చిలకడ దుంప / Sweet Potato

From LTRC
చిలకడ దుంప / Sweet Potato
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Solanales
Family Convolvulaceae
Genus Ipomoea
Scientific Name / Latin Name ఐపోమియా బటాటాస్ లిన్నెయస్ లామార్క్ (Ipomoea batatas L.)

భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో దీనిని పండిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలో కందగడ్డ పేరుతో ప్రసిద్ధి దీనిని కాల్చి కొంతమంది ఇష్టంగా భుజిస్తారు. చక్కగా ఉడికించి తింటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది కఫాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ తింటే కడుపుబ్బరం మరియు మలబద్ధకం కలుగుతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: రకాలు
  • హిందీ: మీరా ఆలు / శకర్ కంద్
  • తెలుగు: చిలకడ దుంపలు / ఎర్రకందగడ్డ
  • ఇంగ్లీష్: స్వీట్ పొటాటో
  • లాటిన్: ఐపోమియా బటాటాస్ లిన్నెయస్ లామార్క్
  • కుటుంబము: Convolvulaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల చిలకడ దుంప యందు:

  • తేమ: 68.5
  • కేలరీలు: 120 గ్రాములు
  • ప్రొటీన్లు: 1.2
  • క్రొవ్వు: 0.3
  • కార్బోహైడ్రేట్: 31.0
  • కాల్షియం: 20 మి.గ్రా.
  • సోడియం: 9.0 మి.గ్రా.
  • భాస్వరస్: 50 మి.గ్రా.
  • డైమిన్: 0.08 మి.గ్రా.
  • పొటాషియం: 393 మి.గ్రా.
  • నికోటినిక్ ఆసిడ్: 0.7 మి.గ్రా.
  • రైబోఫ్లోవిన్: 0.4 మి.గ్రా.
  • విటమిన్ - ఎ: 10 అం.యూనిట్స్
  • విటమిన్ - సి: 24 మి.గ్రా.
  • నియాసిన్: 0.4 మి.గ్రా.లు
  • క్లోరిన్: 85 మి.గ్రా.
  • సల్ఫర్: 26
  • ఇరన్: 0.8
  • అయోడిన్: 4.5 తోపాటు మాంగనీస్, కాపర్, జింకులు కూడా కలవు. దీనిలో సుక్రోజ్, రెడ్యూసింగ్ షుగర్స్, మాల్టోజ్, మానిజ్, గ్యాలక్టోజ్ మరియు పెంటోజ్లు కొద్ది మోతాదులో ఉన్నాయి. ఇందులో పెెక్టిన్ కూడా ఉంది. ఇంకా అనేక రకమైన ఎంజైములు కూడా ఇందులో ఉండటం విశేషము.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • ఆకలి & రక్తవృద్ధి: చిలకడ దుంప ఆకలిని తగ్గిస్తుంది, రక్తమును వృద్ధి చేస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు శాతం ఎక్కువ.
  • జాగ్రత్త: మధుమేహ రోగులు మరియు గుండె జబ్బుల రోగులు అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
  • తేలు కుట్టిన చోట: చిలకడ దుంప ఆకురసమును తేలు కుట్టిన చోట రాసిన మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 438-439)
  • రచయిత: డా|| టి. భిక్షపతి