క్యారెట్ / Carrot

From LTRC
క్యారెట్ / Carrot
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Apiales
Family Apiaceae (Umbelliferae)
Genus Daucus
Scientific Name Daucus carota L.

భారతదేశమంతటా పండించే పంట క్యారెట్. క్యారెట్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. పోషకవిలువలు కూడా తక్కువేమి కాదు. క్యారెట్ ఆకులను మనం ఉపయోగించకపోవడం చాలా దురదృష్టకరం. క్యారెట్ దుంపలోనే కాదు ఆకుల్లోకూడా ఎన్నో పోషక విలువలున్నాయి. కావున క్యారెట్ ఆకుల్ని పారవేయకుండా పచ్చా సూప్‌లాగా, చెట్నీలాగా, కూరలాగా, పులుసులాగా తప్పకుండా వాడండి.

ఇది మధుర తిక్తరసము, ఉష్ణవీర్యము, లఘుతీక్షణ గుణము మధురవిపాకము అనే గుణములను గర్భపాతకము, శోధ, రక్తపిత్తము, గ్రహణి, అర్షస్సు అతిసారములందు కూడా దీనిని వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: గాజర్ గడ్డ
  • సంస్కృతం: గర్జరమ్
  • హిందీ: గాజర్
  • లాటిన్: డాకస్ కరోట లిన్నెయస్ (Daucus carota)
  • కుటుంబము: Umbelliferae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల క్యారెట్‌నందు ఉండే పోషక విలువల వివరాలు:

  • కార్బోహైడ్రేట్లు: 10 గ్రా
  • ప్రోటీన్లు: 1 గ్రా
  • క్రొవ్వు: 0.7 గ్రాములు
  • కేలరీలు: 56 గ్రాములు
  • ఖనిజలవణాలు: 1.1 గ్రాములు
  • విటమిన్ - ఎ: 9500 I.U
  • విటమిన్ - బి2: 140 మై.గ్రా
  • విటమిన్ - సి: 90 మి.గ్రా
  • నియాసిన్: 0.4 మి.గ్రా
  • కాల్షియం: 340 మి.గ్రా
  • పాస్ఫరస్: 110 మి.గ్రా
  • ఐరన్: 8.8 మి.గ్రా
  • మెగ్నీషియం: 14 మి.గ్రా
  • సోడియం: 35.6 మి.గ్రా
  • ఫైబర్ (నార): 1.2 గ్రాములు
  • నికోటినిక్ యాసిడ్: 0.6 మి.గ్రా
  • ఆక్సాలిక్ యాసిడ్: 5 మి.గ్రా
  • పొటాషియం: 108 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • విటమిన్ల లోపమునకు: క్యారెట్ జ్యూస్ త్రాగటం వలన విటమిన్ల లోపం తొలుగుతుంది. క్యారెట్ ఆకుల రసము కొద్దిగా నిమ్మరసం, మరియు చిటికెడు ఉప్పు కలిపి త్రాగిన విటమిన్ లోపం తగ్గుతుంది. గుండెకు, ఊపిరితిత్తులకు, లివర్‌కు బలాన్ని ఇస్తుంది.
  • మలబద్ధకం, మూత్రం సాఫీగా రావటానికి: పచ్చి క్యారెట్ తినడం వలన విరేచనం మరియు మూత్రం సాఫీగా అవుతుంది.
  • కాళ్ళు, చేతుల మంటలు: క్యారెట్ ఆకుల రసమును త్రాగటం వలన కాళ్ళు, చేతుల మంటలు తగ్గుతాయి. క్యారెట్ కఫవాతహరము. క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినటం వలన తృప్తి కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 393, 394)
  • రచయిత: డా|| టి. భిక్షపతి