కామంచి / Black Nightshade

From LTRC
కామంచి / Black Nightshade
Kingdom Plantae
Division Magnoliophyta (Angiospermae)
Class Magnoliopsida (Dicotyledonae)
Order Solanales
Family Solanaceae
Genus Solanum
Scientific Name / Latin Name Solanum nigrum L.

కామంచి మొక్క భారతదేశమంతట లభిస్తుంది. దీని ఆకులను కూరగా చేసుకొని తింటారు. దీని పళ్ళు కొంచెము తీపి, పులుపు రుచి కలిగి ఉంటాయి. ఇది త్రిదోషోహరము, రసాయనము, వృష్యము మరియు అనుష్ణవీర్యము కటువిపాకములను కలిగి ఉంది. దీనిని చర్మ వ్యాధులు, శోష, గుండె జబ్బులు, వంతులు, ఎక్కిళ్ళు, అర్షమొలలు, జ్వరము మరియు మధుమేహములలో వాడతారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: కాకమాచి
  • హిందీ: మకోయ్
  • తెలుగు: కామంచి
  • లాటిన్: సోలనం నైగ్రామ్ లిన్నెయిస్
  • కుటుంబము: Solanaceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలో పోషక విలువల వివరాలు పేర్కొనబడలేదు)*

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కామెర్లు: కామంచి ఆకుల రసాన్ని త్రాగిన కామెర్లు తగ్గుతాయి.
  • నుసిపురుగులు: కామంచి పళ్ళు తిన్న యెడల నుసి పురుగులు తగ్గుతాయి.
  • అతి మూత్రవ్యాధి: కామంచి గింజల చూర్ణమును తిన్నయెడల అతి మూత్రవ్యాధి తొలగుతుంది.
  • కోరము-దద్దుర్లు: కాకమంచి రసమునందు శుంరిని కలిపి మెత్తగా చేసి లేపన చేసిన దద్దుర్లు తగ్గునులు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 407)
  • రచయిత: డా|| టి. భిక్షపతి