బార్లీ / Barley
From LTRC
| బార్లీ / Barley | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Poales |
| Family | Graminae |
| Genus | Hordeum |
| Scientific Name / Latin Name | Hordeum vulgare L. |
యవలు లేదా బార్లీకూడా గోధుమ లాంటి ధాన్యపుగింజలే. ఇందులో అనేక రకాలున్నాయి. కొద్ది తీపి వగరు కలిసినదే బార్లీ ఇది మంచి ఆహారం.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : యవలు ;
- హిందీ : జావో ;
- తెలుగు : బార్లీగింజలు ;
- లాటిన్ : హర్డియమ్ వలేర్గీర్ ;
- కుటుంబము : Graminae ;
- ఆంగ్లం : Barley
పోషక విలువలు
100 గ్రాములు బార్లీ గింజల యందు:
- కార్బోహైడ్రేట్లు : 68 గ్రా
- ప్రొటీన్లు : 10 గ్రా
- క్రొవ్వు : 1.5 గ్రా
- ఐరన్ : 4 మి.గ్రా
- కాల్షియం : 28 మి.గ్రా
- పాస్పరస్ : 227 మి.గ్రా
- సోడియం : 4 మి.గ్రా
- పొటాషియం : 179 మి.గ్రా
- నియాసిన్ : 4.5 మి.గ్రా
- విటమిన్ - బి1 (థైమిన్) : 470 మై.గ్రా
- విటమిన్ - బి2 : 0.47 మి.గ్రా మరియు
- కేలరీలు : 334 కలవు.
వీటితో పాటు ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, గ్లైసిన్, మిధియోనిన్, ఫినైలనిన్ మరియు థ్రియోనిన్ అను ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ కూడా కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- మలమూత్ర శుద్ధి & జ్వరంలో ఆహారం: బార్లీ గింజలను జావ కాసుకొని త్రాగటం వలన మలమూత్రములు సాఫీగా వెదలుతాయి. బార్లీ త్రాగటం వలన మూత్రకోశమునందు మంట తగ్గుతుంది. మూత్రం కష్టంగా వెదలటం నివారించబడుతుంది. జ్వరముతో బాధపడు వ్యక్తులకు బార్లీ మంచి ఆహారం. దీనిని పాలతో కలిపి ఇవ్వవచ్చు. పసిపిల్లలకు బార్లీ మరియు పండ్లరసము కలిపి త్రాగించిన చాలా ఉపయోగకరం.
- మూత్రనాళ సమస్యలు & డ్యూరిటిక్ గుణాలు: బార్లీ బెల్లము మరియు నిమ్మరసములు కలిపి త్రాగించిన మంచి Diuretic గా పనిచేస్తుంది. ఇది హైపర్టెన్సన్, నెఫ్రైటిస్, గనేరియా, సిస్టైటిస్, యురేత్రయిటిస్, అతిసారం, జిగురు విరేచనాలు మరియు నరముల నిస్సత్తువ రోగులకు మంచిది.
- కంఠస్వరం & ఇతర ఉపయోగాలు: బార్లీ గింజలు కంఠస్వరమును వృద్ధిచేస్తాయి. ఎన్నో పోషకవిలువలున్న బార్లీ గింజలను కేవలం జ్వరం వచ్చినపుడే వాడటం ఎంత దురదృష్టకరము.
- బలం & శక్తి: బార్లీనందు గ్లూకోజ్ కలిపి తీసుకుంటే బలము శక్తి కలుగుతాయి. నీరసం తొలుగుతాయి. వాపులు తగ్గుతాయి. వీర్యపుష్టి కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 557-558) - రచయిత: డా|| టి. భిక్షపతి
