కొబ్బరి చెట్టు / Coconut Tree

From LTRC
కొబ్బరి చెట్టు / Coconut Tree
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Arecales
Family Arecaceae
Genus Cocos
Scientific Name Cocos nucifera L.

కొబ్బరి ఆరోగ్యానికి, శక్తికి, బలానికి, శాంతికి, తృప్తికి మూలమైనది. కొబ్బరి చెట్టు ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచబడుతుంది. కొబ్బరి ఉపయోగాలు అనేకములు. కొబ్బరి మట్టలు, కొబ్బరి కాండము, కొబ్బరి పీచు, కొబ్బరికాయలు, పుష్పము మరియు తైలములు అన్ని మన అవసరాలను తీర్చును. అందుకే ఇది మన జాతీయ సంపద. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

కొబ్బరి మధురరసము, శీతవీర్యము, గురుస్నిగ్ధ గుణము, మధురవిపాకము అనే గుణములను వాతపిత్తహరము, బృంహణము, బల్యము, హృద్యము మరియు వస్తి శోధన కర్మలు కలిగి ఉంది. దీనిని జ్వరము, దప్పిక, శూల, రక్తాతిసారములందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: కొబ్బరిచెట్టు
  • సంస్కృతం: నారికేల
  • హిందీ: నారియల్
  • లాటిన్: కోకస్ న్యూసిఫెరా లిన్నెయస్ (Cocos nucifera)
  • కుటుంబము: Arecaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కొబ్బరి ఫలంలో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 36.3
  • ప్రోటీన్లు: 4.5 గ్రాములు
  • క్రొవ్వు: 41.6 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 13.6 గ్రాములు
  • నార (ఫైబర్): 3.6 మి.గ్రా
  • మినరల్ మేటర్: 1.0
  • కాల్షియం: 11
  • పాస్ఫరస్: 240 మి.గ్రా
  • ఐరన్: 2 మి.గ్రా
  • విటమిన్ - సి: 17 మి.గ్రా
  • నియాసిన్: 0.8 మి.గ్రా
  • విటమిన్ - బి2: 45 మై.గ్రా
  • కాఫర్: 0.32 మి.గ్రా
  • క్లోరిన్: 114 మి.గ్రా
  • మెగ్నీషియం: 52 మి.గ్రా
  • సోడియమ్: 17 మి.గ్రా
  • పొటాషియం: 426 మి.గ్రా

ఇంకా ఇందులో అమైనో యాసిడ్స్, ఆర్జినిన్, ఐసోల్యూసిన్ లైసిన్, మిథియోనిన్, థ్రియోనిన్, వ్యాలిన్, హిస్టిడిన్, ల్యూసిన్, సిస్టిన్, ఫినైలలనిన్ మరియు ట్రిప్టోఫాన్ మొదలగునవి కూడా కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ ఉపయోగాలు: పచ్చికొబ్బరి మధుమేహ రోగులకు మంచి ఆహారం. ప్రోటీన్లు లోపం వలన బాధపడు పిల్లలకు కొబ్బరి బలమైన ఆహారం. కొబ్బరి నీళ్ళు తృప్తిని ఇస్తాయి. దాహాన్ని తీరుస్తాయి. వృద్ధులకు మంచి supplement.
  • పళ్ళు దృఢంగా ఉండాలంటే: కొబ్బరి మరియు బెల్లం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేయటం వలన పళ్ళు గట్టిపడతాయి.
  • గుండెజబ్బులు, ఎసిడిటీ, గర్భిణీ స్త్రీలు: కొబ్బరి నీళ్ళు వాడటం ఎంతో మంచిది. ఇందులో పొటాషియం, క్లోరిన్ ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. కొబ్బరినీళ్ళు త్రాగటం వలన ఎసిడిటీ యొక్క తీవ్రత తగ్గుతుంది. మూత్రం సాఫీగా అవుతుంది.
  • డీ హైడ్రేషన్: కొబ్బరినీళ్ళు మరియు నిమ్మకాయ నీళ్ళు చిటికెడు ఉప్పు కలిపి త్రాగితే డీ హైడ్రేషన్ తగ్గుతుంది.
  • పిల్లల ఎదుగుదలకు: పచ్చికొబ్బరి మరియు పండిన అరటిపండు కలిపి ప్రతిరోజు పిల్లలకు తినిపించిన చక్కని ఆరోగ్యము వారి సొంతమౌతుంది.
  • దప్పిక: కొబ్బరి దప్పికను తీరుస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. వేడిని తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. కొబ్బరిని అర్షావభేదకములో, శిరోవ్యాధులు మూత్రకృచ్ఛము నందు కూడా ఉపయోగిస్తారు.
  • క్షయవ్యాధి: పచ్చికొబ్బరి నుండి నూనె తీసి దానిని సేవించిన క్షయవ్యాధి రోగులకు మంచి బలము కలుగుతుంది.
  • దంతరోగాలు: కొబ్బరి నూనెను నోటిలోకి తీసుకొని గండూషం (పుక్కిలిస్తే) దంతరోగాలు తగ్గుతాయి. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది.
  • శరీర మృదుత్వానికి: కొబ్బరి నూనె రాసుకున్న శరీరానికి మృదుత్వము బలము చేకూరుతుంది. కొబ్బరినూనె తలకు రాసుకున్న జుట్టు నల్లగా మెత్తబడుతుంది. కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకలు తొందరగా ఊడిపోవు.
  • కొబ్బరి నీళ్ళ వివిధ ఉపయోగాలు: కొబ్బరి నీళ్ళు టైఫాయిడ్, అల్సరేటివ్‌కోలైటీస్, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్, మీజిల్స్, రక్తవిరేచనాలు, అతిసారము, డిఫ్తీరియా, న్యుమోనియా, బ్రాంకైటీస్, నెఫ్రైటీస్, టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ మరియు అర్షమొలల రోగులకు, బలహీనులకు, వృద్ధులకు అందరికి నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. దీనిద్వారా తొందరగా శక్తిని ఉత్సాహాన్ని పుంజుకుంటారు. వేసవిలో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ త్రాగే బదులు కొబ్బరి నీళ్ళు త్రాగితే ఎంతో మంచిది. కోక్ కంటే కోకోకోలా కంటే కొబ్బరినీళ్ళు త్రాగటం శ్రేష్టం. అన్ని రకాల తలనొప్పులందు కొబ్బరినీరు ఉపయుక్తము.
  • శక్తిదాయకం: కొబ్బరి నీళ్ళు త్రాగిన శ్రీ సంభోగం వలన అలసిపోయిన వారికి శక్తివస్తుంది. బాగా లెక్చర్లు దంచేవాళ్ళకు అధికంగా ఉపవాసముండే వాళ్ళకు కొబ్బరి నీళ్ళు శక్తినిస్తాయి.
  • కొబ్బరి పువ్వు: కొబ్బరి పువ్వు మధురంగా రుచిగా ఉంటుంది. చలువ చేస్తుంది.
  • కొబ్బరి కురిడి: దీనిలో చమురు ఎక్కువగా ఉంటుంది. ఇది పొత్తికడుపును శుభ్రపరుస్తుంది. వాతమును పోగొట్టును. దేహపుష్టినిస్తుంది. నోటిపూతను పోగొడుతుంది.
  • కొబ్బరి పాలు: వీర్యపుష్టిని కలుగజేస్తాయి. అలసట పోగొట్టి కొబ్బరి బలమునకు తోడ్పడుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 394, 395, 396, 397)
  • రచయిత: డా|| టి. భిక్షపతి