పొన్నగంటికూర / Sessile Joyweed
From LTRC
| పొన్నగంటికూర / Sessile Joyweed | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Caryophyllales |
| Family | Amaranthaceae |
| Genus | Alternanthera |
| Scientific Name / Latin Name | Alternanthera sessilis (L.) R.Br. ex DC. |
పొన్నగంటికూర ఒక ముఖ్యమైన ఆకుకూర మొక్క. ఇది తిక్తరస ప్రధానమైనది మరియు అగ్నిదీప్తి కలిగిస్తుంది. కఫవాతములను హరిస్తుంది. పొన్నగంటిని ఆకుకూర కోసము పెంచుతున్నారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : పత్త్తార ;
- హిందీ : మచేచి ;
- తెలుగు : పొన్నగంటికూర ;
- లాటిన్ : ఆల్టర్నాంతిరా సిస్ఫేಲೀಸ್ (లిన్నెయಸ್) రాక్స్బర్గ్
- కుటుంబము : Amaranthaceae ;
- ఆంగ్లం : Sessile Joyweed
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల పొన్నగంటికూరలో లభించే పోషక విలువలు:
- కేలరీలు : 73 గ్రా
- ప్రొటీన్లు : 5.0 గ్రా
- కాల్షియం : 510 మి.గ్రా
- ఐరన్ : 16.7 మి.గ్రా
- విటమిన్ - ఎ : 1,920 I.U
- రైబోఫ్లేవిన్ : 0.14 మి.గ్రా
- నియాసిన్ : 0.5 మి.గ్రా
- విటమిన్ - సి : 28 మి.గ్రాగలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- శరీరపు వాపులు: పొన్నగంటికూర ఒంటికి నీరు చేరకుండా చేస్తుంది.
- జీర్ణశక్తి & రక్తహీనత: జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
- చర్మవ్యాధులు: చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది.
- మూత్ర సంబంధ సమస్యలు: మూత్రం మంటతో కూడి రావటం మూత్రం చుక్కలు చుక్కలుగా రావటాన్ని నిరోధిస్తుంది
- అర్శమోసులు & ప్లీహవృద్ధి: అర్శమోసులు మరియు ప్లీహవృద్ధి (Spleen Enlargement) వ్యాధుల్లో హితంగా ఉంటుంది.
- నేత్ర ఆరోగ్యం: నేత్రములకు బలాన్ని చేకూర్చుతుంది.
- గాయాలు: ఆకు పసరు గాయాలను మాన్పుతుంది.
- శుక్రవృద్ధి: శుక్రాన్ని పెంచుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 86) - రచయిత: డా|| టి. భిక్షపతి
