ఖర్జూరము / Wild Date Palm

From LTRC
ఖర్జూరము / Wild Date Palm
Kingdom Plantae
Division Magnoliophyta
Class Liliopsida (Monocotyledons)
Order Arecales
Family Arecaceae
Genus Phoenix
Scientific Name / Latin Name ఫీనిక్స్ సిల్వెస్టిస్ రాక్స్ బర్గ్ (Phoenix sylvestris (L.) Roxb.)

ఉష్ణమండల దేశాల్లో, బంజు భూముల్లో ఎక్కువగా లభిస్తుంది. అరేబియా దేశాలలో అతి ముఖ్యమైన బలమైన ఆహారం ఖర్జూరము. ఖర్జూరము మనకు ప్రకృతి ప్రసాదించిన బలమైన ఆహారం. దీనిని తినటం వలన అనేక రకాల విటమిన్లు మనకు లభ్యమవుతాయి. ఖర్జూరము మధురరసము శీత వీర్యము స్నిగ్ధ గురుగుణము మధుర విపాకములను కలిగి ఉంది. ఇది వాత పిత్ర శామకము, బల్యము బృంహణము వృష్యము. దీనిని ముఖ్యంగా క్షయ, రక్తపిత్తము చర్ధి, జ్వరము, శ్వాస, కాస (దగ్గు), మరియు అతిసారములందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: ఖర్జూర
  • హిందీ: ఖర్జూర
  • తెలుగు: ఖర్జూరము
  • లాటిన్: ఫీనిక్స్ సిల్వెస్టిస్ రాక్స్ బర్గ్
  • కుటుంబము: Arecaceae

పోషక విలువలు

  • ప్రతి 100 గ్రాముల ఖర్జూరములో:
  • కార్బోహైడ్రేట్లు: 75.8 గ్రా
  • ప్రొటీన్లు: 2.8 గ్రాములు
  • క్రొవ్వు: 0.3 గ్రా
  • కాల్షియం: 6.5 మి.గ్రా
  • పాస్పరస్: 75 మి.గ్రా
  • ఐరన్: 10 మి.గ్రా
  • మెగ్నీషియం: 58.5 మి.గ్రా
  • క్లోరిన్: 290 మి.గ్రా
  • కాఫర్: 0.21 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 670 I.U
  • విటమిన్ - బి2: 125 మైక్రోగ్రాములు
  • తైమిన్: 0.011 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 0.9 మి.గ్రా
  • ప్యాంటోథెనిక్ ఆసిడ్: 3 మి.గ్రా
  • ఇందులో చక్కర 85 % తో పాటు సుక్రోస్ట్రోజ్, అరబినోజ్, గాలిక్ట్ మొదలగునవి కూడా ఖర్జూరములో ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీర ఎడుగుదలకు & లైంగిక శక్తి పెంపొందుటకు: 10-15 ఖర్జూరములను ఆవుపాలలో నానవేసి ఒక రాత్రంతా ఉంచి ఉదయమే పాలను తీసివేసి కొద్దిగా ఆవుపాలలో నానవేసి ఇలాచి మరియు తేనే కలిపి తినిన విటమిన్ లోపం తొలగుతుంది. ఇది సంభోగశక్తిని పెంచుతుంది. ఇది శరీర ఎదుగుదలకు కూడ తోడ్పడుతుంది. గల్ఫ్ దేశస్థులు ఎక్కువగా ఖర్జూరములు, తేనే మరియు గోధుమరొట్టెలు కలిపి ఆహారంగా స్వీకరిస్తారు. ఈ ఆహారం శక్తినిస్తుంది. రక్తాన్ని పెంచుతుంది. ఉత్సాహాన్ని ఇనుమడింపచేస్తుంది.
  • మధుమేహం రాకుండా ఉండాలంటే: కరివేపాకు ఆకులు మరియు ఖర్జూరములు కలిపి వాడితే మధుమేహం నిరోధించబడుతుందని అనుభవజ్ఞుల అభిప్రాయము.
  • టి.వి, బలహీనత: ఈ జబ్బులతో బాధపడు రోగులు ఖర్జూరము తిన్న యెడల తొందరగా స్వస్థత చేకూరుతుంది.
  • వడదెబ్బ - అతిసారము: వడదెబ్బ బారి నుండి తప్పించుకోవాలంటే ఖర్జూరములను నీటిలో నానవేసి ఆ నీటిని త్రాగిన వడదెబ్బ బారి నుండి రక్షణ పొందవచ్చు. నీళ్ళు విరేచనాలతో బాధపడు రోగులకు ఖర్జూరము నీళ్ళు ఎంతో ఉపయోగకరము.
  • ఇతర గుణాలు: ఖర్జూరము తిన్న యెడల ఒళ్ళు మంటలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. సయాటికా రోగులకు మూర్ఛ రోగులకు మంచిది. ఆస్తమా మరియు దగ్గుతో చాలా కాలము తైమద బయటకు రాకుండా బాధపడు రోగులు ఖర్జూరము తిన్న యెడల కఫం తెగి బయటకు వస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 411-412)
  • రచయిత: డా|| టి. భిక్షపతి