గుమ్మడికాయ / Pumpkin

From LTRC
గుమ్మడికాయ / Pumpkin
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Cucurbita
Scientific Name / Latin Name కుకుబీటా మాక్సిమా (Cucurbita maxima)

గుమ్మడిని ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా పెంచుతారు. కొందరికి గుమ్మడికాయ కూరంటే ఆ రోజుంతా పండగే! గుమ్మడి లోపలి భాగము ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. గుమ్మడి ఆహారంగా, ఔషధంగా ఎంతో ప్రసిద్ధి. గుమ్మడి కాయ మధురంగా ఉంటుంది. రుచిని పుట్టిస్తుంది. దేహపుష్టిని, బలము, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఎక్కువగా తింటే వాతము చేస్తుంది. తొందరగా జీర్ణము కాదు.

గుమ్మడి లేత ఆకుల చివర్లను కూడా కూరగా వండుకు తింటారు. ఇది వాతము, జ్వరము వాపులు మొదలగు వానిని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. గుమ్మడి పువ్వులను కూడా కూరచేసుకొని తింటారు. ఇది పైత్యాన్ని తగ్గిస్తుంది. గుమ్మడి గింజల యందు ప్రొటీన్లు మరియు క్రొవ్వు చాలాఎక్కువ. వీటిని కూడా తింటారు. ఇవి తొందరగానే జీర్ణమౌతాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: కూష్మాండ
  • హిందీ: కుమ్రు
  • ఉర్దూ: మిరాకద్దు
  • తెలుగు: గుమ్మడికాయ
  • లాటిన్: కుకుబీటా మాక్సిమా
  • కుటుంబము: Cucurbitaceae

పోషక విలువలు

  • ప్రతి 100 గ్రాముల గుమ్మడి కాయలో ఎన్నో పోషక విలువలు ముఖ్యంగా ఉన్నాయి:
  • ప్రొటీన్లు: 14 గ్రాములు
  • క్రొవ్వు: 0.4 గ్రాములు
  • ఫైబర్: 0.7 గ్రాములు
  • ఖనిజలవణాలు: 1.4 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 5.3 గ్రాములు
  • ఐరన్: 1 మి.గ్రా
  • పొటాషియం: 259 మి.గ్రా
  • సోడియం: 2 మి.గ్రా
  • కాల్షియం: 10 మి.గ్రా
  • పాస్పరస్: 30 మి.గ్రా
  • మెగ్నీషియం, కాఫర్: 0.20 మి.గ్రా
  • క్లోరిన్: 4 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.5 మి.గ్రా
  • సల్ఫర్: 18 మి.గ్రాములు
  • విటమిన్ - ఎ: 84 I.U
  • విటమిన్ - బి1: 61 మైక్రోగ్రాములు
  • విటమిన్ - బి2: 44 మై.గ్రా
  • విటమిన్ - సి: 4 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • రక్తస్రావం & ప్రోస్టేట్ సమస్యలు: గుమ్మడి గింజలను నీళ్ళుపోసి మెత్తగా రుబ్బి రసం తీసి అందులో నిమ్మరసం మరియు తేనె కలిపి వాడిన యెడల నోటి నుండి రక్తముపడుట, రక్తమొలులు మరియు ప్రొస్టేట్ గ్లాండ్ పెరిగిన రోగులకు చాలా మంచిది.
  • రింగ్ వార్మ్ మరియు గజ్జి: దీని ఆకుల రసాన్ని రాసిన గజ్జి మరియు రింగ్ వర్మ్ రోగులకు హితంగా ఉంటుంది.
  • గడ్డలు: దీని ఆకుల రసాన్ని రాసిన గడ్డలు మెత్తబడి పగిలి పోతాయి.
  • కాళ్ళు చేతుల మంటలు: గుమ్మడి గుజ్జు తీసి కాళ్ళకు రాస్తే మంట తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 419-420)
  • రచయిత: డా|| టి. భిక్షపతి