చందనము / Sandalwood

From LTRC
చందనము / Sandalwood
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Santalales
Family సాంఠలేసి (Santalaceae)
Genus Santalum
Scientific Name / Latin Name సాంటాలా అల్బమ్ లిన్నెయస్ (Santalum album L.)

ఇది సుగంధము మరియు శీతలమగుటచే జనులకు ఆనందమునిస్తుంది కాబట్టి చందన మంటారు. ఇది సుమారు 8 మీటర్లు వరకు పెరిగే నిత్య హరిత వృక్షము. ఇది కర్ణాటక, ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలలో పెంచబడుతుంది. చందనము తిక్త మధుర రసము, లఘురూక్ష గుణము శీత వీర్యము మరియు కటువిపాకములను కలిగి ఉంది. ఇది కఫపిత్తశాముకము, దాహమును శమింపచేస్తుంది. వర్ణ్యమును కలిగిస్తుంది. దీనిని దాహము, తృృష్ణా, జ్వరము, శోష, రక్తపిత్తము ప్రమేహము రక్తార్షస్సు రక్తతిసారము మరియు రక్త ప్రదరము మొదலగు వ్యాధులందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: చందన
  • హిందీ: సఫేద్ చందన్
  • తెలుగు: మంచి గంధపు చెట్టు
  • లాటిన్: సాంటాలా అల్బమ్ లిన్నెయస్
  • కుటుంబము: సాంఠలేసి

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల ప్రత్యేక పట్టిక వివరాలు పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • పూజా మరియు స్థానిక ఉపయోగాలు: చందనాన్ని నిత్యం పూజలలో ఉపయోగిస్తారు. దీని గంధము తీసి భృకుటి మధ్యన పెడుతుంటారు. పెళ్ళి పేరంటాలలో, శుభకార్యాలలో చందనము మరియు పసుపు కలిపి పారాణీ రాయటం చూస్తుంటారు. ఇది చలువ చేస్తుంది. మంటను తగ్గిస్తుంది. దుష్ట రక్తాన్ని తొలగిస్తుంది. కళ్ళకు చాలా మంచిది.
  • కడుపులో మంట & మూత్రంలో మంట: చందనాన్ని పాలతో కలిపితే కడుపులో మంట తగ్గుతుంది. నీళ్ళలో కలిపి త్రాగితే మూత్రంలో మంట తగ్గుతుంది.
  • మూత్రం జారీచేయు గుణము: చందనం, పట్టి వేళ్ళు, సుగంధి పాలను కలిపి షర్బత్ చేసుకొని త్రాగితే మూత్రం చక్కగా జారీ అవుతుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. తృప్తి కలుగజేస్తుంది. దురద, నీటి పొక్కులు తగ్గుతాయి. ఇది హర్పిస్ జోస్టర్ వ్యాధిలో ఎంతొ ఉపయుక్తము.
  • దాహము, పొక్కులు: చందనాన్ని నీళ్ళలో కలిపి త్రాగిన తాప జ్వరము, దాహము, పొక్కులు, దురదలు తగ్గుతాయి.
  • వేసవి తాపానికి: చందనాన్ని చక్కగా గంధముతీసి ఒంటికి రాస్తే చల్లగా హాయిగా మనోహరంగా ఉంటుంది. చందనం, రసకర్పూరము కలిపి రాసిన పొక్కులు గడ్డలు అణగిపోతాయి.
  • తలనొప్పి: తలనొప్పి, మంటతో బాధపడే రోగులు చందనాన్ని గంధము తీసి నుదుటి పైన రాసిన తలనొప్పి మంట తగ్గుతుంది.
  • గనేరియా: గంధము నుండి తీసిన తైలము రాసిన గనేరియా వ్యాధి గ్రస్తులకు మంచిది. మంట తగ్గుతుంది. వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. చందనానికి బ్యాక్టీరియాలను నిరోధించే గుణముందని పరిశోధనలో గమనించారు.
  • శీతపిత్తము (దద్దుర్లు): చందనమును తిప్పతీగ రసముతో నూరి ముద్దగా చేసుకొని దానిని 3-5 గ్రాములు రెండు పూటలు సేవించిన దద్దుర్లు తగ్గుతాయి.
  • రక్త ప్రదరము: చందనమును చూర్ణము చేసి పంచదారతో సేవించిన రక్త ప్రదరము తగ్గుతుంది.
  • రక్తమొలులు: చందనము నందు శుంతి కలిపి సేవించిన రక్తమొలుల యందు వచ్చు రక్త స్రావము తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 450-451)
  • రచయిత: డా|| టి. భిక్షపతి