జొన్నలు / Sorghum
From LTRC
| జొన్నలు / Sorghum | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Liliopsida |
| Order | Poales |
| Family | Poaceae |
| Genus | Sorghum |
| Scientific Name / Latin Name | Sorghum bicolor |
జొన్నలు (Sorghum bicolor) గ్రామినేసి (Poaceae) కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన ఆహార ధాన్యపు పంట. జొన్నలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జొన్నలు మంచి బలమైన ఆహారం.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: యువనస, యవనల
- హిందీ పేరు: జవార్
- తెలుగు పేరు: జొన్నలు
- లాటిన్ పేరు: ఆండ్రోపోగాన్ సార్గమ్
- కుటుంబము: Gramineae (Poaceae)
- ఆంగ్ల పేరు: Sorghum
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల జొన్నలలో:
- కార్బోహైడేట్లు: 73 గ్రాములు
- ప్రొటీన్లు: 10.5 గ్రాములు
- క్రొవ్వు: 1.7 గ్రాములు
- కాల్షియం: 28 మి.గ్రా
- పాస్పరస్: 286 మి.గ్రా
- ఇనుము (ఇరన్): 6 మి.గ్రా
- సోడియం: 7 మి.గ్రా
- నియాసిన్: 1.7 మి.గ్రా
- పొటాషియం: 131 మి.గ్రా
- విటమిన్ - ఎ: 140 I.U
- విటమిన్ - బి1: 344 మై.గ్రా
- విటమిన్ - బి2: 363 మై.గ్రా
- ఇంకా అర్జినైన్, హిస్టిడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, సిస్టిన్, మిధియోనిన్, ఫినైలనిన్, త్రియోనిన్, ట్రిప్టోఫాన్, వాలిన్ మొదలగు అమైనో ఆసిడ్స్ కూడా ఇందులో కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- జీర్ణక్రియ మరియు మలబద్ధక నివారణ: జొన్నలలో బి.కాంప్లెక్స్, సెల్యులోజ్ మరియు ఫెటైల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మలమును చక్కగా జారీచేస్తాయి. జొన్నలతో చేసిన రొట్టెను మెత్తగా నమిలి తినాలి. లేనిచో మలబద్ధకము కలుగుతుంది. కఫపైత్యములను తొలగిస్తుంది.
- అర్ధ్ధ మొలలు మరియు విటమిన్ లోపాలు: చక్కగా చేసిన జొన్నపిండిని పాలతో కలిపి సేవించిన అర్ధ్ధ మొలల రోగులకు మరియు విటమిన్ బి1 మరియు విటమిన్ బి2 తో బాధపడు రోగులకు చాలా మంచిది.
- శరీర బలానికి: కష్టపడి పనిచేసే వారికి దేహ పరిశ్రమ చేసే వారికి ఇది చాలా మంచి ఆహారం.
- జాండిస్, మధుమేహం మరియు ఇతర సమస్యలు: జొన్నల యొక్క కాండము నుండి రసం తీసి ఉపయోగించిన జాండిస్, మధుమేహము, జలుబు మరియు కడుపునొప్పి మొదలగునవి ఉపశమిస్తాయి. శరీర బరువును పెంచుతాయి. విరిగిన ఎముకలు అతుకుటలో ఉపయోగకరం.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- జొన్నలతో చేసిన రొట్టెను మెత్తగా నమిలి తినాలి, లేనిచో మలబద్ధకము కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 461)
- రచయిత: డా|| టి. భిక్షపతి
