గసగసాలు / Poppy Seeds

From LTRC
గసగసాలు / Poppy Seeds
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Ranunculales
Family Papaveraceae
Genus Papaver
Scientific Name / Latin Name పెపావర్ సోమ్ని ఫెరమ్ లిన్నెయిస్ (Papaver somniferum L.)

ఇది సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక క్షુપము. దీనిని నల్లమందు అని పిలుస్తారు. (నల్లమందు) అహిఫేనము గింజలనే గసగసాలు లేక సుబీజము ఖసభిసలని కూడా అదురు. అహిఫేనము నుండి అనేక రకాల బాధ నివారణ మరియు మత్తును కలిగించు ఆల్కలాయిడ్స్ వేరు చేయబడినవి. అవి మార్ఫిన్, కొడైన్ నాస్కోఫైన్, పాపావరిన్ కొడైన్ అపోమార్ఫిన్ అనునవి. ఇది తిక్త కషాయరసము, లఘు రూక్ష సూక్ష్మ వ్యవాయి వికాసి గుణము వీర్య ఉష్ణ వీర్యము మరియు కటువిపాకము కలిగి ఉంది.

ఇది కఫహరము, వాతపిత్తకరము, గ్రాహి, శుక్రస్తంభక కర్మలను కలిగి ఉంది. గసగసాలను మసాలా దినుసులుగా ఆహారములో ఉపయోగిస్తారు. దీని లభించే 50% తైలమును ఆహారంగా వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: సుబీజము
  • తెలుగు: గసగసాలు
  • లాటిన్: పెపావర్ సోమ్ని ఫెరమ్ లిన్నెయిస్
  • కుటుంబము: Papaveraceae

పోషక విలువలు

  • 100 గ్రాముల గసగసాలలో:
  • తేమ: 4.3 - 5.3
  • ప్రొటీన్లు: 22.3 - 24.3
  • ఫైబర్: 4.8 - 5.8
  • బూడిద: 5.6 - 6.0
  • కాల్షియం: 1.03 - 1.45
  • పాస్పరస్: 0.79 - 0.89
  • ఇనుము: 8.5 - 11.1 మి.ల్లీ గ్రాములు
  • తైమిన్: 740 - 1181
  • రైబోఫ్లోవిన్: 756 - 0.1203
  • నికోటినిక్ ఆసిడ్: 800 - 1280 మైక్రో గ్రాములు
  • అయోడిన్: 6 మైక్రో గ్రాములు
  • మాంగనీసు: 29 మి.గ్రా
  • కాఫర్: 22.9 మి.గ్రా
  • మెగ్నీషియం: 29 మి.గ్రా
  • సోడియం: 0.39 మి.గ్రా
  • పొటాషియం: 5.25
  • జింక్: 1.30 మి.గ్రా లు
  • అమైనో ఆసిడ్స్ అయిన అర్జినిక్, హిస్టిడిన్, లైసిన్, టైరోసిన్, ట్రిప్టోపాన్, ఫినైలాలానిన్, క్రిస్టిన్, మిధియోనిన్లు కూడా ఇందులో లభిస్తాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • ధาตุపుష్టి: గసగసాలను వేడిచేసి తేనేతో సేవించిన ధาตุపుష్టి కలుగును. ఎక్కువగా తిన్న యెడల మలబద్ధకము కలుగుతుంది.
  • చలువచేయు గుణము: గసగసాలు గింజలు చలువ చేస్తాయి.
  • విరేచనాలు: నల్లమందు 125 మి.గ్రాలను మేక పాలతో కలిపి ఇచ్చిన అనేక మందులతో తగ్ಗದి విరేచనాలు తగ్గిపోతాయి. అయితే మలబద్ధకము ఏర్పడుతుంది. నల్లమందు మరియు ఖర్జూర పండుతో కలిపి 125 మి.గ్రా చొప్పున సేవించిన రక్త విరేచనాలు తగ్గుతాయి.
  • వీర్యస్తంభనము: నల్ల మందు అక్లకక్ర, జాజికాయలు, జాపత్రి, ఏలకులు, లవంగాలు, కుంకుమపువ్వు, కస్తూరిమసులను ఖల్వం నందు చేసి తమలపాకు రసముతో బాగా మర్దించి 125 మి.గ్రా చొప్పున మాత్రలు చేసుకొని సేవించిన వీర్యస్తంభనము కలుగుతుంది. బలము, శరీరవర్ణము, అగ్నిదీప్తి కలుగుతుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • అతినిద్ర: దీనిని అధిక మోతాదుల్లో సేవించిన అతి నిద్ర కలుగుతుంది.
  • గసగసాలు అతిగా సేవిస్తే తల త్రిప్పటం, తలబరువు, కడుపుబ్బరము, అంగములు శిథిలత్వము నొందుటతో పాటు అనేక ఇబ్బందులు కలుగుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 420-422)
  • రచయిత: డా|| టి. భిక్షపతి