహ రోగులకు ఉపయోగకరము. బీరకాయ లేత ఆకుల కషాయము ಸೇವించిన శ్లేష్మమును హరిస్తుంది.
  • కంటి సమస్యలు & చర్మ వ్యాధులు: బీర ఆకులను మెత్తగా నూరి రసము తీసి దానిని కళ్ళలో వేసిన కండ్లమంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతుంది. దీని ఆకుల రసమును చర్మవ్యాధులు, అర్శమోసుల యందు రాసిన చక్కని ఉపశమనము కలుగుతుంది.
  • పుండ్లు & మలబద్ధకం: బీర ఆకులను వెల్లుల్లిపాయలతో కలిసి మెత్తగా నూరి పుండ్లపై పట్టువేస్తే లేప్రసి రోగులకు ఉపశమనంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు కూర చేసుకొని తినటం వలన మలబద్ధకము తొలగుతుంది.
  • పిల్లల ఆరోగ్యం & గింజల గుణాలు: బీరకాయ కూర ప్రతిరోజు వాడటం వలన పిల్లలకు కావల్సిన పోషకవిలువలు అంది ఆక్షేపక వాతము మొదலగునవి నిరోధించబడతాయి. బీరకాయ గింజలయందు కోలిసింథిన్ ఉంటుంది. ఇది చక్కని విరేచన కారి గుణము కలిగి ఉంటుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 543-544) - రచయిత: డా|| టి. భిక్షపతి