పొగాకు / Tobacco

From LTRC
పొగాకు / Tobacco
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Solanales
Family Solanaceae
Genus Nicotiana
Scientific Name / Latin Name Nicotiana tabacum L.

పొగాకు ఏక వార్షిక మొక్క. భారతదేశంలోని సమశీతోష్ణ ప్రాంతములలో దీనిని సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలు పొగాకుకు ప్రసిద్ధి. పొగాకు కటుతిక్తరసము ఉష్ణవీర్యము లఘుతీక్షద్వాయు వికాసి గుణములు మరియు కటువిపాకములను కలిగి ఉంది. ఇది శుక్రాన్ని హరిస్తుంది. పొగాకు కఫవాతశామకము, పిత్త వర్ధకము అనే కర్మలను కలిగి ఉంది. దీనిని అస్థ్య, దురదలు, క్రిమి దంతాలు, క్రిమి రోగాల్లో వాడుదురు. పొగాకు ఆకుల యందు నికోటిన్, నికోటియస్, నికోటాయిస్, అనూబిసిన్, నార్ - నికోటిన్స్కలవు. పొగాకు నందుగ్లూకోసైడ్ తహాసినిస్, మరియు తమసిటిన్ అనే అంశములు కలవు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: తామ్రపర్ణ ;
  • హిందీ: తంబాకు ;
  • తెలుగు: పొగాకు ;
  • లాటిన్: నికోటియానా టోబాకామ్ లిన్నెయస్ ;
  • కుటుంబము: Solanaceae ;

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అండముల వాపు: పొగాకు మరియు గచ్చకాయ ఆకులను కలిపి మెత్తగా నూరి వరిబీజములకు కట్టిన వాపు, నొప్పి తగ్గుతుంది.
  • శూల (నొప్పి): పొగాకు కాడలను కాల్చి ఆ బూడిద మరియు పిప్పళ్ళ చూర్ణములను సమభాగములుగా కలిపి నిమ్మపండ్ల రసముతో అబ్దిగ అన్ని రకాల నొप्पులు తగ్గుతాయి.
  • పాము, తేలు కాటు: పొగాకును చిన్నచిన్న ముక్కలుగా చేసి కప్పుర నూనెలో కలిపి ఒక సీసాలో వేసి గట్టిగా మూత బిగించి 3-4 నెలల తర్వాత వేరొక సీసాలో వేసిదానిని చక్కగా పిసికి రసము తీసి చక్కగా మూత బిగించి ఉంచుకోవాలి. పాము, తేలు కురిచిన వారికి 30-40 చుక్కలు త్రాగించిన వమనులై విషము దిగుతుంది. విరేచనము అవుతుంది. ఈ తైలాన్ని పాము, తేలు కుట్టిన చోట చక్కగా మర్దన చేసిన బాధ నివారించబడును అని అనుభవజ్ఞుల అభిప్రాయము.
  • చర్మరోగాలూ: పొగాకు లేదా కాడలను కాల్చి ఆ భస్మాన్ని నూనెలో కలిపి రాసిన చర్మ వ్యాధులు శమిస్తాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • పొగాకు-జర్థాకీళ్ళు: ఈనాడు పొగాకును మంచి కోసం కాకుండా మత్తుకోసం, ఉత్సాహంకోసం వాడుతున్నారు. రకరకాల పాన్ పరాగ్‌లు, పాన్ మసాలాలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు దీనితో తయారవుతాయి. పొగాకు / సిగరెట్లు, బీడీలు, త్రాగటం, పాన్ పరాగ్ తినటం జర్థాకీళ్ళు నమలడం వలన ఆకలి, జీర్ణశక్తి తగ్గుతుంది. నరములు బలహీనమౌతాయి. పక్షవాతము, గుండెజబ్బులు, లివర్ వ్యాధులు వచ్చి రోగి మరణానికి దగ్గరవుతాడు.
  • క్యాన్సర్లు మరియు ఇతర దుష్ప్రభావాలు: వీటిని సేవించటం వలన రకరకాల క్యాన్సర్లు వస్తాయి. ముఖ్యంగా గొంతుకన్సర్‌, టాన్సిల్స్ క్యాన్సర్ నాలుక, అన్నవాహిక, అంగిట వెనుక భాగములో క్యాన్సర్ వస్తుంది. గుండెకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండె జబ్బులు యాంజెనా పెక్టోరిస్ లాంటి వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా ఎరిధిమియాస్, సడెన్ హార్ట్ డెత్లు కలుగుతాయి. నోరు తెరుచుకునే వెడల్పు తగ్గుతుంది. మెత్తటి చర్మం నందు ఫైబ్రస్టిష్యూ ఏర్పడి నోరు తెరవక ఇబ్బంది ఏర్పడి దవడ క్యాన్సర్ వస్తుంది. అల్లర్లు ఈసోఫేగల్ రిఫ్లెక్స్‌తో పాటు అన్నవాహిక మరియు టంగ్ క్యాన్సర్ వస్తుంది. పళ్ళు గారపడతాయి. నవ్వితే అసహ్యంగా ఉంటారు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 522, 523) - రచయిత: డా|| టి. భిక్షపతి