క్యాబేజి / Cabbage
From LTRC
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Magnoliopsida |
| Order | Brassicales |
| Family | Brassicaceae (Cruciferae) |
| Genus | Brassica |
| Scientific Name | Brassica oleracea var. capitata L. |
ప్రతిచోట సాగుచేసేది కాబేజి. కాబేజి నందు దాదాపు 9-10 రకాలు ఉన్నాయి. అయితే విలువలు దాదాపు అన్నింటిలోను సమంగానే ఉన్నాయి. క్యాబేజిని కూరగా, పులుసుగా వండుకుంటారు.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: క్యాబేజి
- హిందీ: బంద్‌గోబి
- లాటిన్: బ్రాసికా ఒలరేసియా క్యాపిటా
- కుటుంబము: Cruciferae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల క్యాబేజి నందు ఉండే పోషక విలువల వివరాలు:
- ప్రోటీన్లు: 2 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు: 5 గ్రాములు
- క్రొవ్వు: 0.3 గ్రాములు
- ఫైబర్ (నార): 1.2 గ్రాములు
- ఖనిజ లవణములు: 1.9 గ్రాములు
- కేలరీలు: 30 గ్రాములు
- కాల్షియం: 33 మి.గ్రా
- పాస్ఫరస్: 47 మి.గ్రా
- ఐరన్: 0.7 మి.గ్రా
- సోడియం: 53 మి.గ్రా
- పొటాషియం: 113 మి.గ్రా
- మెగ్నీషియం: 20 మి.గ్రా
- ఆక్సాలిక్ యాసిడ్: 19 మి.గ్రా
- విటమిన్ - ఎ: 2000 I.U
- విటమిన్ - బి1: 100 మైక్రో.గ్రా
- విటమిన్ - బి2: 31 మైక్రో.గ్రా
- విటమిన్ - సి: 120 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- స్తన్యవృద్ధి కోసం: క్యాబేజి తినటం వలన మాతృస్తన్యము వృద్ధి అవుతుంది.
- గడ్డలు: క్యాబేజిని ఆముదములో వేయించి పట్టువేస్తే గడ్డలు మెత్తబడతాయి.
- శుక్రవర్ధకం: క్యాబేజిని తినడం వలన శుక్రం వృద్ధి అవుతుంది.
- అల్సర్లు: క్యాబేజికి అల్సర్లను తగ్గించే గుణముంది.
- పిల్లల ఎదుగుదలకు: చిన్నపిల్లలకు, పెరిగే పిల్లలకు క్యాబేజి చాలామంచిది. ఇది ఎదుగుదలకు సహకరిస్తుంది.
- సిర్రోసిస్ లివర్, కామెర్లు, రక్తమొలల రోగులకు: క్యాబేజి జ్యూస్ (రసం) 2 స్పూన్లు, తేనె 2 చెంచాలు సేవించడం వలన కామెర్ల రోగులకు, రక్తమొలల రోగులకు, లివర్ పెరిగిన రోగులకు, అల్సర్ రోగులకు చాలా మంచిది.
- కిడ్నీ వ్యాధులు మరియు స్టోన్స్: మూత్రంలో రాళ్ళు మరియు కిడ్నీవ్యాధుల రోగులు క్యాబేజిని తినకూడదు. డాక్టర్ల సలహా పాటించాలి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 391, 392)
- రచయిత: డా|| టి. భిక్షపతి
