కానుగ / Indian Beech Tree

From LTRC
కానుగ / Indian Beech Tree
Kingdom Plantae
Division Magnoliophyta
Class Magnoliopsida
Order Fabales
Family Fabaceae
Genus Pongamia
Scientific Name / Latin Name పొంగామియా పిన్నెటా (Pongamia pinnata)

ఆంధ్రప్రదేశ్ అంతటా పెరిగే వృక్షము కానుగ. దీనిని రోడ్లకు ఇరు ప్రక్కల కూడా పెంచుతున్నారు. కానుగ మన నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. కానుగతో పళ్ళు తోముకున్న చిగుర్లు గట్టిపడతాయి. కానుగ బెరడు మరియు కానుగ గింజల తైలమునకు బ్యాక్టీరియాలను సంహరించే గుణముందని పరిశోధనలో గమనించదమైనది.

కానుగ కటుతిక్త కషాయరసము లఘుతీక్ష್ಣ గుణము ఉష్ణవీర్యము మరియు కటు విపాకములను కలిగివుంది ఇది కఫవాత శామకము దీపనము పాచనము కృమిఘ్నుము. అనే కర్మలను కలిగిఉంది. దీనిని అర్షమొలలు, చర్మవ్యాధులు మధుమేహము, విసర్పము, కడుపులోగడ్డలు, క్రిములు, దుష్టవ్రణాలు, యోని రోగములు మరియు ఉన్న్యాదము లాంటి వ్యాధుల్లో ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: కరంజ
  • హిందీ: డిశారి
  • తెలుగు: కానుగ
  • లాటిన్: పొంగామియా పిన్నెటా
  • కుటుంబము: Fabaceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలో పోషక విలువల వివరాలు పేర్కొనబడలేదు)*

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • రక్తపిత్తము: కానుగ గింజల చూర్ణమును నెయ్యి, తేనే కలిపి సేవించిన ఉపయుక్తంగా ఉండును.
  • అర్షమొలలు: కరంజ మూలత్వీక్ చూర్ణమును గోమూత్రంతో కలిపి త్రాగి కేవలం మజ్జిగ అన్నము మాత్రమే తీసుకొనిన అర్షమొలలు తగ్గుతాయి.
  • చర్మవ్యాధులు: కరంజ గింజలతైలము కుష్ఠురోగము నందు హితంగా ఉంటుంది. దీనిని రాయటం వలన గజ్జిలాంటి రోగములండు అత్యంత ఉపయోగకరం దుష్టవ్రణాలు తగ్గుతాయి.
  • వాంతి (చర్థి): కానుగ గింజలను వేయించి చిన్నముక్కలుగా చేసుకొని నమిలి మింగిన వాంతి తగ్గును.
  • కడుపుబ్బరం: కరంజ ఆకుల రసము త్రాగటం వలన ఆకలి మందించడండు, కడుపుబ్బరం లాంటి జబ్బులు తగ్గుతాయి. కరంజ వ్రేళ్ళుతో కషాయం కాచి దానితో పిస్టులా (భగందరము) మరియు గనేరియా వ్యాధి వలన వచ్చిన మచ్ఛలను కడిగిన అవి తొలగిపోతాయి. కానుగ పువ్వులను ఎండించి కషాయం తయారు చేసుకొని త్రాగిన దాహము తీరుతుంది. మధుమేహ రోగులకు ఇది చాలా మంచిది. ఇది ఇందనంగా పనిచేస్తుంది. ప్రస్తుతము దీనిని బాగా పెంచుతున్నారు. కానుగకు Anti-bacterial గుణాలు కూడా కలవు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 408-409)
  • రచయిత: డా|| టి. భిక్షపతి