తానికాయ / Belleric Myrobalan

From LTRC
తానికాయ / Belleric Myrobalan
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Myrtales
Family Combretaceae
Genus Terminalia
Scientific Name / Latin Name Terminalia bellirica

తానిదాయ (Terminalia bellirica) కొంబ్రెటేసి కుటుంబానికి చెందిన ఒక పెద్ద వృక్షము. ఇది సుమారు 20 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అరణ్యాలలో పెరుగుతుంది. తానికాల త్రిఫలాలలో ఒకటి. త్రిఫలాలు ప్రతి ఇంట్లో ఉండాలి. వీటిని అనేక వ్యాధులలో ఉపయోగిస్తారు. దీని ఫలాలు గుండ్రంగా మట్టిరంగులో ఉంటాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: విభీతక
  • హిందీ పేరు: బహేద
  • తెలుగు పేరు: తానికాల
  • లాటిన్ పేరు: టెర్మినాలియా బెలిరికా
  • కుటుంబము: Combretaceae
  • ఆంగ్ల పేరు: Belleric Myrobalan

పోషక విలువలు

తాజాగా లభ్యమయ్యే తానికాలలో:

  • తేమ: 6.1
  • టానిన్: 21.4

మరియు సిస్టోస్టిరాన్, గాలిక్ ఆసిడ్, చిబులిక్ ఆసిడ్, గ్లూకోజ్, మానిటోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్ మరియు రామోజ్ ఉండును. తానికాల ఆకులలో:

  • తేమ: 78.0%
  • ప్రొటీన్లు: 15.0-17.8
  • ఫైబర్: 7.40-10.13
  • స్టార్చ్: 12.70
  • మరియు మినరల్స్: 4.90-5.23% లు ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శ్వాస మరియు ఉదర సంబంధిత సమస్యలు: ఇది కఫపిత్తహరము, భేదనము చక్షుష్యము కేశ్యము మదకారి అను కర్మలను కలిగి ఉంది. దీనిని శ్వాసకాస క్రిమి తృష్టా చర్ధి మరియు అశ్మరీ లందు ఉపయోగించుదురు.
  • ఆకలి లేకపోవటం: తానికాల ఆకులతో తయారు చేసిన కషాయం త్రాగిన ఆకలి లేకపోవటను తొలగిస్తుంది.
  • దగ్గు మరియు ఆస్తా: తానికాల చూర్ణమును తేనెతో కలిపి తీసుకున్న ఇసినోఫిలియా దగ్గు, ఆస్తా, మొ॥ శమిస్తాయి.
  • మూత్ర మరియు అతిసార సమస్యలు: తానికాల బెరడును కషాయంగాకాచి త్రాగిన మూత్రం సాఫీగా అవుతుంది. తానికాలను కాల్చి భస్మం చేసి సైంధవలవణమును కలిపి తీసుకున్న అతిసారము తగ్గుతుంది.
  • జుట్టు మరియు చర్మ సంరక్షణ: తానికాల గింజల నుండి తీసిన తైలము జుట్టును ఎపుగా పెరుగునకు తోడ్పడుతుంది. తానికాల నుండి తీసిన తైలము ఆముదగుణములను కలిగి ఉంటుంది ఇది విరేచనాని కలిగించును. తానికాలను మెత్తగా అరగతీసి దానిని హెర్పిస్ జోస్టర్ రోగులకు విసర్జము రాసిన మంట పోటుతగ్గుతుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 476-477)
  • రచయిత: డా|| టి. భిక్షపతి