గోంగూర / Roselle / Kenaf
From LTRC
| గోంగూర / Roselle / Kenaf | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Malvales |
| Family | Malvaceae |
| Genus | Hibiscus |
| Scientific Name / Latin Name | హిబిస్కస్ సబ్దారిఫా లిన్నెయిస్ (Hibiscus sabdariffa L.) |
పుల్లగా రుచిగా ఉండే ఈ ఆకుకూరను ఆంధ్రులు చాలా ఇష్టంగా తింటారు. తెలుగువారు గోంగూర పచ్చడిని చాలా ఇష్టపడతారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: పీలు, అమ్మ్యీలు
- హిందీ: లాల్ అంబారి
- తెలుగు: గోంగూర / ఎజ్జి గోంగూర
- లాటిన్: హిబిస్కస్ సబ్దారిఫా లిన్నెయిస్
- కుటుంబము: Malvaceae
పోషక విలువలు
- గోంగూర లేత ఆకులు మరియు స్టాక్స్ (100 గ్రాములలో):
- తేమ: 86.2 గ్రా
- ప్రొటీన్లు: 1.7 గ్రా
- క్రొవ్వు (Fat): 1.1 గ్రా
- కార్బోహైడ్రేట్: 10.0 గ్రా
- మినరల్మేటర్: 1.0 గ్రా
- కాల్షియం: 0.18 గ్రా
- పాస్పరస్: 0.04 గ్రా
- ఇనుము: 0.0054 %
- విటమిన్ - ఎ: 2,900 I.U
- థైమిన్: 0.02 మి.గ్రా
- రైబోఫ్లోవిన్: 0.39 మి.గ్రా
- నియాసిన్: 1.1 మి.గ్రా
- విటమిన్ - సి: 20 మి.గ్రాములు
- గోంగూర ఆకులలో మాలిక్ ఆసిడ్ 1.25% మరియు కాండమునందు 0.6% ఉండును.
- గోంగూర పెటల్స్ నందు సిట్రిక్ ఆసిడ్ 3.74% మరియు పెక్టిన్ 3.19% లో ఉండును. దీనిని ఎక్కువగా జెల్లీల యందు చెట్టీల యందు మరియు కూరల్ని నిలువ ఉంచు పిసర్వేటివ్‌గా వాడుతారు.
- గోంగూరఫలము నందు తేమ 76.4, సుగర్ 2.28, పెక్టిన్ 1.02, రెడ్యూజింగ్ సుగర్ 1.05, సిట్రిక్ ఆసిడ్ 1.03% ఉంటాయి. దీనిని కూడా జెల్లీలో ఉపయోగిస్తారు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- గోంగూరకు వేడిచేసే గుణముంది. రక్తమొలుల రోగులకు ఇది మంచిది కాదు.
- చర్మవ్యాధులు మరియు ఉబ్బసం దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడువారికి కూడా మంచిది కాదు.
- గోంగూర చూపునువృద్ధి పరుస్తుంది. గోంగూర వేప కలిపి సేవించిన వాపులు మేహ ప్రణాలు తగ్గుతాయి.
- వాపులు మరియు గడ్డలు: గోంగూర ఆకులకు ఆముదము రాసి కొద్దిగా వేడి చేసి రాసిన అందవృద్ధి (Scrotal swelling) యొక్క వాపు తగ్గుతుంది. శరీరం మీద ఎక్కడైనా గడ్డలు వచ్చి ఇబ్బంది పెడుతున్నా గోంగూరను ఉడికించి ఆ గడ్డలపై కదితే అవి మెత్తబడి తొందరగా పగిలిపోతాయి.
- గోంగూర ఆకులను మరియు పువ్వులను పప్పులో వేసి తిన్నగాని లేక మాంసములో వేసి తిన్న చాలా రుచిగా ఉంటుంది. గోంగూర లివర్‌కు బలాన్ని చేకూర్చుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. రేచీకటిని దూరం చేస్తుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 428-429)
- రచయిత: డా|| టి. భిక్షపతి
