పొట్లకాయ / Snake Gourd

From LTRC
పొట్లకాయ / Snake Gourd
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Trichosanthes
Scientific Name / Latin Name Trichosanthes anguina L.

పొట్లకాయ ఆహారంగా ఔషధంగానే కాకుండా అనేక పోషక విలువలను కూడ కలిగి ఉంది. పొట్లకాయ కఫహరము చలువ చేస్తుంది. ఇది అధిక లావును తగ్గిస్తుంది తేలికగా జీర్ణమౌతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: పటోల ;
  • హిందీ: చిచింధా ;
  • తెలుగు: పొట్లకాయ ;
  • లాటిన్: ట్రైకోసాంథిన్ అంగ్వీనా లిన్నెయస్ ;
  • కుటుంబము: Cucurbitaceae ;

పోషక విలువలు

పొట్లకాయ యందు పోషక విలువలు క్రింది విధంగా కలవు:

  • ప్రొటీన్లు: 0.4 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 5 గ్రాములు
  • క్రొవ్వు: 0.4 గ్రాములు
  • నార (ఫైబర్): 3 గ్రా
  • కేలరీలు: 20 గ్రాములు
  • కాల్షియం: 50 మి.గ్రా
  • పాస్పరస్: 21 మి.గ్రా
  • ఐరన్: 1.3 మి.గ్రా
  • పొటాషియం: 8.3 మి.గ్రా
  • మెగ్నీషియం: 9 మి.గ్రా
  • సోడియం: 2.6 మి.గ్రా
  • క్లోరిన్: 4 మి.గ్రా
  • కాఫర్: 1.11 మి.గ్రా
  • సల్ఫర్: 17 మి.గ్రా
  • ఆగ్సాలిక్ ఆసిడ్: 1 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 255 I.U
  • విటమిన్ - బి1: 39.5 మి.గ్రా
  • విటమిన్ - బి2: 60.1 మి.గ్రా
  • విటమిన్ - సి: 29 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.5 మి.గ్రా పొట్లకాయలో ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ గుణాలు: గుండెజబ్బులు, కామెర్లు, అలర్జీస్, మధుమేహ రోగులకు చాలా మంచి ఆహారం. పొట్లకాయ పాలు కలిపి కూర వండుకు తింటే రుచిగా ఉంటుంది. విరేచనం సాఫీగా అవుతుంది.
  • విరేచనం & దగ్గు: పొట్లకాయ ఆకుల స్వరం పిల్లలకు త్రాగించిన చక్కని విరేచనం అవుతుంది. దగ్గు తగ్గుతుంది.
  • జీర్ణశక్తి & శుక్రవృద్ధి: పొట్లకాయ కూర అగ్నిదీప్తిని కలిగిస్తుంది. శుక్రవృద్ధిని కలిగిస్తుంది. అన్ని వ్యాధులందు పథ్యముగా ఉండును.
  • శరీర కాంతి & వాతము: పొట్లకాయ ఆకు తిన్న శరీరానికి కాంతి కలుగును. వాతము శమిస్తుంది. దగ్గు క్రిములు తగ్గిపోతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 518, 519) - రచయిత: డా|| టి. భిక్షపతి