దాల్చినచెక్క / Cinnamon
From LTRC
| దాల్చినచెక్క / Cinnamon | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Laurales |
| Family | Lauraceae |
| Genus | Cinnamomum |
| Scientific Name / Latin Name | Cinnamomum verum |
దాల్చిన చెక్క (Cinnamomum verum) లౌరేసి కుటుంబానికి చెందిన ఒక సుగంధ ద్రవ్య వృక్షము. దీనిని సంస్కృతంలో త్వక్ అని, హిందీలో దాల్చినే అని, తెలుగులో లవంగపట్ట అని అంటారు. దాల్చిన చెక్క తియ్యగా ఘూటుగా ఉండి పరిమళాలను వెదజల్లుతుంది. ఇది శాఖాహారులకు మరియు మాంసాహారులకు కూడా ఇష్టమైనది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: త్వక్
- హిందీ పేరు: దాల్చినే
- తెలుగు పేరు: లవంగపట్ట (దాల్చినచెక్క)
- లాటిన్ పేరు: సిన్నమోమమ్ జిలానికంబ్లామ్
- కుటుంబము: Lauraceae
- ఆంగ్ల పేరు: Cinnamon
పోషక విలువలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- అగ్నిమాంద్యం మరియు అజీర్ణం: దాల్చిన చెక్క తెను 2.3 చుక్కలు మరియు పంచదార కలిపి రోజుకు మూడుసార్లు వాడిన యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపుబ్బరం, కడుపునొప్పి అగ్నిమాంద్యము మరియు అతిసారములను నివారిస్తుంది.
- జలుబు నివారణ: దీని తైలము 5-6 చుక్కలు మరియు తేనె కలిపి వాడిన జలుబు లక్షణాలు నివారించబడతాయి. యూకలిప్టస్ ఆయిల్ దాల్చిన తైలము కర్చీఫ్‌నందు వేసుకొని వాసన పీల్చిన జలుబు లక్షణాలు తగ్గుతాయి.
- అర్శమోలు మరియు అల్సర్లు: దాల్చిన తైలము మరియు ఆముదము తైలములను కలిపి అర్శమోలు పై రాసిన ఉపశమనము కలుగుతుంది. అల్సర్ తగ్గుముఖం పడుతుంది. పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. తేలు కాటు వలన జరిగే నొప్పి యందు ఉపశమనము కలుగుతుంది.
- ఆహార పదార్థాల నిలువ కొరకు: దాల్చిన తైలాన్ని ఆహారపదార్థముల నిల్వకొరకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌గా వాڈతున్నారు.
- అధిక రక్తస్రావం: దాల్చిన చెక్క చూర్ణమును బియ్యపుకడుగు నీటితో కలిపి సేవించిన అధిక రక్తస్రావం తగ్గుతుంది. కష్టరర్వము (Dysmenorrhea) తగ్గుతుంది.
- కడుపులో మంట - గుండెలో మంట: ఎసిడిటి పెరిగిన రోగుల్లో కడుపులో, గుండెలో మంట రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దాల్చిన చూర్ణము సేవించిన వీటి నుండి ఉపశమనము కలుగుతుంది.
- గొంతునొప్పి, గొంతుగరగర, జలుబు: దాల్చిన కొద్దిగాదంచి నలుగగొట్టి దానిని 1 గ్లాస్ నీళ్ళ యందు వేసి అందులో మిరియాలపొడిని కలిపి చక్కగా కాచి అరగ్లాస్ వచ్చిన తరువాత అందులో తేనె కలిపి త్రాగిన గొంతునొప్పి, గొంతుగరగర, జలుబు లక్షణాలు తొలుగుతాయి.
- నోటి దుర్వాసన మరియు పిప్పిపళ్ళు: భోజనం తరువాత దాల్చిన ముక్కను మెల్లగా నమిలి ఆ ఊటను మింగిన నోటి దుర్వాసన తొలుగుతుంది. పిప్పిపళ్ళురాకుండా నిరోధించబడుతాయి.
- శ్వాస - కాస (Asthma & Bronchitis): దాల్చిన పట్టి చూర్ణము (1- 1/2 గ్రాములు) ను తేనెతో కలిపి ప్రతిరోజు రాత్రి పూట సేవించిన టెన్షన్ తగ్గుతుంది. ఇది దగ్గు, ఆయాసము రోగులకు ఉపశమనమును కలిగిస్తుంది.
- ముఖము ముడతలు రాకుండా మరియు మొటిమలు నివారణకు: దాల్చినని మెత్తగా నూరి అందులో కలిపి కొద్దిగా నిమ్మరసం చుక్కలను వేసి దానిని ముఖమునకు రాసిన మొటిమలు నివారించబడుతాయి. చందనము, దాల్చినపట్ట లందు నిమ్మరసం యొక్క చుక్కలు కలిపి ముఖమునకు రాసిన ముడతలు లందు నివారించబడతాయి. ముఖం మృదువుగా తయారవుతుంది.
- జిగురు విరేచనాలు: దాల్చిన పట్ట చూర్ణము సేవించిన వాడిన జిగురు విరేచనాలు తగ్గిపోతాయి.
- ముఖం మీదవచ్చు మచ్చలు: ముఖం మీద వచ్చు మచ్చలకు దాల్చిన పట్టను మెత్తగా నూరి రాసిన మార్పు కనిపిస్తుంది.
- తలనొప్పి: మైగ్రేన్‌తో బాధపడు రోగులకు దాల్చిన మంచిదే. దీనిని ప్రతిరోజు 1/2 గ్రాము సేవించటం వలన ఉపశమనము లభిస్తుంది.
- గుండె జబ్బులు - లివర్జబ్బులు: దాల్చిని సేవించటం వలన గుండె లివర్ బలంగా తయారవుతాయి. కామెర్ల రోగులకు కూడా దాల్చిని మంచిదే.
- వాంతులు: దాల్చినపట్ట చూర్ణమును సేవించిన వాంతులు తగ్గుతాయి.
- శుక్రవృద్ధి: దాల్చిన చెక్క చూర్ణము 3-4 గ్రాములు ఆవుపాలతో కలిపి ప్రతిరోజుత్రాగిన శుక్రవృద్ధి అవుతుంది.
- గర్భాశయవ్యాధులు: గర్భాశయ వ్యాధులన్నింటిలో దాల్చిని వాడవచ్చు. దీనిని సేవించటం వలన గర్భాశయ దోషాలు నివారించబడతాయి.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 482-484)
- రచయిత: డా|| టి. భిక్షపతి
