బఠానీలు / Green Peas

From LTRC
బఠానీలు / Green Peas
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Fabales
Family Fabaceae
Genus Pisum
Scientific Name / Latin Name Pisum sativum L.

బఠానీ గింజలను ఉత్తర భారతదేశములో ఎక్కువగా సాగుచేస్తున్నారు. పచ్చిబఠానీలను కూర వండుకొని తింటారు. ఎండిన బఠానీలను పై పొట్టు తీసివేసి తింటారు. బఠానీలు కమ్మగా తియ్యగా కొద్ది వగరుగా ఉంటాయి. ఎక్కువ తింటే వాతం చేస్తాయి. మలబద్ధకాన్ని కలిగిస్తాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : కలాయ ;
  • హిందీ : మటర్ ;
  • తెలుగు : బఠానీ గింజలు ;
  • లాటిన్ : పైసమ్ సెటైవమ్ లిన్నెయస్ ;
  • కుటుంబము : లెగ్యుమినోసి ;
  • ఆంగ్లం : Green Peas

పోషక విలువలు

100 గ్రాముల బఠానీగింజల యందు:

  • ప్రొటీన్లు : 72.5 గ్రా
  • ఖనిజలవణములు : 0.8 గ్రా
  • ఫైబర్ (నార) : 40.0 గ్రా
  • క్రొవ్వు : 0.1 గ్రా
  • ఐరన్ : 1.5 మి.గ్రా
  • కాల్షియం : 20 మి.గ్రా
  • మెగ్నీషియం : 34 మి.గ్రా
  • సోడియం : 7.8 మి.గ్రా
  • పొటాషియం : 79 మి.గ్రా
  • పాస్పరస్ : 139 మి.గ్రా
  • సల్ఫర్ : 95 మి.గ్రా
  • కాపర్ : 0.23 మి.గ్రా
  • రైబోఫ్లేవిన్ : 0.01 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 139 I.U
  • విటమిన్ - సి : 9 మి.గ్రా
  • థైమిన్ (బి1) : 0.25 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్ : 0.8 మి.గ్రా కలిగి ఉంది.

ఇందులో ఆల్కాయిడ్ ట్రైగోనిల్లో ఉండును. బాగా పండిన గింజలనుండి తైలము (Oil) తీస్తారు. ఇది వంధ్యత్వం (Sterility) ని కలుగచేస్తుందని మేల్సెక్స్ హార్మోనుపై ప్రభావమును చూపుతుందని పరిశోధనలో గమనించారు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • బలవర్ధక ఆహారం: బఠానీలు మంచి బలమైన ఆహారం. దేహపుష్టి, వీర్యవృద్ధి కలుగజేస్తాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • అల్సర్, హైపర్ సిడిటి మరియు ఆకలి తక్కువగా ఉండే రోగులు దీనిని తినకూడదు.
  • బఠానీలు ఎక్కువ తింటే వాతం చేస్తాయి మరియు మలబద్ధకాన్ని కలిగిస్తాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 559-560) - రచయిత: డా|| టి. భిక్షపతి